తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీజేపీ ఎమ్మెల్యే Vs మంత్రులు | Telangana Assembly Sessions Day-1 Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీజేపీ ఎమ్మెల్యే Vs మంత్రులు

16వ తేదీ వరకూ వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ

  • తెలంగాణ అసెంబ్లీ  సమావేశాలు వాయిదా
  • ఈనెల 16వ తేదీ వరకూ వాయిదా పడ్డ తెలంగాణ శాసనసభ సమావేశాలు
2024-12-09 15:11:18

అభివృద్ధి ఎక్కడ.. బీజేపీ ఎమ్మెల్యే

  • బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కామెంట్స్‌..
  • శాసన సభలోనే కాదు, ప్రభుత్వం ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం లేదు.
  • దక్షిణ తెలంగాణ తప్ప అభివృద్ధి మాకు లేదు.
  • ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ప్రభుత్వం పాటించడం లేదు.
  • శాసన సభ మాకు పెద్ద దిక్కు..
  • అందుకే ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నాం
     
2024-12-09 12:07:45

బీజేపీ Vs కాంగ్రెస్‌.. తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చ

  • తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు
  • బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కామెంట్స్‌..
  • సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినంగా ప్రభుత్వం జరపాలి.
  • విగ్రహాలు, పేర్లు మార్చడం వల్ల అభివృద్ధి జరగదు.
  • విగ్రహం ఆవిష్కరణలో బీజేపీని పిలిచారు.. మరి రూపకల్పనలో ఎందుకు అభిప్రాయం తీసుకోలేదు
  • పార్టీకో విగ్రహం.. ప్రభుత్వానికో విగ్రహం ఉంటుందా?
  • పార్టీ విగ్రహం ఇప్పటికే ఉందని మంత్రి అంటున్నారు.
  • మంత్రి పొన్నం కామెంట్స్‌..
  • బీజేపీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదు
  • తెలంగాణకు పదేళ్లలో గేయం, చిహ్నం, విగ్రహం లేదు
  • తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పటి వరకు లేదు.
  • మార్చారు అనే వ్యాఖ్యలు వద్దు.
  • మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్‌..
  • పదేళ్ళలో తెలంగాణ తల్లి విగ్రహం లేదు.
  • విగ్రహం ఉందని తప్పుడు ప్రచారం చేయొద్దు
  • సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు.
  • ప్రభుత్వం పనితీరు పై ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాం.
  • ప్రతిపక్షాలు ఓపికతో ఉండాలి.. డైవర్ట్ కావద్దు.
2024-12-09 11:59:15

బీఆర్‌ఎస్‌ పేరుతో తెలంగాణ ఎక్కడుంది?: కోమటిరెడ్డి

  • మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్‌..
  • బీఆర్‌ఎస్‌ నాయకులు అసెంబ్లీ బయట పిచ్చి వేషాలు వేస్తున్నారు.
  • తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభ కార్యక్రమంలో ప్రతిపక్షాలు తమ పాత్ర పోషించాలి.
  • కాంగ్రెస్ పార్టీలో తప్ప రాష్ట్రంలో ఏ పార్టీలోనూ తెలంగాణ పదం లేదు.
  • కేసీఆర్ పార్టీలో టీ తీసివేని బీ పెట్టుకున్నారు.
  • తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌ నాయకులకు లేదు.
  • సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు నాడు కేసీఆర్ కనీసం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదు.
  • ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు అంటే వేల పుస్తకాలు చదివి ఏం లాభం
2024-12-09 11:49:57

ఆనాడు కేసీఆర్‌ చేసింది తప్పు..

  • కూనంనేని సాంబశివరావు కామెంట్స్‌..
  • ఆనాడు తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు అప్పటి ప్రతిపక్ష పార్టీలను కేసీఆర్ పిలిచారా?
  • తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనలో అన్ని పక్షాల పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
  • ఆనాటి ఉద్యమ స్ఫూర్తి - పోరాట పటిమ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
  • ఏడాది పాలనలో ప్రభుత్వం రివ్యూ చేసుకోవాలి.. అప్పుడు ఇప్పుడూ ఒకేలా లేదు
  •  
2024-12-09 11:49:57

డిసెంబర్ 9వ తేదీన అధికారిక ఉత్సవాలు..

  • పొన్నం ప్రభాకర్ కామెంట్స్‌..
  • గత పదేళ్లుగా తెలంగాణ తల్లి గత పాలకులు ఎందుకు తీసుకురాలేదు.
  • పదేళ్లుగా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు
  • కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక్కటిగా పరిష్కారం చేసుకుంటూ వస్తోంది.
  • భవిష్యత్‌లో అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి.
  • రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 9వ తేదీన అధికారిక ఉత్సవాలు జరపాలి.
     
2024-12-09 11:49:57

విగ్రహ ఆవిష్కరణకు అందరూ రావాలి..

  • పోచారం శ్రీనివాసరెడ్డి కామెంట్స్‌..
  • ఎమ్మెల్యేలు భాష మార్చుకోవాలి..
  • హుందాగా ఉండాలి.
  • రాజకీయాలకు అతీతంగా అందరూ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కు రావాలి.
  • తెలంగాణ తల్లి జన్మనిచ్చింది కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం.
2024-12-09 11:49:57

బతుకమ్మ ఉంటే బాగుండేది..

  • బీజేపీ ఎమ్మెల్యే  పాయల్ శంకర్ కామెంట్స్‌..
  • తెలంగాణ తల్లి విగ్రహంపై అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుంటే బాగుండేది.
  • తెలంగాణ తల్లి నెత్తిపై బతుకమ్మ ఉంటే బాగుండు అని మా అభిప్రాయం.
  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గేయం, చిహ్నం, విగ్రహం మార్చారు.
  • అన్ని మార్చుతున్న సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టే 317ను మార్చాలి.
  • ఏదైనా మార్చే అధికారం మీకు ఉన్నది.. కానీ పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అందరి అభిప్రాయం తీసుకోవాలి
     
2024-12-09 11:49:57

తెలంగాణభవన్‌కు బీఆర్‌ఎస్‌ నేతలు

  • తెలంగాణభవన్‌కు బీఆర్‌ఎస్‌ నేతలు
  • అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌ నేతలు అరెస్ట్‌
  • అరెస్ట్‌ అనంతరం వారిని తెలంగాణభవన్‌కు తరలించిన పోలీసులు.
  •  
2024-12-09 11:11:54

ఈ ఒక్క రోజు రాజకీయాలు వద్దు: శ్రీధర్‌ బాబు

  • శ్రీధర్ బాబు కామెంట్స్‌..
  • డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ప్రకటన సోనియా గాంధీ చేశారు.
  • సమస్త తెలంగాణ ప్రజల కల నెరవేర్చిన రోజు డిసెంబర్ 9వ తేదీ.
  • తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ పై ప్రతిపక్ష నాయకుడు తన అనుభవం చెప్తారు అని ఆశించాం.
  • అసెంబ్లీకి రావద్దు.. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో పాల్గొనవద్దని అసెంబ్లీ రూల్స్ కు విరుద్ధంగా బీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తోంది.
  • ఈ ఒక్కరోజు రాజకీయాలు భేషజాలు పక్కన పెట్టాలి.
  • ఇది ప్రత్యేకమైన అంశం.. అందరూ పాల్గొనాలి
2024-12-09 11:10:21

తెలంగాణ తల్లి అంటే భావోద్వేగం: సీఎం రేవంత్‌

  • సీఎం రేవంత్‌ కామెంట్స్‌..
  • తెలంగాణ తల్లి అంటే భావోద్వేగం..
  • డిసెంబర్‌ 9 తెలంగాణ ప్రజలకు పర్వదినం.
  • తెలంగాణ ఏర్పాటు పునాది పడిన రోజు.
  • అమరుల త్యాగాలకు అనుగుణంగా సోనియా తెలంగాణ ప్రకటన చేశారు.
  • 60 ఏళ్ల తెలంగాణ‍ ప్రజల ఆకాంక్షను సోనియా నెరవేర్చారు.
  • తెలంగాణ తల్లి విగ్రహంపై రేవంత్‌ ప్రకటన..
  • నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి.
  • మనల్ని లక్ష్యసాధన వైపు నడిపించిన తల్లి తెలంగాణ తల్లి.
  • తెలంగాణ నేల స్వేచ్చ కోసం పిడికిలి బిగించిన ఉజ్వల జ్వాల.
  • నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల శక్తి తెలంగాణ తల్లి.
  • తెలంగాణ తల్లి రూపకల్పనలో సంస్కృతి, సాంప్రదాయాలను తీసుకొచ్చాం.
  • మెడకు కంటె, గుండు పూసల హారంతో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన జరిగింది.
  • సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మ స్పూర్తితో విగ్రహం
  • చేతిలో వరి, జొన్నలు, సజ్జలతో తెలంగాణ తల్లి విగ్రహం.
  • పుట్టుక నీది, చావు నీది అన్న కాళోజీ మాటల ‍స్పూర్తితో యువత ఉద్యమించింది.
  • అగ్నికీల్లలో దేహాలు మండినా తెలంగాణ సాధన కోసం యువత వెనకడుగు వేయలేదు.
  • తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం.
  • పత్రీ ఏటా డిసెంబర్‌ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం.
  • చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలి.
2024-12-09 10:53:05

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత..

  • తెలంగాణ అసెంబ్లీ గేటు నెం-2 వద్ద ఉద్రిక్తత.
  • బీఆర్‌ఎస్‌ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు.
  • రేవంత్‌-అదానీలు కలిసి ఉన్న ఫొటోలతో టీ షర్టులు వేసుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
  • టీ షర్టులు వేసుకోవడంపై అధికారుల అభ్యంతరం.
  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
  • కేటీఆర్‌ కామెంట్స్‌..
  • అసెంబ్లీలో ప్రజా సమస్యలను ఎత్తి చూపుతాం. 
  • కాంగ్రెస్‌ ద్వంద్వ విధానాలను ఎండగడతాం.
  • రేవంత్‌-అదానీ ఒక్కటై ప్రజలను మోసం చేస్తున్నారు. 

2024-12-09 10:16:04

అసెంబ్లీకి చేరుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు..

  • అసెంబ్లీకి చేరుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు..
  • అసెంబ్లీకి చేరుకున్న మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..
  • అసెంబ్లీ కమిటీ హాల్‌లో భేటీ అయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు
  • కాసేపట్లో ప్రారంభం కానున్న సీఎల్పీ సమావేశం
  • మరోవైపు.. సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. 
2024-12-09 09:53:34

అమరవీరులకు బీఆర్‌ఎస్‌ నేతల నివాళులు..

  • అమరవీరులకు బీఆర్‌ఎస్‌ నేతల నివాళులు..
  • అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ నేతలు..
  • ఉదయం 9:30 నిమిషాలకు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్న నేతలు..
  • అనంతరం అసెంబ్లీ  సమావేశాలకు హాజరుకానున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు.
2024-12-09 07:45:50

ఎన్ని రోజులు సమావేశాలు?

  • ఎన్ని రోజులు సమావేశాలు?
  • అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై సందిగ్ధత నెలకొంది.
  • సభ కొనసాగింపుపై రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
  • సోమవారం సభ వాయిదా పడిన తర్వాత మంగళ, బుధవారాలు మినహాయించి గురువారం నుంచి మళ్లీ సమావేశాలు?
  • అలాగే, వారం పాటు కొనసాగుతాయని చర్చ జరుగుతోంది.
  • మరోవైపు సోమవారం తర్వాత ఈ నెల 16వ తేదీకి అసెంబ్లీ వాయిదా పడుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
2024-12-09 07:42:02

సభ ముందుకు రెవెన్యూ చట్టం.. మహిళా వర్సిటీ..

  • రెవెన్యూ చట్టం.. మహిళా వర్సిటీ.. 
  • శాసనసభ శీతాకాల సమావేశాల్లో రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌వోఆర్‌)–2024 చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
  • ఆర్‌వోఆర్‌–2020 చట్టానికి పలు సవరణలు చేసి దీనిని రూపొందించింది.
  • ‘హైడ్రా’కు చట్టబద్ధత కల్పించనుంది.
  • మహిళా యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటీ బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి.
  • ప్రభుత్వం చేపట్టిన కులగణన అనంతర కార్యాచరణ..
  • స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ప్రకటన చేసే అవకాశం.
  • రైతు రుణమాఫీ జరిగిన తీరును, రైతు భరోసా విధివిధానాలను అసెంబ్లీ వేదికగానే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
     
2024-12-09 07:42:02

వాడీ వేడిగా సమావేశాలు..

  • కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తి.
  • సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం.
  • రాష్ట్ర ప్రభుత్వం హామీల అమల్లో విఫలమైందంటూ ఛార్జిషీట్లు ప్రకటించిన బీజేపీ.
  • ఆయా అంశాలను, ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు ఏర్పాట్లు
  • బీఆర్‌ఎస్‌ సైతం హామీలపై ప్రశ్నలు సంధించేందు ప్లాన్‌.
  • హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించాలని కోరాలని ఎంఐఎం భావిస్తోంది.
2024-12-09 07:42:02

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సీఎం ప్రకటన..

  • తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సీఎం ప్రకటన..
  • ప్రభుత్వానికి సంబంధించి పలు సంస్థ ల వార్షిక నివేదికలను సభ ముందు ఉంచనున్న సీఎం ,డిప్యూటీ సీఎం.
  • పంచాయతీ రాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను సభలో పెట్టనున్న సీతక్క.
  • తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సభలో ప్రకటన చేయనున్న సీఎం.
2024-12-09 07:42:02

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

  • నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
  • తెలంగాణలో నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
  • ఉదయం 10:30 గంటలకు శాసనమండలి, శాసనసభ భేటీ కానున్నాయి.
  • ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎల్పీ సమావేశం జరుగుతుంది.
  • సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది.
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు సూచనలు చేయనున్న రేవంత్ రెడ్డి.
  • అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం.

2024-12-09 07:31:42
Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement