అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా | Telangana Assembly Session Dec 18th Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

శాసనసభ రేపటికి వాయిదా

  • గురుకులాలపై శాసనసభలో చర్చ
  • కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ మధ్య పోటాపోటీ విమర్శలు
  • ముగిసిన చర్చ
  • శాసనసభ రేపటికి వాయిదా
2024-12-18 21:17:45

శాసన మండలి రేపటికి వాయిదా

  • శాసన మండలి రేపటికి వాయిదా
2024-12-18 20:09:43

తెలంగాణ చెల్లింపు, వేతనాలు, పెన్షన్స్ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ శాసన ఆమోదం

  • తెలంగాణ చెల్లింపు, వేతనాలు, పెన్షన్స్ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ శాసన ఆమోదం
2024-12-18 20:09:00

శ్రీధర్ బాబు, రాష్ట్ర మంత్రి

  • రాష్ట్రంలో విద్యార్థుల పట్ల బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ది లేదు
  • కాస్మోటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచినందుకు ధన్యవాదాలు కూడా చెప్పలేదు
2024-12-18 19:30:55

సీతక్క, రాష్ట్ర మంత్రి

  • ఆనాటి సీఎం కేసీఆర్ మనవడు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్తే ఇలా ఉన్నాయేంటి? అని ముక్కు మూసుకున్న సంఘటన అందరికీ తెలిసిందే
2024-12-18 19:30:55

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

  • వ్యక్తిగత కామెంట్స్ తొలగిస్తాం
2024-12-18 19:30:55

గంగుల వర్సెస్‌ పొన్నం

  • పూనకం వచ్చినట్లు ఎందుకు అడ్డం వచ్చారు : పొన్నంపై గంగుల
  • పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడవద్దు : గంగులపై పొన్నం
2024-12-18 19:30:55

పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి

  • కేసీఆర్, కేటీఆర్, హరీశ్ వారు ఎక్కడ నుంచి పోటీ చేశారు ?
  • వారు కూడా పారిపోయి వచ్చి పోటీ చేశారా ?
  • నీలాగా డబ్బు సంచులు లేవు
  • ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేస్తాం
  • నేను హుస్నాబాద్ ప్రజలు గెలిపించారు
  • మొదటిసారి ఎమ్మెల్యే పదాన్ని విత్ డ్రా చేసుకోవాలి
2024-12-18 19:30:55

గంగుల కమలాకర్, మాజీ మంత్రి

  • దొంగ సర్టిఫికేట్ల గురించి నేను మాట్లాడానా ?
  • కరీంనగర్ చౌరస్తా నుంచి ఎందుకు పారిపోయారని నేను అడిగానా ?
  • ఎవరైనా జిల్లా వదిలిపోతారా ?
2024-12-18 19:30:55

శ్రీధర్ బాబు, మంత్రి

  • మొదటి సారి వచ్చినా.. రెండోసారి వచ్చినా.. సభ్యులకు గౌరవం ఇవ్వాలి
2024-12-18 19:30:55

పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి

  • రాజకీయ శిక్షణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాలేదు
  • నేను గతంలో ఎంపీగా పనిచేశా
  • తెలంగాణ కోసం పోరాటం చేశా
  • మొదటిసారి ఎమ్మెల్యే అని అనడం భావ్యం కాదు
2024-12-18 19:30:55

గంగుల కమలాకర్, మాజీ మంత్రి

  • మొదటిసారి సభకు వచ్చారు(పొన్నంను ఉద్దేశించి..)
  • నేను మాట్లాడుతున్న 5 నిమిషాల్లోనే అడ్డుగా వచ్చారు
2024-12-18 19:30:55

పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి

  • బీఆర్ఎస్ హాయంలో గురుకులాలకు సొంత భవనాలు కూడా కట్టలేదు
  • గురుకులాల కాన్సెప్ట్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం
  • హాస్టళ్లలో ఉండి గంగుల కమలాకర్ చదవలేదు
  • కుట్ర కోణం ఉంది
  • రాజకీయంగా మాట్లాడుతున్నారు
2024-12-18 19:30:55

గంగుల కమలాకర్, మాజీ మంత్రి

  • మేం విద్యార్థులను భవిష్యత్ గా భావిస్తున్నాం
  • కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను భారంగా భావిస్తోంది
2024-12-18 19:30:55

గురుకులాలపై చర్చ.. మంత్రి సీతక్క ప్రసంగం

  • విద్యార్థులు అస్వస్థతకు గురైన మాట వాస్తవం
  • ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి.. ఒప్పుకుంటున్నాం
  • రానున్న రోజుల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పునారావృతం కాకుండా చర్యలు
  • నేను నిత్య విద్యార్థిని
  • ఇటీవలే ఎల్.ఎల్.ఎం పూర్తి చేశాను
  • మానవ వనరులను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది
  • రాష్ట్రంలో 3750 రెసిడెన్షియల్ స్కూల్స్, 25,840 సాధారణ పాఠశాలలు ఉన్నాయి
  • విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలను పెంచాం
  • 40 శాతం డైట్ ఛార్జీలను పెంచాం
  • విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం
  • ఆహారం కల్తీకాకుండా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం
  • రోజువారీ పర్యవేక్షణ చేస్తున్నాం
  • కామన్ డైట్  అమలు చేయడానికి చర్యలు
  • పోషకాలతో కూడిన రుచికరమైన ఆహారం అందించాలని లక్ష్యం
  • స్టోరేజీ, కిచన్ రూం, డైనింగ్ రూం నిర్వాహణ, ఆహారం కలుషితం కాకుండా శుభ్రత పాటించేలా చర్యలు
  • యంగ్ ఇండియ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించాం
  • అంతర్జాతీయ ప్రమాణాలతో దూరదృష్టితో 54 రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం
  • అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేశాం
  • ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం
2024-12-18 19:22:22

ఈ-రేస్‌ వ్యవహారంపై ఈ సమావేశాల్లోనే..

  • స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
  • ఈ-కార్‌ రేస్‌ అంశంపై  ఈ సమావేశాల్లోనే చర్చించాలని కోరిన  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
  • ఈ మేరకు స్పీకర్‌కు లేఖ సమర్పణ

 

 

2024-12-18 16:01:22

తిరిగి ప్రారంభమైన శాసనసభ

  • విరామం తరువాత తిరిగి ప్రారంభమైన తెలంగాణ శాసన సభ
  • గురుకుల పాఠశాలల పై ప్రారంభమైన లఘు చర్చ
  • గురుకుల పాఠశాల అంశంపై సభలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క
2024-12-18 15:34:26

స్పీకర్‌ వద్దకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

  • ఈ -కార్ రేసింగ్ వ్యవహారం పై సభలో చర్చ పెట్టాలని స్పీకర్ ను కోరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
  • ఈ కార్ రేస్ విషయం లో లీకులు  ఇవ్వడం ఎందుకు?: BRS ఎమ్మెల్యేలు
  • మేము తప్పు చేశాం అంటున్నారు కదా!: BRS ఎమ్మెల్యేలు
  • అసెంబ్లీ చర్చ కు రెడీ అంటున్నం: BRS ఎమ్మెల్యేలు
  • ఎవరిది తప్పూ చర్చ లో తేలుద్దాం: BRS ఎమ్మెల్యేలు
  • అసెంబ్లీ లో చర్చ పెడితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి: BRS ఎమ్మెల్యేలు
2024-12-18 15:27:20

ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలి: పొంగులేటి

  • సాదా బైనామాలకు అభ్యంతరాలు ఉంటే తెలుపుకునే అవకాశం కూడా చట్టంలో పొందుపరిచాం.
  • భూభారతి చట్టంలో భూదార్‌ అంశాన్ని కూడా చేర్చాం.
  • ప్రతీ రైతుకు ఒక భూదార్‌ కోడ్‌ ఇస్తాం.
  • సాదా బైనామాకు సంబంధించి 9.24లక్షల దరఖాస్తులు చేసుకున్నారు.
  • గత పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.
  • ప్రతీ ఏడాది జమా బందీ కార్యక్రమం నిర్వహించేలా చట్టంలో పొందుపరిచాం.
  • రాష్ట్రంలోని 10,900 గ్రామాల్లోని రెవెన్యూ వ్యవస్థను ఒక్క కలం పోటుతో కుప్పకూల్చారు. 
  • ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునేలా చట్టంలో రూపొందించాం. 
2024-12-18 12:19:07

బీఆర్‌ఎస్‌ నేతలే రూల్స్‌ పాటించడం లేదు: శ్రీధర్‌ బాబు

  • మంత్రి శ్రీధర్‌బాబు కామెంట్స్‌..
  • పదేళ్లలో చాలా సందర్భాల్లో రూల్స్‌ ఉల్లంఘించి సస్పెండ్‌ చేశారు.
  • సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చట్టం ఉండాలనేది మా అభిమతం.
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఒక​ రూల్‌.. ప్రతిపక్షంలో ఉంటే మరో రూల్‌.
  • మేము రూల్‌ బుక్‌ ప్రకారం వెళ్తున్నాం.
  • బీఆర్‌ఎస్‌ నేతలే రూల్స్‌ పాటించడం లేదు. 
2024-12-18 12:12:48

బిల్లుపై చర్చ పెట్టాలి: కూనంనేని

  • సీపీఐ ఎమ్మెల్యే  కూనంనేని కామెంట్స్‌..
  • భూభారతి కీలకమైన సబ్జెక్టు బిల్లు.
  • దీనిపై ప్రతిపక్షాల సూచనలు సలహాలు తీసుకోవాలి.
  • బిల్లుపై రేపు చర్చ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం
2024-12-18 12:06:14

మీరు సభా నియమాలను పాటించరా?: హరీష్‌

  • బిల్లుపై హరీష్‌ కామెంట్స్‌..
  • శాసనసభ అంటే శాసనాలు చేసే సభ.
  • సభలో ఏ బిల్లు పెట్టినా బిల్లు పెట్టే రెండు రోజుల ముందే సభ్యులకు అమెండ్మెంట్ అందించాలి.
  • శాసనసభ నిబంధనలు మాట్లాడితే స్పీకర్ గాని అధికారపక్షం కానీ ఇండియన్ మినిస్టర్ కానీ మాట్లాడడం లేదు.
  • మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం బిల్లును పెడతామంటే మేము సభలో ఉండం బయటికి వెళ్లిపోతాం.
  • మీరు సభా నియమాలను పాటించరా?.
  • బిల్లును ఈరోజు చదువుకుంటాం.. రేపు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి.
2024-12-18 12:06:14

ధరణి స్థానంలోనే భూభారతి: పొంగులేటి

  • 18 లక్షల 26వేల ఎకరాలు పార్ట్‌-బీలో ఉంది.
  • ఏ కారణం చేత ఈ భూమిని పార్ట్‌-బీలో పెట్టారు.
  • పాసు బుక్కుల్లో ఉన్న భూములకు, పొజిషన్‌లో ఉన్న భూములకు తేడా కనుక్కోవడానికి చట్టంలో నిబంధనలు రూపొందించాం.
  • అందరి సలహాలు, సూచనలతోనే భూభారతి బిల్లు.
  • ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి అవకాశమిచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
  • భూ సంస్కరణలను తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే.
  • కాంగ్రెస్‌ అంటే బాధ్యత.
  • ఇచ్చిన మాట ప్రకారమే ధరణిని సాగనంపాం.
  • ధరణి స్థానంలోనే భూభారతిని తెచ్చుకోవడం జరుగుతుంది.
  • ధరణి పోర్టల్‌తో భూ సమస్యలు కోర్టుకు ఎక్కాయి.
  • ధరణితో సమస్యలు తగ్గకపోగా.. సమస్యలు పెరిగాయి.
  • గ్రామ కంఠాలు, అమాది భూములకు ఈ చట్టం ద్వారా పరిష్కారం దొరుకుతుంది. 
  • సభ్యులు సలహాలు, సూచనలు చేస్తే తీసుకుంటాం. 
2024-12-18 12:00:51

బిల్లుపై మాకు సమయం ఇవ్వాలి: హరీష్‌

  • భూభారతిపై హరీష్‌ కామెంట్స్‌.. 
  • బిల్లు మా చేతికి రాకుండానే చర్చ అంటే ఎలా?.
  • బిల్లుపై మేము ప్రిపేర్‌ అవడానికి సమయం ఇవ్వాలి. 
2024-12-18 11:42:57

ఫలితాలు ఎలా ఉంటాయో బీఆర్‌ఎస్‌కు తెలుసు.. పొంగులేటి

  • బీఆర్‌ఎస్‌ పాలనలో భూ యజమానికి తెలియకుండానే భూమి చేతులు దాటింది.
  • భూభారతి బిల్లుపై గతంలో స్వల్పకాలిక చర్చ కూడా సభలో​ నిర్వహించాం.
  • ప్రజలకు మంచి జరుగుతుందనుకున్న ప్రతిదాన్ని భూభారతిలో పెట్టాం.
  • దీంతో, ఫలితాలు ఎలా ఉంటాయో బీఆర్‌ఎస్‌కు తెలుసు.
  • లోపభూయిష్టమైన ఆర్‌వోఆర్‌ చట్టం-2020ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాం.
  • లోపాల కారణంగా నాలుగు నెలలు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. 
     
2024-12-18 11:42:57

ధరణిపై పొంగులేటి సెటైర్లు..

  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్‌..
  • ఈరోజు ఒక చారిత్రాత్మకమైన రోజు.. అద్భుతమైన బాటల వేసిన రోజు.
  • 1971లో తెచ్చిన ఆర్‌వోఆర్ చట్టం సుమారు 49 సంవత్సరాలు విజయవంతంగా సాగింది.
  • వేలాది పుస్తకాలు చదివిన మేధావి తెచ్చిన 2020 ధరణి పోర్టల్‌లో లక్షల సమస్యలు వచ్చాయి.
  • కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది.  
  • రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన సమస్యలు కోర్టుల వరకు వెళ్లాల్సి వచ్చింది.
  • నాలుగు గోడల మధ్యలో కూర్చొని అప్పటి పాలకులు వారికి అనుకూలంగా ధరణి పోర్టల్ రూపొందించారు.
  • భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటి కాళ్ల కింద నేల కదిలిపోయింది.
  • సమస్యలు చెప్పుకున్న పరిష్కారం చేసే మార్గం లేకుండా పోయింది
2024-12-18 11:34:22

భూ భారతి బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం

  • భూ భారతి బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం
  • తెలంగాణ శాసన సభలో తెలంగాణ చెల్లింపు, వేతనాలు, పెన్షన్స్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం
  • తెలంగాణ శాసనసభలు భూ భారతి 2024 బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం

  •  
2024-12-18 11:34:22

మంత్రి కోమటిరెడ్డికి హరీష్‌ కౌంటర్‌..

  • కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు.
  • వ్యక్తిగతమైనటువంటి విమర్శలు సభలో చేయకూడదని కొద్దిసేపటి క్రితమే మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.
  • సిద్ధులు మాకే కాదు తమ మంత్రులకు కూడా చెప్పాలి .
  • కమీషన్ గురించి మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్టాలు అన్ని వరుసగా చదువుతాను.
  • కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాపై చేసిన వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలి.
2024-12-18 11:10:51

హరీష్‌పై మంత్రి కోమటిరెడ్డి సెటైర్లు..

  • హరీష్‌పై మంత్రి కోమటిరెడ్డి సెటైర్లు..
  • అసెంబ్లీలో హరీష్‌రావు వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైరికల్ కామెంట్స్.
  • హరీష్‌రావుకు దబాయించడం తప్ప పని చేయడం తెలియదు.
  • నేను మాట్లాడుతుండగా ఎంత రిక్వెస్ట్ చేసినా కూర్చోవడం లేదు.
  • ఆయనకు కూలిపోయే కాళేశ్వరం కట్టి కమిషన్ తీసుకోవడం మాత్రమే తెలుసు.
  • రోడ్లు వేయడం చాతకాదు.. కూలిపోయే ప్రాజెక్టులు కట్టారు.
  • లక్ష కోట్ల విలువ చేసే ఓఆర్‌ఆర్‌ అమ్ముకున్నారు.
  • వచ్చే మార్చి నాటికి రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాము.
  • వచ్చే నాలుగు ఎండ్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ను పూర్తి చేస్తాం
2024-12-18 11:05:03

మంత్రి కోమటిరెడ్డి సీరియస్‌

  • మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్‌..
  • పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనా కాలంలో రోడ్లను విధ్వంసం చేశారు.
  • ఉప్పల్ ప్లై ఓవర్‌ను ఆరేళ్ళు ఖాళీగా పెట్టారు.
  • బీఆర్‌ఎస్‌కు రోడ్ల పై అవగాహన లేదు.
  • గత పాలకులకు ఎంతసేపు పైసలు వచ్చే కాళేశ్వరం తప్ప రోడ్లను పట్టించుకోలేదు.
  • కమిషన్‌ తీసుకుని కూలిపోయే కాళేశ్వరం కట్టారు. 
  • మాజీ సీఎం ఫామ్‌ హౌస్‌ కోసం నాలుగు లైన్ల రోడ్లను ఆరు వందల కోట్లతో వేసుకున్నారు.
  • దీంతో, రోడ్ల విషయంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 
2024-12-18 10:58:10

బీఆర్‌ఎస్‌ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌.

  • బీఆర్‌ఎస్‌ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌.
  • బీఆర్‌ఎస్‌ పార్టీ ఆటో కార్మికులపైన మొసలి కన్నీరు కారుస్తుంది
  • ఆటో కార్మికులపై మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు ఏంటి?
  • మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడిందని ఆరోపణ తప్పు
  • బస్సు.. ప్రయాణికుల ఇంటికి వెళ్లడం లేదు
  • గతంలో లాగానే బస్సు స్టాండ్ నుండి పోతుంది
  • ప్రజలు ఇంటి దగ్గర నుండి బస్టాండ్‌కి వెళ్ళడానికి ఆటోలను వాడుతున్నారు
  • ఎన్నికలలో ఆటో కార్మికులకు 12 వేలు సంవత్సరానికి ఇస్తామని అన్నాం.
  • మీ నిర్వాకం వల్ల ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయాం.
  • భవిష్యత్‌లో ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది
  • ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్లు వేసుకోవడం నిన్న బేడీలు వేసుకొని వేషాలు వేయడం రాజకీయ డ్రామా
  • అటువంటివి చేయకండి
  • మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఏ రోజైనా రవాణా శాఖ మంత్రికి ఆటో కార్మికుల సమస్యలపై రీప్రజెంటేషన్ చేశారా?.  
  • ప్రజాస్వామికంగా ఆటో కార్మికులను తీసుకుని రండి ఆటో కార్మికుల సమస్యలపై చర్చిద్దాం.
2024-12-18 10:56:01

కొత్త సభ్యులకు మాట్లాడే అవకాశమివ్వాలి..

  • ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ రావు కామెంట్స్‌..
  • శాసనసభలో కొత్త ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి.
  • ఎప్పుడు శాసనసభ జరిగినా కొత్త ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు.
  • సభలో మాట్లాడే అవకాశం రాకపోవడంతో నియోజకవర్గంలో మా సిగ్గు పోతుంది.
  • ప్రతిపక్ష నాయకులు పేపర్లలో ఫొటోల కోసం సభను సజావుగా నడవనివ్వడం లేదు.
  • 20 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే సీనియర్ నాయకులు సీరియస్‌గా సభలు తీసుకోవడం లేదు.
  • చాలా బాధేస్తోంది అధ్యక్ష..
  • మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాకపోతే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి.
2024-12-18 10:49:57

మండలిలో ఆరోగ్యశ్రీపై కీలక ప్రకటన..

  • మండలిలో ఆరోగ్యశ్రీపై కీలక ప్రకటన..
  • మండలిలో హోంశాఖపై ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, తీన్మార్ మల్లన్న, జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం సమాధానాలు
  • తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిని 5-10 లక్షలకు పెంచుకున్నాం.
  • ఆరోగ్య శ్రీలో అనేక చికిత్సలు చేర్చాం
  • హోంశాఖలో ఇతర పోలీసులకు అమలు చేస్తున్న మాదిరి హోంగార్డులకు కూడా వర్తించేలా చేస్తాం
  • రోడ్డు ప్రమాదాలపై హోంశాఖ సాలరీల నుండి క్రెడిట్ చేసి ఆర్టీసీ మాదిరి ప్రమాదాలు జరిగినప్పుడు అందిస్తాం..
  • హోంశాఖలో ఎవరైనా ప్రమాదాల్లో మరణిస్తే కోటి రూపాయలకు పైగా భీమా వచ్చేలా చేస్తున్నాం..
  • ఇప్పటికే ఈ భీమా పథకం ఆర్టీసీలో అమలు చేస్తున్నాం అక్కడ ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే కోటి రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం
  • పోలీసుల ఆరోగ్య పరమైన అంశం  తెలంగాణ ప్రభుత్వం బాధ్యత..
  • వారికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎవరైనా చికిత్స నిరాకరిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది..
  • సిద్దిపేట పోలీసులు గజ్వేల్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన దానిపై కూడా ఇప్పటికే కేసు నమోదైంది.
  • వారికి రావాల్సినవి అన్ని ప్రభుత్వం అందిస్తుంది.
2024-12-18 10:47:35

పాడి కౌశిక్‌ రెడ్డిపై స్పీకర్‌ ఆగ్రహం

  • బీఆర్‌ఎస్‌ సభ్యులపై స్పీకర్‌ ఆగ్రహం..
  • సభలో బీఆర్ఎస్ సభ్యులు గందరగోళం చేయడంపై స్పీకర్ ఆగ్రహం.
  • సభా సమయం వృథా చేయడం బీఆర్ఎస్ సభ్యులకు అలవాటు అయిపోయింది.
  • అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారు.
  • కౌశిక్ రెడ్డి రన్నింగ్ కామెంట్స్ చేస్తే.. సభ నుండి సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చిన స్పీకర్.
2024-12-18 10:40:04

ఇదేనా 20 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే?

  • కాంగ్రెస్‌ విప్‌ ఆది శ్రీనివాస్ కామెంట్స్‌..
  • వివేక్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.
  • కమీషన్ కాకతీయ, కమీషన్ పేర్లతో బర్లు ఇచ్చింది బీఆర్ఎస్ కాదా?.
  • కమీషన్‌ల పేరుతో బీఆర్ఎస్ దోచుకుంది.
  • పేరుకు కొందరు 20 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు..
  • ఇదేనా 20 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే? 
     
2024-12-18 10:40:04

వివేక్‌ వ్యాఖ్యలపై సభలో దుమారం..

  • వివేక్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలన్న శ్రీధర్ బాబు.
  • వివేక్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదు.
  • ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ సభ్యులు ఇష్టానికి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.
  • వివేక్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.
  • 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వమే రూల్ ఫ్రేమ్ చేసింది.
  • అసెంబ్లీలోకి ఇతర దుస్తులు వేసుకురావద్దని బీఆర్ఎస్ రూల్స్ ఫ్రేమ్ చేసింది..
  • నిన్న నల్ల దుస్తులు వేసుకొస్తే.. అయ్యప్ప భక్తి అనుకున్నాం.
  • ఈరోజు ఆటో డ్రైవర్ దుస్తులు వేసుకున్నారు.
  • అధికారం ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా.. బీఆర్ఎస్ వ్యవహారం ఉంది
  • ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ చిన్నాభిన్నం చేసింది.
  • ఇచ్చిన హామీలను అమలు చేయడానికి మాకు ఇంకా సమయం ఉంది.. చేస్తాం.
  • 320 రూల్ ప్రకారం వివేక్ చేసిన వ్యాఖ్యలను తొలగిస్తున్నాం అన్న స్పీకర్..
  • స్పీకర్ ప్రకటన చేసినప్పటికీ మరోసారి 10 శాతం లంచం తీసుకొంటున్నారన్న వివేక్
  • ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ సభ్యులపై స్పీకర్‌ ఆగ్రహం. 
     
2024-12-18 10:35:57

బీఆర్‌ఎస్‌పై శ్రీధర్‌ బాబు ఫైర్‌

  • మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్‌..
  • ప్రభుత్వంపై నిందలు మోపే ముందు సీనియర్ శాసన సభ్యులు ఆలోచన చేయాలి
  • నిబంధనల మేరకు మాట్లాడాలి
  • సభ్యుడి మీద ఆరోపణ చేసే ముందు స్పీకర్‌కు సమాచారం ఇవ్వాలి
  • వెంటనే వివేక్ ఆరోపణలు విరమించుకోవాలని డిమాండ్
  • విత్ అవుట్ నోటీస్ ఎవరి మీద ఆరోపణ చేయవద్దు
  • రూల్స్ వాళ్ళే ఫ్రేమ్‌ చేసుకున్నారు.. వాళ్ళే రూల్స్ అతిక్రమిస్తున్నారు
  • ఆటో టాక్స్‌లు పెంచింది బీఆర్‌ఎస్‌ వాళ్లే. 
2024-12-18 10:30:09

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ నేతలు

  • అసెంబ్లీ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేక్ కామెంట్స్‌..
  • విదేశాలకు వెళ్లి విద్యార్థులు ఇరుక్కుపోయారు
  • 3rd, 4th ఇన్ స్టాల్ మెంట్ రాకపోవడంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఇబ్బంది పడుతున్నారు
  • భవిష్యత్తులో ఈ స్కీంను కొనసాగిస్తారా ?
  • వంద కోట్ల రూపాయలు పేద విద్యార్థులకు ఎందుకు కేటాయించలేకపోతోంది?
  • బిల్లులు చెల్లించాలంటే 10 శాతం చెల్లిస్తేనే.. విడుదల చేస్తున్నారు.
  •  
  • మంత్రి సీతక్క కామెంట్స్‌..
  • మేము వచ్చిన తర్వాత 140 కోట్లు చెల్లించాం
  • ఎత్తివేత అనే ప్రస్తావనే లేదు
  • మార్చి వరకు క్లియర్ చేస్తాం
  • 244 కోట్లలో 140 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం..
  • మార్చి వరకు 104 కోట్లు క్లియర్ చేస్తాం
  • దీంతో, సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. 

2024-12-18 10:29:22

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?: పాయల్‌ శంకర్‌

  • ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ కామెంట్స్‌..
  • అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి పాయల్ శంకర్ కామెంట్స్‌..
  • రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?.
  • ప్రభుత్వ వ్యవహారంపై ఆశ్చర్యం వేస్తోంది
  • కాంగ్రెస్‌కి ఓటు వేసినందుకు ప్రజలు బాధ పడుతున్నారు
  • రాష్ట్ర పరిపాలన చేసే వారే రాజ్‌భవన్ ముట్టడికి వెళ్తారా?
  • సీఎం రాజ్‌భవన్ ముట్టడికి పోతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి?
  • అసెంబ్లీ సమావేశాల సమయంలో రాజ్‌భవన్ ముట్టడిలా?
  • సమావేశాలను తప్పించుకోవడం కోసం రాజ్‌భవన్ ముట్టడి.
  • రాజ్‌భవన్ ముట్టడిపై పునరాలోచించాలి
2024-12-18 10:09:40

ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ నేతలు

  • కేటీఆర్‌ కామెంట్స్‌..
  • ఆటో డ్రైవర్ల సమస్యలపై ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ , మండలికి ఆటోల్లో బయలుదేరిన బీఆర్‌ఎస్‌ నేతలు.
  • ఆటో డ్రైవర్ల సమస్యపై బీఆర్ఎస్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం.
  • ప్రభుత్వ అనాలోచిత చర్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లు.
  • ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కుటుంబాలను ఆదుకోవాలని వాయిదా తీర్మానం.
  • కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు,
  • ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని బీఆర్ఎస్ డిమాండ్.
2024-12-18 10:03:22

మూసీ సుందరీకరణ ఎవరికి లాభం: కవిత

  • అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత కామెంట్స్‌..
  • మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌ ఎవరికి లాభం చేసేందుకు?
  • ఫిల్మినరీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ పేరుతో డీపీఆర్‌ ఇచ్చారు.

  • పేదల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్నారు.
  • సిండికేట్‌ కాంట్రాక్టర్లకు మూసీ ప్రాజెక్ట్‌ పేరుతో రూ.160కోట్లు రిలీజ్‌ చేశారు.
  • ప్రభుత్వ చర్యలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
  • కానీ సభలో మంత్రి శ్రీధర్ బాబు మాత్రం శాసనమండలిలో డీపీయర్ ఇవ్వలేదు అని చెప్పారు
  • అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం డీపీఆర్ ఇవ్వలేదు అని అబద్ధాలు చెబుతుంది
     
2024-12-18 09:14:41

ధరణి పేరు భూమాతగా..

  • ధరణి పేరు భూమాతగా..
  • 2024 ఆర్‌వోర్ చట్టం ద్వారా ధరణి పేరు భూమాతగా మారనుంది
  • కొత్త ఆర​్‌వోఆర్ చట్టంలో కీలక అంశాలు.
  • భూ సమస్యలపై అప్పీల్‌లకు అవకాశం కల్పిస్తూ సవరణ
  • పరిష్కారానికి ల్యాండ్ ట్రిబ్యునల్లు ఏర్పాటు
  • ప్రతి భూ కమతానికి భూధార్. గ్రామ కంఠంలోని స్థలాలకు హక్కులు
  • రద్దు కానున్న ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్వోఆర్-2020 చట్టం
  • పట్టా భూముల యజమానుల హక్కుల సంరక్షణతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు కూడా కొత్త చట్టంలో సెక్షన్లు.
  • భూ సమస్యలపై సివిల్ కోర్టులకు వెళ్లకుండా సులువుగా పరిష్కరించే విధంగా సవరణ
     
2024-12-18 08:53:34

నేడు సభ ముందుకు ఆర్‌వోఆర్‌ బిల్లు..

  • అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు ఆర్‌వోఆర్‌ బిల్లు..
  • నేడు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ.
  • మొదట ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న స్పీకర్.
  • సభలో 2024 ఆర్‌వోర్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న రెవెన్యూ మంత్రి.
  • గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులపై సభలో స్వల్పకాలిక చర్చ.
2024-12-18 08:53:34
Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement