సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ మెరుపు ముట్టడికి ఎస్‌ఎఫ్‌ఐ నేతలు, విద్యార్థులు యత్నించారు. 100 మందికి పైగా విద్యార్థులు ఒక్కసారిగి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనకు దిగిన మహిళలను సైతం ఈడ్చిపడేశారు. దీంతో అసెంబ్లీ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి.
ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్‌లు
►మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియింబర్స్‌మెంట్ రూ. 5,177 కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలి.
► పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి.
►హై స్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్‌లోకి విద్యార్థి సంఘాలను అనుమతించవద్దని సెక్యులర్ పేరుతో విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకోవాలి.
►తక్షణమే అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు కేజీబీవీ సంక్షేమ హాస్టల్ లను సొంత భవనాలు నిర్మించాలి.
► నూతన జాతీయ విద్యా విధానం 2020 తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీ తీర్మానం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment