
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సభలో వాడీవేడిగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సెషన్స్‌లో భాగంగా మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నేతలకు కౌంటరిచ్చారు.
సభలో శుక్రవారం కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు గాలి మాటలు మాట్లాడుతున్నారు. రుణమాఫీ చేయడంతో కాంగ్రెస్ నేతల ఫీజులు ఎగిరిపోయాయి. కాంగ్రెస్ హయాంలో ఏనాడైనా కనీసం ఆరు గంటలైనా కరెంట్ ఇచ్చారా?. ఎవరు రైతులను రాబందుల్లా పీక్కుతున్నారో ప్రజలకు తెలుసు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో సంచలన కామెంట్స్ చేశారు.
తెలంగాణలో కులగజ్జి, మత పిచ్చి లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో స్టేబుల్ గవర్నమెంట్ ఉందన్నారు. బెంగుళూరును వెనక్కి నెట్టి ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ నెంబర్ వన్ అయిందని పేర్కొన్నారు. ఐటీ అభివృద్ధిని ప్రతిపక్షాలు మెచ్చుకోవాలని చెప్పారు. 1987లో ఇంటర్ గ్రాఫ్ అనే సంస్థ హైదరాబాద్‌కు వచ్చిందని, ఈ విషయం మేమే ఐటీ తెచ్చామనే వారు తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్ హితవు పలికారు.
రజనీకాంత్ లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ గురించి చెప్పారని కానీ కొంతమంది ఇంకా కళ్లు తెరవడం లేదని విమర్శించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరిస్తున్నామని తెలిపారు. జిల్లాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హుజురాబాద్‌లో ఐటీ కంపెనీ వచ్చిందని ఈటలకు కూడా తెలుసుకోవాలన్నారు. మరోవైపు.. హైదరాబాద్‌లోని కోకాపేట భూముల వేలంపై అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడారు. కోకాపేట భూముల ధర రికార్డు బద్దల కొట్టిందని చెప్పారు. ఎకరం వంద కోట్లు పలికిందంటే హైదరాబాద్ అభివృద్ధి అర్థం చేసుకోవచ్చని తెలిపారు. డైలాగులు, ధర్నాలతో ఇంత ధర రాదని చురకలంటించారు.
ఇది కూడా చదవండి: కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు.. కేసీఆర్ ఏమన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment