ప్రధాన వార్తలు

చంద్రబాబు ముఖంలో అదే క్రూరత్వం, కుటిలత్వం: సజ్జల
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని అయిపోయిందని.. ప్రజా సమస్యలపై ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా ఆయనకు లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. యోగా డే పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారంటూ.. శనివారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మామిడి రైలు సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. చంద్రబాబు తీరుతో తీరుతో ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. చివరకు సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఆయనకు ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా లేకుండా పోయిందని, సీఎంగా చంద్రబాబు పని అయిపోయిందని సజ్జల అన్నారు. 👉జగన్ మొన్నీమధ్యే వెళ్లి వచ్చాక కేంద్ర మంత్రి వెళ్లి పొగాకు రైతులను కలిశారు. గతంలో గిట్టుబాటు ధరలు లేకపోతే జగన్ పిలిచి చర్చలు జరిపేవారు. గిట్టుబాటు ధర వచ్చేదాకా చేయాల్సిందంతా చేసేవారు. కానీ, ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదు. కేవలం మీడియా హైప్‌తోనే చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారు. 👉రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. కూటమి పాలనలో వీధుల్లోనే గంజాయి అమ్ముతున్నారు. కుప్పంలో జరిగే అరాచకాలు చంద్రబాబుకి కనిపించడం లేదా?. పోలీసుల వ్యవస్థను భ్రష్టు పట్టించారు. అమాయకులపై, వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. అడిగితే తాట తీస్తా! అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలను సజ్జల వీడియో ప్రదర్శించి చూపించారు.👉హిప్నటిస్ట్ తరహాలో చంద్రబాబు ప్రవర్తన ఉంటోంది. చంద్రబాబు తాను చేసే తప్పులను ఎదుటి వారిపై నెడతారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏది జరిగినా జగన్‌పై నెపం వేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. యోగా డే పేరుతో తండ్రీకొడుకులు డ్రామాలు చేస్తున్నారు. యోగా బాగా అలవాటు ఉండేవారికి స్థితప్రజ్ఞత కనిపిస్తుంది. కానీ, చంద్రబాబు మోహంలో అదే క్రూరత్వం, కుటిలత్వం కనిపిస్తున్నాయి. 👉చంద్రబాబుకి అధికారం అంటే బాధ్యత లేదు. లేని స్కాం పేరు చెప్పి డ్రామా చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు విఫలం అయ్యాయి. ఆయన అధికారంలో వచ్చాక అనేక పథకాలకు కోత పట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు తప్పకుండా చంద్రబాబుని నిలదీస్తారు. వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ నిబద్ధతతో ఇచ్చిన హామీలు అమలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక లక్షా 67 వేల కోట్లు అప్పు చేశారు. ఎన్నికల సమయంలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ఇంటింటికీ బాండ్లు పంపిణీ చేశారు. ఇప్పుడది చంద్రబాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ హామీలు అమలు చేసేదాకా ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తూనే.. పోరాడుతూనే ఉంటుంది’’ అని సజ్జల ఉద్ఘాటించారు.

ఉక్రెయిన్ మొత్తం మాదే.. పుతిన్ సంచలన ప్రకటన
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటేనని.. ఉక్రెయిన్ మొత్తం రష్యాదే అంటూ వ్యాఖ్యలు చేశారు. దీని ప్రకారం ఉక్రెయిన్ మొత్తం తమదేనని అన్నారు. దీంతో, పుతిన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు తెర లేపాయి.రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ..‘ఉక్రెయిన్ను నాశనం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఇదే విషయం నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఉక్రెయిన్ తమకు తాముగా సమస్యలను సృష్టించుకుంటోంది. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటే. దీని ప్రకారం ఉక్రెయిన్ మొత్తం మాదే. ఉక్రెయిన్ నగరం సుమీని స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యం మాకు లేదు. ఉక్రెయిన్‌లో శాంతి సాధించాలనుకుంటే మాతో కలిసి రావాలి. మేము ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదు. అలాగే, ఉక్రెయిన్ లొంగిపోవాలని కూడా మేము కోరుకోవడం లేదు. రష్యా శాంతికి కట్టుబడే ఉంది. ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆకాంక్షలను వదులుకోవాలి. ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాలపై మాస్కో నియంత్రణను అంగీకరించాలి. ఉక్రెయిన్ స్వతంత్రంగా మారిన 1991 ఒప్పందాలను గుర్తుచేసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.Russians and Ukrainians are one people, and in that sense, the whole of Ukraine is ours — Putin 😳 pic.twitter.com/krghibrx0m— Frontalforce 🇮🇳 (@FrontalForce) June 20, 2025ఖండించిన పుతిన్అయితే, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని నివాస ప్రాంతాలపై తాము దాడి చేశామన్న వ్యాఖ్యలను పుతిన్ ఖండించారు. తమ సైన్యం అటువంటి లక్ష్యాలను ఢీకొట్టలేదని వెల్లడించారు. తాము నివాస గృహాలపై దాడులు చేయలేదని, సైనిక స్థావరాలపైనే చేశామన్నారు. జెలెన్ స్కీతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కానీ గతేడాది తన పదవీకాలం ముగియడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన చట్టబద్ధతను కోల్పోయారని ఆరోపించారు.ఈ సందర్భంగా పుతిన్..‘జెలెన్ స్కీతో సహా ఎవరినైనా కలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది సమస్య కాదు. ఉక్రెయిన్ ఆయనకు చర్చలు జరిపే బాధ్యత అప్పగిస్తే, జెలెన్ స్కీనే అనుమతించండి. అసలు ప్రశ్న ఏమిటంటే ఫలితంగా వచ్చే పత్రాలపై ఎవరు సంతకం చేస్తారు? సంతకం చట్టబద్ధమైన అధికారుల నుంచి రావాలి. జెలెన్ స్కీ అధ్యక్ష పదవీకాలం గతేడాది అధికారికంగా ముగిసింది. మార్షల్ లా విధించడం వల్ల అతడి వారసుడిని ఎన్నుకోలేదు. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం పదవీ కాలం ముగిస్తే అధ్యక్ష అధికారాలను పార్లమెంటు స్పీకర్‌కు బదిలీ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పదవిలో కొనసాగవచ్చని జెలెన్ స్కీ వాదిస్తున్నారు. అయితే తీవ్రమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు మేము చట్టపరమైన అంశాల గురించి శ్రద్ధ వహిస్తాం. సంతకం చట్టబద్ధమైన అధికారుల నుంచి రావాలి. లేకపోతే జెలెన్ స్కీ తర్వాత ఎవరు వచ్చినా దానిని చెత్తబుట్టలో వేస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు.

పల్నాడులో వైఎస్సార్సీపీ నేతలపై కేసులు.. మేరుగు రాధా, కొండా శీను..
సాక్షి, పల్నాడు: ఏపీలో కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతల టార్గెట్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులపై పోలీసుల అక్రమ కేసులు పెట్టారు. ఫిర్యాదులో పలువురు నేతల పేర్లను పేర్కొన్నారు.👉ఇక, వైఎస్సార్సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ రెడ్డిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. పుష్ప-2 సినిమాలో డైలాగు పోస్టర్ రూపంలో చూపించిన బోల్లెద్దు రవితేజ కేసులో గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. ఈ కేసులో 223, 352, 351(2), 189(3), 192, 61(2), 126(2), 288, 298, 192 BNS r/w 190(2), BNS నాన్ బెయిల్ బుల్ సెక్షన్లతో కేసు నమోదు చేయడం గమనార్హం.👉అలాగే, రాజుపాలెం మండలం బలిచేపల్లికి చెందిన మేరుగ రాధాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేస్ బుక్‌లో వచ్చిన పోస్టును ఆమె.. ఫార్వర్డ్ చేసినందుకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయడం విశేషం.👉మాచర్ల వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడు కొండా శీనును నిన్న సాయంత్రం గుంటూరులో దుర్గి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు కొండా శీనును పోలీసులు తీసుకెళ్లారు. అయితే, కొండా శీనుకు సంబంధించిన సమాచారం తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.

ఐఐటీలకు ధీటుగా ఎల్పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ
భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)లో ఇటీవలి ఫ్లేస్‌మెంట్ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్పీయూ ప్లేస్మెంట్ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్‌పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్మెంట్ డ్రైవ్‌తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్‌తో భారీ ఎల్పీయూ ప్లేస్మెంట్ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్వర్క్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్‌ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్‌గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్పీయూ తాజా ప్లేస్మెంట్ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్‌పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్‌గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్మెంట్ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్‌కు ప్రపంచ ఖ్యాతిఎల్‌పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్మెంట్ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్పీయూ ఎందుకంటే?ఎల్పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్మెంట్ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్ ప్లేస్మెంట్ ట్రెయినింగ్ పొందుతారు.‘ఎల్పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్మెంట్ ల్యాండ్ స్కేప్‌లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్‌పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్‌ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

‘ఇది విలువల లొంగుబాటు’.. కేంద్రంపై సోనియా మండిపాటు
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్ణణల విషయంలో భారత్ మౌనం వహించడం అనేది దౌత్యపరమైన లోపాన్ని ఎత్తిచూపుతున్నదని, ఇది దేశ నైతిక, వ్యూహాత్మక సంప్రదాయాల నిష్క్రమణను సూచిస్తుందని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ‘ది హిందూ’లో ఆమె జూన్ 13న ఇరాన్ భూభాగంపై జరిగిన ఇజ్రాయెల్ సైనిక దాడిని చట్టవిరుద్ధమైనదిగా, సార్వభౌమాధికార ఉల్లంఘనగా అభివర్ణించారు.రెండు ప్రాంతీయ శక్తుల మధ్య జరుగుతున్న ప్రతీకార డ్రోన్, క్షిపణి, వైమానిక దాడులు మధ్యప్రాచ్యంలో ప్రమాదకరమైన పరిస్థితులను తీసుకువస్తున్నాయి. దీనిపై స్పందించిన భారత జాతీయ కాంగ్రెస్ ఈ బాంబు దాడులను, ఇరాన్ గడ్డపై చోటుచేసుకున్న హత్యలను ఖండించింది. ఇవి ప్రాంతీయంగానూ ప్రపంచస్థాయిలోనూ పొంచివున్న ముప్పు తీవ్రతను సూచిస్తాయని పేర్కొంది. ఇటువంటి చర్యలు అస్థిరతను మరింత తీవ్రతరం చేస్తాయని, మరిన్ని సంఘర్షణకు బీజం వేస్తాయని సోనియా గాంధీ ఆ వ్యాసంలో పేర్కొన్నారు.సోనియా గాంధీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కూడా విమర్శలు గుప్పించారు. ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తూ, అందుకు అనుకూలంగా తన సొంత నిఘా వర్గాలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. ట్రంప్ గతంలో పలు యుద్ధాలు, సైనిక-పారిశ్రామిక సముదాయ శక్తుల గురించి హెచ్చరించారని, అయితే ఇప్పుడు ఇరాక్ యుద్ధానికి దారితీసిన తప్పులను పునరావృతం చేస్తున్నట్లు కనిపిస్తోందని సోనియా పేర్కొన్నారు. ఈ వ్యాసంలో సోనియా భారతదేశానికున్న ప్రత్యేకమైన దౌత్య స్థానానికి ప్రాధాన్యతనిచ్చారు.ఇరాన్ భారతదేశానికి దీర్ఘకాల మిత్రదేశమని, జమ్మూ కశ్మీర్‌తో సహా కీలక సమయాల్లో ఇరాన్ మద్దతు ఉన్నదన్నారు. 1994లో కాశ్మీర్ సమస్యపై యూఎన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్‌లో భారతదేశాన్ని విమర్శించే తీర్మానాన్ని నిరోధించడంలో ఇరాన్ సహాయపడిందని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తన దౌత్య పాత్రను పునరుద్ఘాటించాలని భారత ప్రభుత్వానికి సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్- ఇరాన్ యుద్దంలో భారత్ కల్పించుకోకపోవడాన్ని ఆమె విలువ లొంగుబాటుగా ఉన్నదని విమర్శించారు. ఈ విషయంలో భారత్ వైఖరి స్పష్టంగా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను అనుసరించాలని ఆమె సూచించారు. ఇది కూడా చదవండి: ‘యుద్ధం’ ఆపితే నోబెల్ రాదు: ట్రంప్ అదే ‘మధ్యవర్తిత్వ’ వాదనలు

అలా అయితే అవుట్ అయిపోతావు! గిల్‌కు పంత్ వార్నింగ్.. వైరల్
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా అదరగొట్టింది. సీనియర్లు లేకపోయినా మేమున్నాము కదా అంటూ యువ ఆటగాళ్లు బ్యాట్‌తో చెలరేగారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)తో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) శతకంతో చెలరేగితే.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.భారీ భాగస్వామ్యాలుజైసూ 101 పరుగులు సాధించి.. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా.. శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి గిల్ 127, పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా జైస్వాల్ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (42)తో కలిసి తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించడంతో పాటు.. గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 129 పరుగులు జతచేశాడు.అనంతరం గిల్‌కు తోడైన పంత్ అభేద్యంగా 138 పరుగుల భాగస్వామ్యం జోడించి.. అతడితో కలిసి నాటౌట్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి భారత్ 85 ఓవర్లు ఆడి మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది.ఇక మొదటి రోజు ముగింపునకు చేరే క్రమంలో షాట్ ఎంపిక విషయంలో గిల్‌కు పంత్ స్నేహపూర్వక హెచ్చరిక జారీ చేశాడు.ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ సంధించిన ఫుల్లర్ బాల్‌ను ఆడేందుకు క్రీజు వెలుపలికి వచ్చిన గిల్.. షార్ట్ కవర్ దిశగా బాదాడు.అలా అయితే అవుట్ అయిపోతావు!ఆ సమయంలో నాన్- స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న పంత్.. ‘‘క్రీజు బయటకు వచ్చేటపుడు కాస్త చూసుకో.. ఏమాత్రం తేడా జరిగినా క్యాచ్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది’’ అని హెచ్చరించాడు. మైక్ స్టంప్‌లో ఈ మాటలు రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.కాగా ఇంగ్లండ్‌తో టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లింది. ఈ సిరీస్‌తో ఇరుజట్లు తమ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌ను మొదలుపెట్టాయి. ఇక ఇదే సిరీస్‌తో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. అతడికి డిప్యూటీగా రిషభ్ పంత్ తమ ప్రస్థానం మొదలుపెట్టారు.ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లోని హెడింగ్లీలో తొలి మ్యాచ్ జరుగుతుండగా.. ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్), లార్డ్స్ (లండన్), ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ (మాంచెస్టర్), కెన్నింగ్టన్ ఓవల్ (లండన్) మిగిలిన టెస్టులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు👉షెడ్యూల్: జూన్ 20- 24👉వేదిక: హెడింగ్లీ, లీడ్స్👉టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్👉తొలిరోజు ఆట ముగిసేసరికి టీమిండియా స్కోరు: 359/3 (85).చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్‌పై మాజీ కెప్టెన్ ఫైర్Warning: When @RishabhPant17's on strike, expect some advice and plenty of chatter between the wickets! 😜🎙️Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/v53iqPg8cm— Star Sports (@StarSportsIndia) June 20, 2025

61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్
దేశవ్యాప్తంగా ఏఐ ఆధారిత మోసాలను గుర్తించే వ్యవస్థను ప్రారంభించిన 37 రోజుల్లోనే ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లోని 6.1 మిలియన్ల మంది వినియోగదారులను ఆన్లైన్ మోసగాళ్ల బారిన పడకుండా కాపాడినట్లు ఎయిర్టెల్ తెలిపింది. పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించే చర్యల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు చెప్పింది.వినియోగదారులకు సైబర్ దాడుల నుంచి రక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్‌ను ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని యోచించింది. అందులో భాగంగా ఎయిర్టెల్ ఈ విధానాన్ని ప్రారంభించిన 37 రోజుల్లోనే రెండు రాష్ట్రాల్లో 6.1 మిలియన్లకు పైగా వినియోగదారులను విజయవంతంగా రక్షించిందని ఒక ప్రకటనలో తెలిపింది. అధునాతన వ్యవస్థ ఎస్ఎంఎస్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఈ-మెయిల్స్, ఇతర బ్రౌజర్లలోని లింక్‌లను స్కాన్ చేసి ఫిల్టర్ చేస్తుందని తెలిపింది.ఇది ప్రతిరోజూ ఒక బిలియన్ యూఆర్ఎల్స్ను (యూనిఫాం రిసోర్స్ లొకేటర్లు) పరిశీలించడానికి రియల్ టైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. హానికరమైన సైట్ల నుంచి జరిగే ప్రమాదాన్ని గుర్తించి 100 మిల్లీ సెకన్లలో రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: నాన్న చెప్పిన ఒక్క మాటతో రూ.1,200 కోట్లు సంపాదనఉదాహరణకు, ఒక వినియోగదారుకు ‘మీ ప్యాకేజీ ఆలస్యం అయింది. ట్రాక్ చేయాలంటే వెంటనే క్లిక్ చేయండి’ అంటూ ఓ మేసేజ్ వచ్చిందనుకుందాం. ఆ లింక్‌పై యూజర్ క్లిక్ చేస్తే ఎయిర్టెల్ సిస్టమ్ వెంటనే లింక్‌ను స్కాన్ చేస్తుంది. అనుమానాస్పదంగా ఉంటే యాక్సెస్‌ను బ్లాక్ చేస్తుంది. దాంతోపాటు యూజర్‌కు హెచ్చరిక సందేశం పంపుతుంది. ‘బ్లాక్ చేయబడింది! ఎయిర్టెల్ ఈ సైట్‌ను ప్రమాదకరంగా గుర్తించింది!’ అని పాప్అప్ మెసేజ్ వస్తుంది.

2028లో రప్పా రప్పా.. 3.0 లోడింగ్.. ట్రెండింగ్‌లో హరీష్ రావు ఫొటో
సాక్షి, సంగారెడ్డి: పుష్ప-2 సినిమాలోని రప్పా.. రప్పా.. డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తలపెట్టిన రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులు, పోస్టర్లు దర్శనమిచ్చాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు.. ఫుల్ జోష్‌లో కనిపించారు.పటాన్ చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. హరీష్ రావు రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులను కార్యకర్తలు చూపించారు. 2028లో రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్ అంటూ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో, ధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా ప్లకార్డులు నిలిచాయి. మరోవైపు.. హరీష్ రావు మాట్లాడుతూ..‘కేటీఆర్‌పై కేసు పెట్టడం.. కేసీఆర్‌ను కమిషన్ ముందుకు పిలవడం తప్ప రేవంత్ ఏం చేశాడు. రాష్ట్రంలో ఏ సర్వే చేసిన మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుంది అని అంటున్నాయి. రెండు లక్షల మంది రైతుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది.. మీ అందరికి రైతు భరోసా వచ్చే వరకు పోరాటం ఆపేది లేదు. ఇది ఆరంభం మాత్రమే. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని తలవకుండా రేవంత్ స్పీచ్ ఉండదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. రెండు లక్షల మంది రైతులు ఔటర్ రింగ్ రోడ్డు మీద ధర్నా చేస్తే రేవంత్ మైండ్ బ్లాక్ అవుతుంది. రైతుబంధు ఇవ్వకపోతే రంగారెడ్డి, మల్కాజిగిరి, సంగారెడ్డి రైతులందరూ కదులుతారు జాగ్రత్త. వెంటనే రెండు లక్షల మంది రైతులకు రైతుబంధు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దేవాదుల ఏ బేసిన్ లో ఉందని రేవంత్ అడగడం హాస్యాస్పదం. నల్లమల్లల పుట్టిన అని చెప్పుకొనే రేవంత్.. నల్లమల్ల ఎక్కడ ఉంది? అని అడుగుతున్నాడు. కౌశిక్‌ను అరెస్ట్ చేయడం దారుణం.. రేవంత్‌ని ప్రశ్నిస్తే అర్దరాత్రి ఓ అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘స్ట్రా' మూవీ రివ్యూ.. కూతురు కోసం ఒంటరి మహిళ పోరాటం
ఓ ఊహకు మంచి ఆలోచన తోడై దానికి క్రియేటివిటీ అనే మసాలాను జోడిస్తే అవుతుంది ఓ అద్భుతమైన సినిమా. ఒక వ్యక్తిని అది కూడా ఒక తల్లిని... పరిస్థితులు, సమాజం నిస్సహయరాయుల్ని చేస్తే... నలుగురు కలిసి అన్ని రకాలుగా ఒక మూలకు నెట్టేస్తే ఆమేం చేసిందన్న విషయాన్ని ఊహకు అందనట్టుగా అదే సమయంలో మనసుకు హత్తుకునేట్టుగా తీసే దర్శకులు ప్రపంచ స్థాయిలో చాలా మందే ఉన్నారు. బోలెడంత ఖర్చుతో , పెద్ద స్టార్ కాస్టింగ్ తో ఓ కథను తీయడం పెద్ద కష్టమేమీ కాదు, కాని అదే సమయంలో చిన్న ఆలోచనను చిన్న స్టార్ కాస్ట్ తో ప్రేక్షకుడిని ఆకట్టుకోవడం కత్తి మీద సామే. అలా తన ఆలోచనకు తానే నిర్మాతగా మారి, దర్శకత్వం వహించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన హాలివుడ్ దర్శకుడు టైలర్ పెర్రీ నిజంగా పెద్ద సాహసమే చేశాడు. ఆ సాహసం పేరే తాను తీసిన సినిమా స్ట్రా(Straw Movie Review). చిన్న ఆలోచనతో తన సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కదలనివ్వకుండా చేసిన సినిమా ఈ స్ట్రా. ఇది ఓ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే.అంతలా ఏముందీ సినిమాలో ఓసారి చూద్దాం...జనయా ఓ సింగిల్ మదర్, తన కూతురితో చిన్నపాటి ఇరుకు గదిలో అతి కష్టం మీద సర్దుకుంటూ ఉంటుంది. ఓ షాపింగ్ మాల్ లో పని చేసే జనయాకు ఆనందం అన్న విషయమే తెలియదు, అంతగా ఆమె జీవితం కష్టాలమయం. కనీసం స్కూల్ లో కూతురికి ఓ రోజు బ్రెడ్ కూడా పెట్టలేని పరిస్థితి. ఓ రోజు కూతురి బ్రెడ్ కోసం డబ్బులు లేక బ్యాంకు కు వెళ్ళి విత్ డ్రా చేయడానికి వెళితే, బ్యాంకు సిబ్బంది ఏదో కారణాల వల్ల డబ్బు ఇవ్వలేమని చెబితే వాళ్ళని ఎదిరించడానికి గన్ చూపిస్తుంది. బ్యాంకు లో గన్ చూపించడంతో అక్కడ ఉన్న సిబ్బంది అవాక్కయి పోలీసులకు ఫోన్ చేస్తారు.ఇక అక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది. జనయాకి బ్యాంకుల వాళ్ళు డబ్బులు ఇస్తారా, లేదా గన్ చూపించినదానికి జనయాను పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. చూడడానికి ఇది చిన్న కథే అయినా ఆఖర్లో వచ్చే ట్విస్ట్ తో చూసే ప్రేక్షకుల మతి పోవడం ఖాయం. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా తరాజి పి హాన్సన్ జీవించిందని చెప్పవచ్చు. నిజానికి ఆ ఆలోచనకే దర్శకుడికి హాట్సాఫ్ చెప్పవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా పెద్ద వాళ్ళకు మాత్రమే. అలాగే ఇది తెలుగులోనూ లభ్యమవుతుంది. ఈ రివ్యూ చదివిన ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కాని ఇలాంటి సినిమా మాత్రం చాలా అరుదు. మస్ట్ వాచ్.

‘యుద్ధం’ ఆపితే నోబెల్ రాదు: ట్రంప్ అదే ‘మధ్యవర్తిత్వ’ వాదనలు
న్యూఢిల్లీ: భారత్- పాకిస్తాన్ మధ్య శాంతి నెల కొల్పోందుకు తాను మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు వాదనకు దిగారు. గత నెలలో భారత్- పాక్ దేశాల మధ్య భీకరంగా జరగబోయే యుద్ధాన్ని ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల భారత్-పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం లేదని, ఇది ప్రత్యక్ష సైనిక చర్చల ఫలితమని స్పష్టం చేసినప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్ మరోమారు ఇదేవిధమైన వ్యాఖ్యలు చేశారు.‘భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నాకు నోబెల్ బహుమతి లభించదు. సెర్బియా- కొసావో మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నాకు నోబెల్ బహుమతి రాదు. ఈజిప్ట్- ఇథియోపియా మధ్య శాంతిని నెలకొల్పినందుకు కూడా నోబెల్ శాంతి బహుమతి దక్కదు. మధ్యప్రాచ్యంలో అబ్రహం ఒప్పందాలను చేసినందుకు కూడా నాకు నోబెల్ శాంతి బహుమతి లభించదు’ అంటూ అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఒక పోస్టులో పేర్కొన్నారు. అలాగే తాను రష్యా/ఉక్రెయిన్, ఇజ్రాయెల్/ఇరాన్‌తో సహా ఎక్కడ ఏమి చేసినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదని, ఈ అంశాల్లో ఫలితాలు ఏమైనా కావచ్చు. ప్రజలకు అంతా తెలుసు. తనకు ఇదే ముఖ్యమని ట్రంప్ అన్నారు.డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో- రువాండా మధ్య వాషింగ్టన్లో శాంతి ఒప్పందం కుదిరిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విధమైన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆఫ్రికాకు ఘనమైన దినం. నిజం చెప్పాలంటే, ప్రపంచానికే గొప్ప దినం. దీనికి కూడా తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా న్యూఢిల్లీ- ఇస్లామాబాద్ మధ్య ఉద్రిక్తతలను అరికట్టడంలో అమెరికా పాత్రను భారతదేశం తిరస్కరిస్తూ వస్తోంది.ఇది కూడా చదవండి: International Yoga Day: ఉత్సాహంగా జపాన్ ప్రధాని భార్య యోషికో యోగాసనాలు
Mega 157: స్కూల్లో డ్రిల్ మాస్టర్‌గా చిరంజీవి!
ఉద్దేశపూర్వకంగా మీటింగ్‌కు డుమ్మా! కడప కమిషనర్‌కు మళ్లీ నోటీసులు
IND vs ENG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్?!
దేశీయ కళలకు జీవం పోసేలా ఎన్ఎంఏసీసీ భారీ ఈవెంట్
రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?
అక్కడ ట్రాఫిక్ జామ్... ఇలా వెళ్లండి !
Bihar: దగ్గరపడుతున్న ఎన్నికలు.. పింఛను పెంచిన సీఎం నితీష్
మా ఊరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దు
ఒక రోజు.. ఒక ఊరు.. కదిలిన యంత్రాంగం
నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
ఎన్టీఆర్‌ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్‌వర్మ మరెవరో కాదు..
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
భారీ రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 10 లేడీ సింగర్స్ వీళ్లే!
అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు?!
Plane Crash: విషాదంగా ముగిసిన మరో దంపతుల కథ..!
‘డిప్యూటీ సీఎం కనబడుటలేదు’
సాక్షి కార్టూన్ 20-06-2025
మేఘాలయ హనీమూన్ కేసులో విస్తుపోయే నిజాలు
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం
Mega 157: స్కూల్లో డ్రిల్ మాస్టర్‌గా చిరంజీవి!
ఉద్దేశపూర్వకంగా మీటింగ్‌కు డుమ్మా! కడప కమిషనర్‌కు మళ్లీ నోటీసులు
IND vs ENG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్?!
దేశీయ కళలకు జీవం పోసేలా ఎన్ఎంఏసీసీ భారీ ఈవెంట్
రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?
అక్కడ ట్రాఫిక్ జామ్... ఇలా వెళ్లండి !
Bihar: దగ్గరపడుతున్న ఎన్నికలు.. పింఛను పెంచిన సీఎం నితీష్
మా ఊరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దు
ఒక రోజు.. ఒక ఊరు.. కదిలిన యంత్రాంగం
నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
ఎన్టీఆర్‌ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్‌వర్మ మరెవరో కాదు..
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
భారీ రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 10 లేడీ సింగర్స్ వీళ్లే!
అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు?!
Plane Crash: విషాదంగా ముగిసిన మరో దంపతుల కథ..!
‘డిప్యూటీ సీఎం కనబడుటలేదు’
సాక్షి కార్టూన్ 20-06-2025
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం
’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’
సినిమా

ఆమిర్ కొత్త సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
రీసెంట్ టైంలో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ పరిస్థితి అస్సలు బాగోలేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో 2018లో 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'తో వస్తే దారుణమైన డిజాస్టర్. 2022లో 'లాల్ సింగ్ చద్దా'తో వస్తే అదే సీన్ రిపీట్. దీంతో విపరీతమైన ట్రోలింగ్. కట్ చేస్తే యాక్టింగ్ కొన్నాళ్ల పాటు చేయనని చెప్పిన ఆమిర్.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత 'సితారే జమీన్ పర్' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి తొలిరోజు ఎంత కలెక్షన్ వచ్చాయంటే?స్పానిష్ మూవీ 'ఛాంపియన్స్'కి రీమేక్‌గా 'సితారే జమీన్ పర్' సినిమా తీశారు. రిలీజ్‌కి ముందే ఆమిర్ ఖాన్ ప్రమోషన్లలో కాస్త హడావుడి చేశాడు గానీ బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.11.5 కోట్ల మాత్రమే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రిలీజైన హిందీ చిత్రాల్లో తొలిరోజు అత్యధిక కలెక్షన్ వచ్చిన 6వ చిత్రంగా నిలిచింది. అయితే ఆమిర్ స్టార్‌డమ్‌కి ఈ కలెక్షన్ చాలా తక్కువనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 'కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా?)ఎందుకంటే ప్రాంతీయ భాషల్లో తీస్తున్న సినిమాలే తొలిరోజు రూ.10-20 కోట్లు వసూళ్లు సాధిస్తున్నాయి. అలాంటిది ఆమిర్ ఖాన్ సినిమాకు తొలిరోజు దాదాపు రూ.11 కోట్లు మేర వసూళ్లు రావడం అంటే ఆలోచించాల్సిన విషయం. అయితే మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి వీకెండ్స్‌లో ఈ నంబర్స్ పెరగొచ్చేమో చూడాలి? ఈ సినిమాని ఏ ఓటీటీకి అమ్మని ఆమిర్.. 8 వారాల తర్వాత యూట్యూబ్‌లో పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు.'సితారే జమీన్ పర్' విషయానికొస్తే.. ఢిల్లీ బాస్కెట్ బాల్ టీమ్‌కి అసిస్టెంట్ కోచ్‌గా గుల్షన్ అరోరా(ఆమిర్ ఖాన్) పనిచేస్తుంటాడు. హెచ్ కోచ్‌తో గొడవ జరిగి అతడిని కొడతాడు. ఆ కోపంలో తాగి బండి నడిపి పోలీస్ వాహనాన్ని గుద్దేస్తాడు. దీంతో కోర్ట్.. శిక్ష విధించకుండా మానసిక దివ్యాంగులకు మూడు నెలల పాటు బాస్కెట్ బాల్ కోచింగ్ ఇవ్వాలని ఆదేశిస్తుంది. అలా 10 మంది దివ్యాంగులకు కోచ్‌గా మారతాడు. వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చే విషయంలో గుల్షన్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో 'సితారే' టీమ్ గెలిచిందా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)

‘స్ట్రా' మూవీ రివ్యూ.. కూతురు కోసం ఒంటరి మహిళ పోరాటం
ఓ ఊహకు మంచి ఆలోచన తోడై దానికి క్రియేటివిటీ అనే మసాలాను జోడిస్తే అవుతుంది ఓ అద్భుతమైన సినిమా. ఒక వ్యక్తిని అది కూడా ఒక తల్లిని... పరిస్థితులు, సమాజం నిస్సహయరాయుల్ని చేస్తే... నలుగురు కలిసి అన్ని రకాలుగా ఒక మూలకు నెట్టేస్తే ఆమేం చేసిందన్న విషయాన్ని ఊహకు అందనట్టుగా అదే సమయంలో మనసుకు హత్తుకునేట్టుగా తీసే దర్శకులు ప్రపంచ స్థాయిలో చాలా మందే ఉన్నారు. బోలెడంత ఖర్చుతో , పెద్ద స్టార్ కాస్టింగ్ తో ఓ కథను తీయడం పెద్ద కష్టమేమీ కాదు, కాని అదే సమయంలో చిన్న ఆలోచనను చిన్న స్టార్ కాస్ట్ తో ప్రేక్షకుడిని ఆకట్టుకోవడం కత్తి మీద సామే. అలా తన ఆలోచనకు తానే నిర్మాతగా మారి, దర్శకత్వం వహించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన హాలివుడ్ దర్శకుడు టైలర్ పెర్రీ నిజంగా పెద్ద సాహసమే చేశాడు. ఆ సాహసం పేరే తాను తీసిన సినిమా స్ట్రా(Straw Movie Review). చిన్న ఆలోచనతో తన సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కదలనివ్వకుండా చేసిన సినిమా ఈ స్ట్రా. ఇది ఓ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే.అంతలా ఏముందీ సినిమాలో ఓసారి చూద్దాం...జనయా ఓ సింగిల్ మదర్, తన కూతురితో చిన్నపాటి ఇరుకు గదిలో అతి కష్టం మీద సర్దుకుంటూ ఉంటుంది. ఓ షాపింగ్ మాల్ లో పని చేసే జనయాకు ఆనందం అన్న విషయమే తెలియదు, అంతగా ఆమె జీవితం కష్టాలమయం. కనీసం స్కూల్ లో కూతురికి ఓ రోజు బ్రెడ్ కూడా పెట్టలేని పరిస్థితి. ఓ రోజు కూతురి బ్రెడ్ కోసం డబ్బులు లేక బ్యాంకు కు వెళ్ళి విత్ డ్రా చేయడానికి వెళితే, బ్యాంకు సిబ్బంది ఏదో కారణాల వల్ల డబ్బు ఇవ్వలేమని చెబితే వాళ్ళని ఎదిరించడానికి గన్ చూపిస్తుంది. బ్యాంకు లో గన్ చూపించడంతో అక్కడ ఉన్న సిబ్బంది అవాక్కయి పోలీసులకు ఫోన్ చేస్తారు.ఇక అక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది. జనయాకి బ్యాంకుల వాళ్ళు డబ్బులు ఇస్తారా, లేదా గన్ చూపించినదానికి జనయాను పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. చూడడానికి ఇది చిన్న కథే అయినా ఆఖర్లో వచ్చే ట్విస్ట్ తో చూసే ప్రేక్షకుల మతి పోవడం ఖాయం. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా తరాజి పి హాన్సన్ జీవించిందని చెప్పవచ్చు. నిజానికి ఆ ఆలోచనకే దర్శకుడికి హాట్సాఫ్ చెప్పవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా పెద్ద వాళ్ళకు మాత్రమే. అలాగే ఇది తెలుగులోనూ లభ్యమవుతుంది. ఈ రివ్యూ చదివిన ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కాని ఇలాంటి సినిమా మాత్రం చాలా అరుదు. మస్ట్ వాచ్.

హీరోయిన్ అంటే గ్లామర్ అనుకుంటివా..ఫైర్.. ‘తగ్గేదే లే’
ఒకరు తుపాకీ పట్టుకున్నారు.... మరొకరు ఖడ్గం అందుకున్నారు... ఇంకొకరు చేతికి దొరికిన ఆయుధం తీసుకున్నారు... చూడ్డానికి సున్నితంగా కనిపించే ఈ భామలందరూ ఇలా ‘వెపన్స్’ పట్టుకున్నది విలన్లను రఫ్ఫాడించడానికే. ప్రస్తుతం బాలీవుడ్ పాపులర్ హీరోయిన్లు కొందరు ‘యిన్ యాక్షన్’ అంటూ యాక్షన్ రోల్స్ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై మెరుపు తీగల్లా కనిపించే ఈ తారలు మెరుపు వేగంతో ఫైట్స్ చేయడానికి ‘సై’ అన్నారు. ఆ పోరాటాల్లోకి వెళదాం. శివానీ రిటర్న్స్ శివానీ శివాజీ రాయ్‌ని తొలిసారి ప్రేక్షకులు ‘మర్దానీ’ (2014) చిత్రంలో చూశారు. ఈ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రను రాణీ ముఖర్జీ అద్భుతంగా చేశారు. ఆ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘మర్దానీ 2’ (2019)లోనూ పోలీస్‌గా విజృంభించారు రాణి. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. మరోసారి శివానీ శివాజీ రాయ్‌గా ‘మర్దానీ 3’లో కనిపించనున్నారు రాణీ ముఖర్జీ. ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో తొలి భాగం ‘మర్దానీ’ని, రెండో భాగాన్ని గోపీ పుదిరన్ దర్శకత్వంలో నిర్మించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ మూడో భాగం ‘మర్దానీ 3’ని అభిరాజ్ మినావాలా దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తొలి, మలి భాగాల్లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా చేసిన రాణీ ముఖర్జీ ‘మర్దానీ 3’లోనూ ఆ పాత్ర చేస్తున్నారు. కాగా ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్‌లో రాణి చేసిన యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పదేళ్ల క్రితం ఫస్ట్ పార్ట్‌లో ఎంత ఎనర్జిటిక్‌గా కనిపించిందో ఇప్పుడూ అలానే కనిపిస్తోందనే కితాబులు ఆమెకు దక్కాయి. ఇక సినిమాలో ఏ రేంజ్లో విజృంభించారో చూడాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ ఆగాల్సిందే. ‘‘చెడుపై పోరాటం చేసే శివానీ శివాజీ రాయ్‌ని తెరపైకి తీసుకురావడానికి హోలీ కన్నా మంచి సమయం ఏం ఉంటుంది. 2026 మార్చి 4న హోలీ. ఓ వారం ముందే ఫిబ్రవరి 27న మా శివానీ థియేటర్స్‌కి వస్తుంది’’ అని యశ్ రాజ్ సంస్థ ఓ సందర్భంలో పేర్కొంది. వారియర్ క్వీన్ సిల్వర్ స్క్రీన్‌పై మెరుపు తీగలా కనిపించే దీపికా పదుకోన్ మెరుపు వేగంగా ఫైట్ చేయడం కూడా చూశాం. అందుకు ఉదాహరణగా ఈ మధ్య వచ్చిన చిత్రాలు ‘పఠాన్, ఫైటర్, సింగమ్ ఎగైన్’లను చెప్పుకోవచ్చు. ఇప్పుడు సౌత్ సినిమాలో తన యాక్షన్‌ని చూపించడానికి రెడీ అయ్యారు దీపికా పదుకోన్. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ΄పాన్ ఇండియన్ మూవీ ‘ఎఎ22 ఎ6’ (వర్కింగ్ టైటిల్)లో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె వారియర్ క్వీన్‌గా కనిపించనున్నారు. ఈ పోరాట యోధురాలికి సంబంధించిన లుక్‌ని ఇటీవల విడుదల చేయగా, దీపిక ఆ లుక్‌లో పవర్‌ఫుల్‌గా కనిపించారు. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ‘జవాన్’లో దీపికా పదుకోన్ కీలక పాత్రలో కనిపించారు. ఇప్పుడు ‘ఎఎ22 ఎ6’లో పూర్తి స్థాయి కథానాయికగా వారియర్ క్వీన్‌గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోందని సమాచారం. షాపింగ్ మాల్లో ఫైట్ ఎన్టీఆర్–హృతిక్ రోషన్ కాంబినేషన్లో రూపొందిన ‘వార్ 2’పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ మాస్ హీరోలిద్దరూ సిల్వర్ స్క్రీన్‌పై ΄పోటా పోటీగా చేసిన వార్ని చూడ్డానికి ఇద్దరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కాగా... ఈ చిత్రంలో మరో లీడ్ రోల్లో నటించిన కియారా అద్వానీ కూడా ఫైట్ చేశారట. నిజానికి ‘వార్ 2’ టీజర్లో కియారా ఎల్లో కలర్ బికినీలో గ్లామరస్‌గా కనిపించి, హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఇంత హాట్‌గా కనిపిస్తూనే మరోవైపు ఇదే సినిమాలో ఓ షాపింగ్ మాల్లో డైనమిక్ ఫైట్‌లోనూ కుర్ర కారు గుండె లబ్ డబ్ పెంచనున్నారు. ఈ ఒక్క ఫైట్ మాత్రమే కాదు... మరికొన్ని ఫైట్ సీన్స్ కూడా చేశారట. ‘ఎట్రాక్షన్ మాత్రమే కాదు యాక్షన్’ కూడా అన్నమాట. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. లేడీ డాన్ కృతీ సనన్ వెండితెరపై తొలిసారి ఓ రేంజ్లో ఫైట్స్‌లో విజృంభించిన చిత్రం ‘గణపత్’ (2023). ఈ చిత్రంలో చేసిన జస్సీ సింగ్ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లో ఓ కళ అయిన ‘నన్చాకు’ని నేర్చుకున్నారు. ఇప్పుడు రెండేళ్లకు మరోసారి ఫైట్స్‌లో స్పెషల్‌గా ట్రైనప్ అవుతారట. కృతీ సనన్‌కి వచ్చిన ఆఫర్‌లాంటిది మరి. ఈ బ్యూటీ లేడీ డాన్‌గా కనిపించనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్యారెక్టర్ కోసమే శిక్షణ తీసుకోనున్నారట. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ టైటిల్ రోల్లో వచ్చిన ‘డాన్, డాన్ 2’ చిత్రాలకు ఉన్న క్రేజ్ తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో భాగంగా రూపొందనున్న ‘డాన్ 3’లో ఈసారి రణ్వీర్ సింగ్ డాన్‌గా కనిపించనున్నారు. లేడీ డాన్‌గా కియారా అద్వానీని ఖరారు చేశారు. కానీ ఆ తర్వాత కియారా ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ కావడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అప్పట్నుంచి ఈ పాత్రకు పలువురు కథానాయికల పేర్లు వినిపించాయి. ఆ పేర్లలో కృతీ సనన్ పేరు కూడా ఉంది. ఫైనల్లీ కృతీ సనన్‌నే ఫిక్స్ చేశారట చిత్ర దర్శక–నిర్మాత ఫర్హాన్ అక్తర్. ఈ ఏడాదే ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. మహిళా గూఢచారుల కథ ఇద్దరు మహిళా గూఢచారులు బరిలోకి దిగారు. ఈ ఇద్దరూ ప్రమాదకరమైన మిషన్లు ఎదుర్కొంటారు. తగ్గేదే లే అంటూ సాహసాలు చేస్తారు. ఈ ఇద్దరూ చేసిన సాహసాలేంటి? అనేది ‘ఆల్ఫా’ చిత్రంలో చూడాల్సిందే. ఆలియా భట్, శార్వరీ ఏజెంట్స్‌గా నటిస్తున్న చిత్రం ఇది. శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్నారు. వైఆర్ఆఫ్ (యశ్ రాజ్ ఫిల్మ్స్) యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న చిత్రం ‘ఆల్ఫా’. ఈ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన గూఢచారుల చిత్రాల్లో హీరోలు లీడ్ రోల్స్ చేశారు. అయితే ఈ స్పై యూనివర్స్‌లో మహిళా గూఢచారులే ప్రధాన పాత్రలుగా వైఆర్ఆఫ్ నిర్మిస్తున్న తొలి చిత్రం కావడంతో ‘ఆల్ఫా’పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఆలియా, శార్వరీ రిస్కీ స్టంట్స్ చేశారట. ఈ సినిమా షూటింగ్ ఆరంభించే ముందు ఇద్దరు నాయికలకు ఫైట్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాబీ, ఆలియా పాల్గొనగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ల నేతృత్వంలో భారీ పోరాట సన్నివేశం చిత్రీకరించారని, ఇంకా బోలెడన్ని రిస్కీ ఫైట్స్ ఉన్నాయని బాలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో ఆలియా భట్ గురువు ΄ాత్రలో స్టార్ హీరో హృతిక్ రోషన్ కనిపించనున్నారట. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో డిసెంబరు 25న విడుదల కానుంది. పగ తీర్చుకోవడానికి... సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’ చిత్రంలో బోల్డ్ క్యారెక్టర్లో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా నటించారు త్రిప్తీ దిమ్రి. తనలో మంచి గ్లామరస్ నటి ఉందనే విషయాన్ని నిరూపించుకున్నారామె. మళ్లీ సందీప్ రెడ్డి దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారీ బ్యూటీ. అయితే ఈ చిత్రంలో త్రిప్తి పాత్ర ఏంటనే వివరాలు బయటకు రాలేదు. కాగా తనలో మంచి యాక్షన్ హీరోయిన్ ఉన్న విషయాన్ని నిరూపించుకోవడానికి రెడీ అయిపోయారు ఈ హీరోయిన్. ఓ హిందీ చిత్రంలో త్రిప్తి యాక్షన్ రోల్ చేస్తున్నారు. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ‘కమీనే, హైదర్, రంగూన్’ వంటి విశ్లేషకుల ప్రశంసలూ దక్కించుకున్న చిత్రాల తర్వాత మళ్లీ షాహిద్ కపూర్–విశాల్ భరద్వాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ ఫుల్ ΄్యాక్డ్ యాక్షన్ మూవీలో త్రిప్తీ దిమ్రి పగ తీర్చుకునే ΄ాత్రలో కనిపిస్తారట. ఎవరిపై పగ? ఏంటా కథ అనేది తెలియాల్సి ఉంది. రివెంజ్ తీర్చుకునే క్రమంలో ΄ోరాటాలు చేస్తారట. ఈ ΄ాత్ర కోసం త్రిప్తి ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యారని సమాచారం. ఇక ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారట షాహిద్ కపూర్. ఈ ΄ాత్ర రిస్కీ ఫైట్స్ చేస్తుందని టాక్. ఈ నేపథ్యంలో ఫైట్స్ కోసం షాహిద్, త్రిప్తి ఒకేసారి శిక్షణ తీసుకున్నారని బాలీవుడ్ ఖబర్. ఈ ఏడాది డిసెంబరు 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. యాక్షన్‌తో ఇంట్రడక్షన్ సిల్వర్ స్క్రీన్‌పై ఫస్ట్ టైమ్ కనిపించడం కనిపించడమే ఓ యాక్షన్ రోల్లో కనిపించనున్నారు షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్. తండ్రి కాంబినేషన్లో ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుక్ ఖాన్ డాన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రధానాంశం గురు–శిష్యుల నేపథ్యంలో ఉంటుందని సమాచారం. తండ్రీ కూతురు షారుక్–సుహానా వెండితెరపై గురు–శిష్యులుగా కనిపిస్తారట. గురువు క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని భోగట్టా. అంటే... షారుక్ గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని స్పష్టం అవుతోంది. నైపుణ్యం గల హంతుకుడిగా ఈ గురువు తన శిష్యురాలికి ΄ోరాటాల్లో శిక్షణ ఇస్తాడట. ఇద్దరూ కలిసి అత్యంత ప్రమాదకరమైన మిషన్‌ని ఛేదిస్తారట. ఈ యాక్షన్ రోల్ కోసం సుహానా ఫైట్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. వచ్చే ఏడాది అక్టోబరు 2న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. మరి... యాక్షన్ రోల్‌తో ఇంట్రడ్యూస్ కానున్న సుహానా ఖాన్ ఎన్ని మార్కులు తెచ్చుకుంటారో చూడాలి.ఇంకా సోనాక్షీ సిన్హా, తాప్సీ తదితర తారల డైరీలో యాక్షన్ మూవీస్ ఉన్నాయి. హీరోయిన్లంటే గ్లామర్ మాత్రమే కాదు... చాన్స్ వస్తే తమలోని ఫైర్‌ని బయటికి తీస్తామని యాక్షన్ మూవీస్ ద్వారా నిరూపించుకుంటుంటారు. అయితే ఒకేసారి ఈ తారలందరూ యాక్షన్ రోల్స్ చేయడం మంచి పరిణామం. కథానాయికల ప్రాధాన్యత పెరుగుతోందనడానికి ఇదో నిదర్శనం.

'కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా?
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చాలారోజుల తర్వాత మళ్లీ జోష్ కనిపిస్తోంది. వేసవిలో స్టార్ హీరోల సినిమాలేవి రాకపోవడంతో చాలా డల్‌గా ఉంది. నాని 'హిట్ 3' కూడా మే నెలలోనే రిలీజైనప్పటికీ కొన్నిరోజులు మాత్రమే థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. ఇప్పుడు 'కుబేర' విషయంలో రిలీజ్‌కి ముందు పెద్ద హడావుడి గానీ హైప్ గానీ లేదు. తొలిఆట తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే తొలిరోజు వసూళ్లలో మంచి నంబర్స్ కనిపించాయి.తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేశారు గానీ తమిళనాడులో మాత్రం సాంకేతిక కారణాలతో విడుదలకు ముందురోజు బుకింగ్స్ తెరిచారు. అయినా సరే మౌత్ టాక్ ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్‌గానే వస్తోంది. అలా తొలిరోజు తెలుగు, తమిళంలో కలిపి రూ.13 కోట్ల మేర నెట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ నంబర్స్ ఇంకా పెరగొచ్చు అనిపిస్తుంది. చూడాలి మరి ఎంత కలెక్షన్స్ వస్తాయో?(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమాకు తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకుడు. తొలిరోజు వసూళ్ల బట్టి చూస్తే ధనుష్‌కి కెరీర్ పరంగా ఇది రెండో బిగ్గెస్ట్ కలెక్షన్ కాగా.. నాగార్జున, శేఖర్ కమ్ములకు మాత్రం ఇదే అత్యధికం. ఎందుకంటే నాగ్ సినిమాలన్నీ తెలుగు వరకు పరిమితం. అందువల్ల ఓ మాదిరి వసూళ్లు వచ్చేవి. ఇక దర్శకుడు కమ్ముల ఇప్పటివరకు సింపుల్ బడ్జెట్ మూవీస్ తీస్తూ వచ్చాడు. కాబట్టి ఈ వసూళ్లు వీళ్లకు ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'కుబేర' మేకింగ్ వీడియో.. చెత్తకుప్పని కూడా)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

Neeraj Chopra: ప్యారిస్ డైమండ్ లీగ్ విజేతగా భారత సూపర్ స్టార్
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) డైమండ్ లీగ్ విజేతగా నిలిచాడు. జర్మనీ బల్లెం వీరుడు జూలియన్ వెబర్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించాడు. ప్యారిస్ (Paris Diamond League)లో జరిగిన ఈ పోటీలో భారత సూపర్‌స్టార్ నీరజ్ చోప్రా తన తొలి ప్రయత్నంలో ఈటెను 88.16 మీటర్ల దూరం విసిరాడు. ఇదే ఈ పోటీలో అత్యుత్తమం కావడంతో అతడు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.ఇక రెండో ప్రయత్నంలో 85.10 మీటర్లు విసిరిన ఈ హర్యానా అథ్లెట్.. తదుపరి మూడు ప్రయత్నాల్లో ఫౌల్ అయ్యాడు. అయితే, ఆఖరిదైన ఆరో త్రోలో 82.89 మీటర్ల దూరం బల్లాన్ని విసిరాడు. మరోవైపు.. వెబర్ తన తొలి ప్రయత్నంలో 87.88 మీటర్లు విసరగా అదే అతడి బెస్ట్‌గా నిలిచింది. దీంతో నీరజ్ తర్వాతి స్థానాన్ని వెబర్ ఆక్రమించగా.. బ్రెజిల్‌కు చెందిన లూయిజ్ మారీషియో డా సిల్వా 86.62 మీటర్ల దూరం (రెండో ప్రయత్నం) ఈటెను విసిరి మూడో స్థానంలో నిలిచాడు.కాగా నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం ఈ గోల్డెన్ బాయ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే... గత నెలలో దోహా డైమండ్ లీగ్ జరగగా నీరజ్ చోప్రా 90.23 మీటర్ల దూరం బల్లెం విసిరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. నాడు జూలియన్ వెబర్ 91.06 మీటర్ల దూరం ఈటెను త్రో చేసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత పోలండ్ మీట్లోనూ ఈ ఇద్దరే తొలి రెండు స్థానాల్లో నిలిచారు. తాజాగా ప్యారిస్ డైమండ్ లీగ్‌లోనూ ఇదే పునరావృతం చేశారు.చదవండి: యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు.. బ్రాడ్‌మన్‌నే అధిగమించాడు!NEERAJ CHOPRA WINS PARIS DIAMOND LEAGUE💎- The best attempt of 88.16m in first throw 🔥🤩 pic.twitter.com/dhYVQPUr5E— The Khel India (@TheKhelIndia) June 20, 2025

నాకు అది అలవాటు.. నువ్వే గుర్తు చేయాలి!.. నో చెప్పడం వల్లే ఇలా..
వయసు జస్ట్ 23 ఏళ్లు.. అయితేనేం.. టీమిండియా ఓపెనర్‌గా అతడు కనబరిచే పరిణితి మాత్రం అమోఘం.. టెస్టుల్లో ఇప్పటికే నాలుగు సెంచరీలు.. రెండు ద్విశతకాలు.. తాజాగా ఇంగ్లండ్ గడ్డ మీద ఆడిన తొలి టెస్టులోనే శతకం బాదాడు అతడు.. అంతేకాదు ఈ ఘనత సాధించిన ఏకైక భారత ఓపెనర్‌గా నిలిచాడు.. అవును.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswak) గురించే ఈ ఉపోద్ఘాతం.ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ (India vs England)తో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో జైసూ శతక్కొట్టాడు. ఆది నుంచే పలుమార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని ఎట్టకేలకు వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul)తో కలిసి తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మూడో వికెట్‌కు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి 129 పరుగుల పార్ట్నర్షిప్ అందించాడు.తొందరపడితే నన్ను వారించు..అయితే, గిల్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా జైసూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తొందరపడితే తనను వారించాలంటూ జైసూ కెప్టెన్‌కు చెప్పడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. భారత్ ఇన్నింగ్స్‌లో 38 వ ఓవర్లో క్రిస్ వోక్స్ బంతితో రంగంలోకి దిగాడు.అతడి బౌలింగ్‌లో తొలి బంతికి బౌండరీ బాదిన జైస్వాల్.. తదుపరి బాల్‌కు సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. షాట్ బాదగానే వెంటనే పరుగు కోసం వెళ్లాడు. అయితే, మరో ఎండ్‌లో ఉన్న గిల్ మాత్రం రన్‌కు నిరాకరించాడు. దీంతో కాస్త అసహనానికి గురైనప్పటికి... ఆ వెంటనే తన తప్పు తెలుసుకున్న జైస్వాల్ వెంటనే క్రీజులోకి పరిగెత్తాడు. తద్వారా ఇంగ్లండ్‌కు రనౌట్ చేసే అవకాశం చేజారింది.నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!ఈ ఘటన తర్వాత జైస్వాల్ గిల్‌తో.. ‘‘రిస్కీ సింగిల్స్ వద్దని నాకు చెబుతూనే ఉండండి ప్లీజ్.. బంతిని బాదగానే వెంటనే పరిగెత్తడం నాకు అలవాటై పోయింది’’ అని పేర్కొన్నాడు. కాగా జైసూ బాదిన బంతి ఎక్కువ దూరం వెళ్లలేదు. ఈ విషయాన్ని గమనించని జైసూ పరుగుకు రాగా.. ‘‘లేదు లేదు బంతి ఇక్కడే ఉంది’’ అంటూ గిల్ చెప్పాడు. గిల్ నో చెప్పిన కారణంగా ఇద్దరూ రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.కాగా అప్పటికి జైస్వాల్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. ఆ తర్వాత గిల్‌తో కలిసి చక్కటి సమన్వయంతో శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 159 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 101 పరుగులు సాధించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 359 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. శుబ్‌మన్ గిల్ 175 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 127 పరుగులతో.. రిషభ్ పంత్ 102 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?When #YashasviJaiswal says “Run!” and #ShubmanGill is still deciding if it’s a good idea! 😂Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/UJDlpPlpkH— Star Sports (@StarSportsIndia) June 20, 2025

యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు.. బ్రాడ్‌మన్‌నే అధిగమించాడు!
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiwal) అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్ జట్టుపై టెస్టు ఫార్మాట్లో అత్యధిక సగటు నమోదు చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (Don Bradman)ని జైసూ అధిగమించాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్ 20) తొలి టెస్టు మొదలైంది. లీడ్స్ వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకుని.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.భారత్ బ్యాటింగ్ అదుర్స్.. జైసూ, గిల్ సెంచరీలుఇక ఆది నుంచే జోరు కనబరిచిన భారత్ మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది. ఆద్యంతం ఆకట్టుకుని తొలి రోజు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (42) స్వల్ప స్కోరుకు వెనుదిరిగినా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతకంతో కదం తొక్కాడు.మరో సెంచరీ వీరుడు, కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మొత్తంగా 159 బంతులు ఎదుర్కొన్న జైసూ.. 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 101 పరుగులు చేసి.. స్టోక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.బ్రాడ్‌మన్ రికార్డు బద్దలుఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ గడ్డ మీద జైసూకు ఇదే తొలి సెంచరీ కాగా.. ఓవరాల్‌గా పది ఇన్నింగ్స్‌లో కలిపి 813 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఏకంగా 90.33 సగటుతో ఈ మేర రన్స్ రాబట్టాడు. ఈ క్రమంలోనే బ్రాడ్‌మన్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ మీద టెస్టుల్లో అత్యధిక సగటుతో పరుగులు రాబట్టిన ఆటగాడిగా నిలిచాడు.ఇక శుక్రవారం నాటి తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి గిల్ 127 పరుగులతో.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు.. అరంగేట్ర బ్యాటర్ సాయి సుదర్శన్ మాత్రం నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు.ఇంగ్లండ్ జట్టుపై అత్యధిక టెస్టు యావరేజ్ కలిగిన బ్యాటర్లు🏏యశస్వి జైస్వాల్- 90.33🏏డాన్ బ్రాడ్‌మన్- 89.78🏏స్టీవీ డెంప్‌స్టర్- 88.42🏏లారెన్స్ రోవ్- 74.20🏏జార్స్ హెడ్లీ- 71.23 చదవండి: వాళ్లని మెచ్చుకోవడంలో తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్!𝐓𝐎𝐍 🆙𝐓𝐀𝐈𝐋𝐒 🆙Yashasvi Jaiswal leads Team India from the front. #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #DhaakadIndia #TeamIndia | @ybj_19 pic.twitter.com/QX4kdlTBu4— Sony Sports Network (@SonySportsNetwk) June 20, 2025

హారికకు మూడో స్థానం
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్, హైదరాబాద్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక మూడో స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టార్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి వరుసగా మూడో ఓటమి చవిచూసి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. అలీనా కషిన్స్కాయ (పోలాండ్)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను హారిక 38 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించి 5 పాయింట్లతో మూడో స్థానాన్ని ఖరారు చేసుకుంది. గత ఏడాది కూడా మూడో స్థానంలో నిలిచిన హారిక ఈ ఏడాది టోర్నీలో కేవలం కోనేరు హంపి చేతిలో ఓడిపోయి... మిగతా ఎనిమిది గేముల్లో రెండింటిలో గెలిచి, ఆరింటిని ‘డ్రా’ చేసుకుంది. ఆరో రౌండ్ తర్వాత అగ్రస్థానంలో నిలిచిన హంపి వరుసగా మూడు గేముల్లో ఓడిపోయి 4.5 పాయింట్లతో ఐదో స్థానాన్ని పొందింది. ఏడో రౌండ్లో కరిసా యిప్ (అమెరికా) చేతిలో, ఎనిమిదో రౌండ్లో నినో బత్సియా‹Ùవిలి (జార్జియా) చేతిలో ఓడిన హంపి 46 ఎత్తుల్లో మరియా ముజీచుక్ (ఉక్రెయిన్) చేతిలో పరాజయం పాలైంది. హంపితోపాటు నానా జాగ్‌నిద్జె (జార్జియా), బీబీసారా అసబయేవా (కజకిస్తాన్), అలీషా 4.5 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... నానా జాగ్‌నిద్జె నాలుగో స్థానంలో, హంపి ఐదో స్థానంలో, బీబీసారా ఆరో స్థానంలో, అలీషా ఏడో స్థానంలో నిలిచారు. పది మంది మేటి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహించగా... 6 పాయింట్లతో కరిసా యిప్ (అమెరికా) చాంపియన్‌గా అవతరించింది. 5.5 పాయింట్లతో అలైస్ లీ (అమెరికా) రన్నరప్‌గా నిలిచింది. విజేత కరిసా యిప్నకు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షల 96 వేలు), రన్నరప్ అలైస్ లీకి 50 వేల డాలర్లు (రూ. 43 లక్షల 30 వేలు), మూడో స్థానంలో నిలిచిన హారికకు 40 వేల డాలర్లు (రూ. 34 లక్షల 64 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
బిజినెస్

వచ్చే నెలలో టెస్లా షోరూమ్ ఓపెన్
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా కంపెనీ కార్లను భారత్‌లో విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెలలోనే ముంబయిలో షోరూమ్ ప్రారంభించనున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. యూరప్, చైనా వ్యాప్తంగా ఈ కార్ల అమ్మకాలు ఇటీవల క్షీణించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్, మస్క్ మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో టెస్లా షేర్లు మరింత దిగజారాయి. ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారని తెలిసిన క్షణం నుంచి కొంత కాలంపాటు టెస్లా అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే ఇటీవల ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదరడంతో అమ్మకాలు డీలా పడ్డాయి. దాంతోపాటు చైనాలోనూ టారిఫ్ భయాలతో టెస్లా అమ్మకాలు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మస్క్‌కు భారత్ భారీ మార్కెట్‌గా తోస్తుంది. ఇప్పటికే దేశంలో టెస్లా అమ్మకాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది.యూరప్, చైనాల్లో అమ్మకాలు క్షీణించిన నేపథ్యంలో టెస్లా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారత్‌లో తన కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా టెస్లా వచ్చే నెలలో ముంబయిలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించనుందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ముంబయిలో షోరూమ్ ప్రారంభించిన కొద్ది రోజులకు ఢిల్లీలో షోరూమ్ ఓపెన్ చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టెస్లా కంపెనీ అమెరికా, చైనా, నెదర్లాండ్స్ నుంచి సూపర్ ఛార్జర్ కాంపోనెంట్స్, కార్ యాక్సెసరీస్, మర్కండైజ్, విడిభాగాలను దిగుమతి చేసుకుందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.ఇదీ చదవండి: రత్నాభరణాల ఎగుమతులు డౌన్టెస్లా చైనా ఫ్యాక్టరీ నుంచి మోడల్ వై రేర్-వీల్-డ్రైవ్ ఎస్‌యూవీలు భారతదేశానికి చేరుకున్నాయని ఈ విషయం తెలిసిన వ్యక్తులు బ్లూమ్‌బర్గ్‌కు తెలిపారు. మోడల్ వై ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. ఎలాన్ మస్క్ ఫిబ్రవరిలో అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత టెస్లాను భారతదేశానికి తీసుకురావడంలో పురోగతి వచ్చింది. గతంలో దేశీయ టారిఫ్‌లు, స్థానిక తయారీపై మస్క్ విభేదించడంతో భారత్‌లో కంపెనీ ప్రవేశంపై ఏళ్ల తరబడి నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది.

రత్నాభరణాల ఎగుమతులు డౌన్
రత్నాభరణాల ఎగుమతులు మే నెలలో 16 శాతం తగ్గిపోయాయి. 2,263 మిలియన్ డాలర్ల (19,261 కోట్లు) ఎగుమతులు నమోదయ్యాయి. గతేడాది మే నెలలో ఎగుమతులు 2,688 మిలియన్ డాలర్లు (రూ.22,414 కోట్లు)గా ఉన్నట్టు రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రకటించింది. అమెరికా టారిఫ్‌ల అనంతరం వీటి ఎగుమతులు తగ్గిపోవడం గమనార్హం. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 35 శాతం తక్కువగా 950 మిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి ఎగుమతులు 12,272 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. పాలిష్డ్ ల్యాబ్ గ్రోన్ వజ్రాల ఎగుమతులు సైతం 33 శాతం తగ్గి 81 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి ఎగుమతులు 120 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.బంగారం ఆభరణాల ఎగుమతులు మాత్రం 17 శాతం పెరిగి 997 మిలియన్ డాలర్లకు చేరాయి. క్రితం ఏడాది మే నెలలో బంగారం ఆభరణాల ఎగుమతులు 851 మిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. వెండి ఆభరణాల ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–మే నెలల్లో 17 శాతానికి పైగా క్షీణించి 150 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కలర్డ్ జెమ్‌స్టోన్ ఎగుమతులు ఏప్రిల్–మే నెలల్లో ఒక శాతం తగ్గి 62 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: రేట్ల కోత ఎందుకో చెప్పిన ఆర్బీఐ గవర్నర్అమెరికా టారిఫ్‌ల వల్లే..‘అమెరికా టారిఫ్‌ల వల్ల మొత్తం మీద ఎగుమతులు మే నెలలో 16 శాతం వరకు తగ్గాయి. అయినప్పటికీ బంగారం ఆభరణాల ఎగుమతులు మాత్రం పెరిగాయి. మధ్యప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతుండడం బంగారానికి డిమాండ్‌ను పెంచింది’ అని జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు.

రేట్ల కోత ఎందుకో చెప్పిన ఆర్బీఐ గవర్నర్
అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నడుమ సెంట్రల్ బ్యాంక్ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందన్న స్పష్టమైన సంకేతం ఇవ్వడానికే వడ్డీ రేట్ల కోత నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంయ్ మల్హోత్రా తెలిపారు. లిక్విడిటీ పరంగా స్పష్టతకు, వినియోగం, పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు వీలుగా రుణ వ్యయాలను తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యాలుగా పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన గల ఆరుగురు సభ్యుల ఎంపీసీ ప్యానెల్ ఈ నెలారంభంలో రెపో, రివర్స్ రెపో రేట్ల కోత నిర్ణయాలు ప్రకటించడం తెలిసిందే. ఈ నెల 4 నుంచి 6 వరకు జరిగిన ఎంపీసీ సమావేశంలో చర్చించి, రికార్డు అయిన వివరాలు (మినిట్స్) విడుదలయ్యాయి. ఐదుగురు సభ్యులు 50 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోతకు అనుకూలంగా ఓటు వేశారు. సౌగత భట్టాచార్య మాత్రం 25 బేసిస్ పాయింట్లకు మొగ్గు చూపించారు. గత కొన్ని నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3 శాతం మేర తగ్గడం (2024 అక్టోబర్‌లో నమోదైన 6.2 శాతం నుంచి 2025 ఏప్రిల్ నెలలో 3.2 శాతానికి), వార్షికంగా ద్రవ్యోల్బణం 3.7 శాతానికి పరిమితం అవుతుందన్న అంచనాల నేపథ్యంలో 50 బేసిస్ పాయింట్లకు అనుకూలంగా గవర్నర్ మల్హోత్రా మొగ్గు చూపించారు. ఇదీ చదవండి: ఫైనాన్షియల్ సెక్టార్‌పై మస్క్ కన్నుఅంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అస్థిరమైన రేట్ల కోత కంటే.. 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించడం విధానపరమైన స్పష్టతకు, వేగవంతమైన బదిలీకి వీలు కల్పిస్తుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గుప్తా అభిప్రాయపడ్డారు. తటస్థ విధానానికి సైతం మద్దతు పలికారు.

ఎయిరిండియాకు డ్రీమ్‌లైనర్ క్రాష్ సెగ
న్యూఢిల్లీ: గతవారం బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిన నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిరిండియా బుకింగ్స్, చార్జీలు పడిపోయాయి. దేశ, విదేశీ రూట్లలో బుకింగ్స్ 20 శాతం పడిపోగా, చార్జీలు సైతం సగటున 8–15 శాతం తగ్గాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జూన్ 12న 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్‌కి బైల్దేరిన కాస్సేపటికే ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఉదంతం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రూట్లలో బుకింగ్స్ తగ్గడాన్ని గమనించామని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) ప్రెసిడెంట్ రవి గోసాయి తెలిపారు. అంతర్జాతీయ రూట్లలో బుకింగ్స్ 18–22 శాతం, దేశీయంగా 10–12 శాతం మేర తగ్గినట్లు వివరించారు. అయితే, ఇదంతా తాత్కాలికమే కావచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక ఇండిగో, ఆకాశతో నేరుగా పోటీ ఉన్న దేశీ రూట్లలో ఎయిరిండియా టికెట్ల చార్జీలు 8–12 శాతం తగ్గినట్లు గోసాయి చెప్పారు. అంతర్జాతీయంగా, ముఖ్యంగా యూరప్, ఆగ్నేయాసియా రూట్లలో చార్జీలు 10–15 శాతం క్షీణించినట్లు వివరించారు. పలువురు ప్రయాణికులు ఎయిరిండియా ఫ్లయిట్స్‌లో ప్రయాణాలను రద్దు కూడా చేసుకున్నట్లు చెప్పారు. ప్రధానంగా కార్పొరేట్, హై–ఎండ్ లీజర్ ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమాన సంస్థలకు మళ్లినట్లు వివరించారు. గత వారం రోజులుగా అంతర్జాతీయ రూట్లలో క్యాన్సిలేషన్లు 15–18 శాతం, దేశీ రూట్లలో 8–10 శాతం స్థాయిలో ఉన్నట్లు గోసాయి చెప్పారు. అయితే, ఎయిరిండియా విమానాలు అంతర్జాతీయ భద్రత ప్రమాణాలను పాటిస్తున్నట్లుగా నియంత్రణ సంస్థలు ధృవీకరిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి మారొచ్చని వివరించారు. మరోవైపు, ఎయిరిండియా ఫ్లయిట్స్ బుకింగ్స్ 15–20 శాతం వరకు, చార్జీలు కొన్ని రూట్లలో 10 శాతం వరకు తగ్గినట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహ్రా చెప్పారు.
ఫ్యామిలీ

ఎయిరిండియా అంటేనే వణికిపోతోంటే....పేల్చేస్తా అంటూ మహిళ వీరంగం!
ఎయిరిండియా విమానం కూలిన దుర్ఘటన తాలూకు విషాదం మన మనసుల్లోకి తొలగి పోక ముందే ఒక మహిళా ప్రయాణికురాలు అనుచితం ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ‘విమానం- క్రాష్’ అన్న పదాలు వింటేనే ఉలిక్కి పడుతున్న ప్రస్తుత తరుణంలో స్వల్ప వివాదానికే విమానాన్ని కూలిపోతుంది అంటూ అంటూ నానా గలాటా సృష్టించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు జరిగిన ఈ సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది.ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) నుండి సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు ఈ సంఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన మహిళా ప్రయాణీకురాలు, వైద్యురాలు వ్యాస్ హిరాల్ మోహన్‌భాయ్ (36) బ్యాగ్ స్థలం కోసం విమాన సిబ్బందితో గొడవకు దిగింది. విమానంలోని తన సీటు 20Fలో కూర్చునే ముందు మొదటి వరుసలో తన బ్యాగ్ వదిలి వెళ్ళిపోయింది. దీంతో దీన్ని ఆమె సీటు దగ్గర ఉన్న ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లో ఉంచమని సిబ్బంది కోరారు. అంతే ఆవేశంతో ఊగిపోతూ , "విమానం కూలిపోతుంది" అంటూ గొడవకు దిగింది. క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది. ఇది తప్పు అన్న తోటి ప్రయాణీకులపై కూడా అరిచిందిట. దీంతో పైలట్ , సిబ్బంది భద్రతా సిబ్బంది మరియు CISF సిబ్బందికి సమాచారం అందించారు, వారు ఆమెను విమానం నుండి కిందికి దింపేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానాన్ని కూల్చివేస్తామని బెదిరించిందన్న ఆరోపణలపై ఆ మహిళా వైద్యుడిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

WE Reach వినూత్నంగా వీ రీచ్
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ఉన్న వ్యాపార సామర్థ్యాన్ని వెలికితీయడం, దానిని ప్రోత్సహించడమే లక్ష్యంగా నగరంలోని ‘వీ హబ్’ (ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్) మరో సరికొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా వ్యాపారం నిర్వహించాలనుకునే మహిళల స్టార్టప్ ప్రయాణానికి దోహదపడే ప్రీ–ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ‘వీ రీచ్’ గురువారం హబ్ వేదికగా అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హరి చందన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీ రీచ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార ఔత్సాహికులైన మహిళలకు ఈ ఆధునిక వ్యవస్థకు అనుగుణంగా విభిన్న అంశాల్లో అవగాహన కల్పించనున్నారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా టైర్–2, టైర్–3 ప్రాంతాల్లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ బూట్ క్యాంప్‌ల ద్వారా 120 మంది మహిళలను ఎంపిక చేసి పారిశ్రామికవేత్తలుగా రెండు బ్యాచ్‌లుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం వ్యాపార ఆలోచనకు అంకుర దశ నుంచీ వ్యాపారం స్థాపించే దశ వరకూ సమగ్ర మద్దతు అందించేందుకు రూపొందించారు. ఇందులో బిజినెస్ స్కిల్స్‌పై శిక్షణ, ఆర్థిక–డిజిటల్ లిటరసీ, మెంటార్íÙప్, ఎక్స్పోజర్ విజిట్లు, ఎమ్ఎస్ఎమ్ఈ ఫార్మలైజేషన్‌కు అవసరమైన సహకారాన్ని అందించడం వంటి కార్యక్రమాలుంటాయి. వీటివల్ల మహిళలు తమ సొంత వ్యాపారాన్ని స్థాపించి దాన్ని స్థిరంగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు పొందుతారు. ఇదీ చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!దీర్ఘకాలిక మార్పుకు నాంది.. వీ రీచ్వీ రీచ్ కార్యక్రమ ప్రారభోతవం సందర్భంగా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కలిగించడం, వారి సమగ్ర అభివృద్ధికి ఎంతో కీలకమన్నారు. ‘వీ రీచ్’ వంటి కార్యక్రమాలు మహిళలకు ఆర్థిక అవకాశాలు కల్పించడమే కాకుండా, సమాజంలో దీర్ఘకాలిక మార్పుని తీసుకురాగల సామర్థ్యం కలవని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి సహకార కార్యక్రమాలు పెరగాల్సిన అవసరముందన్నారు. ఇదీ చదవండి: ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరోవీహబ్ సీఈఓ సీత పల్లచొల్ల మాట్లాడుతూ.. ఈ మూడు నెలల ప్రోగ్రాంలో వ్యాపార నైపుణ్యాలు పెంపొందించుకున్న మహిళలు అవసరమైన బిజినెస్ రిజి్రస్టేషన్లు సమకూర్చుకొని తమ వ్యాపార యూనిట్లను లాంఛనప్రాయంగా ప్రారంభించి ఆర్థిక పరిపుష్టి వైపు బాటలు వేస్తారని పేర్కొన్నారు. వీ హబ్ దేశంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన మొట్టమొదటి ఇంక్యుబేటర్, నోడల్ సంస్థ అని అన్నారు.

Parenting Tips : సెక్షన్ పరేషాన్, సిలబస్ టెన్షన్
పిల్లలకు కొత్త యూనిఫామ్, బ్యాగు, పుస్తకాలు కొనిస్తే చాలనుకుంటారు తల్లిదండ్రులు. పాత క్లాస్ నుంచి కొత్త క్లాస్‌కు వచ్చాం. రోజూ స్కూలుకు వెళ్లి కూచోవడమేగా అనుకుంటారు పిల్లలు. కాని ఎనిమిది, తొమ్మిది, పది తరగతులకు వచ్చిన పిల్లలను బడికి సిద్ధం చేయాలి. గత సంవత్సరం వారి చదువులోని మంచి చెడ్డలను బేరీజు వేసి ఈ క్లాసులో మరింత మెరుగ్గా ఎలా చదవాలో అవగాహన కలిగించాలి. స్కూల్లో, ఇంట్లో వారిని మార్చాలి... తల్లిదండ్రులు మారాలి...ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.పిల్లలు స్కూల్‌కు వెళ్లడం అంటే మరో తరగతిని చదవడమే అని భావిస్తారు. స్కూల్ రీఓపెన్ అయ్యాక పాత తరగతిని ఒదిలి పై తరగతికి వెళ్లడం వీరికి ఉత్సాహంగా ఉంటుంది. మనం కొంచెం ఎదిగాం అనుకుంటారు. గత సంవత్సరం చదివినట్టుగానే ఈ సంవత్సరం చదివేయాలి అని భావిస్తారు. ఇవన్నీ ప్రతి విద్యార్థికీ రొటీన్‌గా అనిపించవచ్చుగాని తరచి చూస్తే తల్లిదండ్రుల ప్రమేయంతో పిల్లలకు సహాయపడాల్సిన అంశాలు చాలా ఉంటాయి.1. సెక్షన్ పరేషాన్చాలా స్కూళ్లలో కొత్త విద్యా సంవత్సరానికి స్టూడెంట్స్‌ను షఫుల్ చేయడం ఉంటుంది. అంటే గత సంవత్సరం చదివిన సెక్షన్ కాకుండా కొత్త సెక్షన్ వేస్తారు. గత క్లాసులోని ఫ్రెండ్స్ ఈ క్లాసులో ఉండొచ్చు... ఉండక పోవచ్చు. దాంతో కొందరు పిల్లలు అప్సెట్ అవుతారు. ఫ్రెండ్స్ ఉన్న సెక్షన్లోకి వెళతామంటారు. ఇందుకు స్కూల్ వారు ఒప్పుకోరు. కొత్త సెక్షన్లో వేయడం వల్ల మొదట కష్టంగా ఉన్నా తర్వాత తర్వాత బాగుంటుందనీ, కొత్త ఫ్రెండ్స్ అవుతారని, ఈ మార్పుకు అలవాటు పడటం ముందు ముందు మంచి చేస్తుందని పిల్లలకు తల్లిదండ్రులు నచ్చజెప్పాలి. తేలిగ్గా వదిలేయకుండా అలవాటు పడేవరకు రోజు క్లాసు విశేషాలు మాట్లాడుతూ, ‘అరె... ఈ సెక్షనే బాగుందే’ అని ఉత్సాహపరుస్తూ పాత బెంగను మరువనివ్వాలి. కొత్త క్లాసు టీచర్లను కలిసి, సంగతి చెప్పి, పిల్లాడిని వాళ్లు దగ్గర తీసేలా చేయాలి. ఇక తర్వాత చదువు అదే కొనసాగుతుంది.2. సిలబస్ చదివారా?పిల్లలకు ఏడు వరకు చదువు ఒక విధంగా ఎనిమిది నుంచి మరో విధంగా సాగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు కొత్త పుస్తకాలు కొనిస్తారుగాని తెరిచి చూడరు. తల్లిదండ్రులు తప్పనిసరిగా 8, 9, 10... ఏ క్లాసైతే ఆ క్లాస్ టెక్స్›్ట బుక్స్ అన్నీ తిరగేయాలి. ఎంత సిలబస్ ఉంది... చాప్టర్లు ఏమిటి పరిశీలించాలి. గత సంవత్సరం వచ్చిన మార్కులను బట్టి, విద్యార్థితో చర్చించాలి. ఉదాహరణకు విద్యార్థి ఇంగ్లిష్‌లో తప్ప మిగిలిన సబ్జెక్ట్స్‌లో బాగుంటే ఈ సంవత్సరం ఆ సబ్జెక్ట్ సులువుగా ఎలా చదువుకోవచ్చో విద్యార్థికి అవగాహన కలిగించాలి. లేకుంటే విద్యార్థి తనకు ఇంగ్లిష్ ఇబ్బందిగా ఉందని ఈ సంవత్సరం కూడా చెప్పడు. ఫైనల్ ఎగ్జామ్స్ వేళకు ఇది సమస్యై కూచుంటుంది. అందుకే ఇంగ్లిష్‌ను దాటడం ఈ సంవత్సరపు మొదటి గోల్ అని చె΄్పాలి.3. దినచర్య/నిద్ర ఖరారుపిల్లలు ఎంత గారాల పట్టీలైనా వారికి ఒక దినచర్యను ఖరారు చేయడం క్రమశిక్షణను ఇస్తుంది. క్రమశిక్షణ లేకపోతే ఏ పనీ జరగదు. అందువల్ల స్కూల్‌కు వెళ్లడం దగ్గరి నుంచి రాత్రి నిద్ర΄ోవడం వరకూ తల్లిదండ్రులు, విద్యార్థి కూచుని విద్యార్థి అంగీకారంతో ΄్లాన్ చేయాలి. నిద్ర లేచే సమయం, స్కూల్‌కు ప్రిపేర్ అయ్యే సమయం, తిరిగి వచ్చాక రిలాక్స్ అవడానికి ఆటలకు సమయం, తిరిగి చదవే సమయం, హోమ్‌వర్క్ సమయం... ఇవన్నీ తప్పనిసరిగా నిర్ణయంచాలి. వారంలో ఏ రోజు ఏ సబ్జెక్ట్‌ను చదవాలో కూడా ΄్లాన్ చేయాలి. కష్టమైన సబ్జెక్ట్‌కు ఎక్కువ రోజులు కేటాయించాలి. అలాగే రోజుకు 8 గంటల నిద్ర పిల్లలకు తప్పనిసరి. నిద్రే పిల్లలకు ఆరోగ్యం. ఎనిమిది గంటల నిద్రను ఒదిలి ఇవన్నీ ΄్లాన్ చేయాల్సి ఉంటుంది.4. చదివే చోటును ఏది?కొత్త క్లాసులోకి వచ్చారు సరే... ఇంట్లో రోజూ కూచుని చదువుకునే చోటు ఏది? ఇది విద్యార్థి ఇష్టం ప్రకారం తల్లిదండ్రులు నిశ్చయించాలి. ఇంట్లోని రోజువారీ వ్యవహారాలు వారిని డిస్ట్రబ్ చేయని విధంగా, మంచి గాలి వెలుతురు ప్రశాంతత ఉన్న చోట పిల్లలకు స్టడీ ఏరియా డిసైడ్ చేయాలి. అక్కడ ఏదైనా కొత్త కుర్చీనో, స్టడీ ప్యాడ్నో, టేబుల్‌నో కొనివ్వగలిగితే పిల్లలకు ఉత్సాహం వస్తుంది. మంచి చదువుకునే చోటు చూపకుండా పిల్లల్ని బాగా చదవమనడం సరి కాదు.5. ధ్యాస మళ్లించే విషయాలు ఏవి?కొత్త విద్యా సంవత్సరంలో గత సంవత్సరం టైమ్ వేస్ట్ చేయించిన విషయాలు ఏమిటో తల్లిదండ్రులు, విద్యార్థి కూచుని మాట్లాడుకోవాలి. టీవీ, ఫోన్, కంప్యూటర్, గేమ్స్, సినిమాలు... ఇవి స్టూడెంట్ను డిస్ట్రాక్ట్ చేస్తే పెళ్లిళ్లు పేరంటాలని చెప్పి స్కూలుకు డుమ్మాలు కొట్టించడం, ఎక్కువ ప్రయాణాలు... ఇవి పెద్దల వల్ల వచ్చే అంతరాయాలు. ఇద్దరూ కంట్రోల్ చేసుకోవాల్సిందే. గత సంవత్సరం అటెండెన్స్ కంటే ఈ సంవత్సరం అటెండెన్స్ ఎక్కువ ఉండేలా కృషి చేయాలని ఇంటి సభ్యులంతా అనుకోవాలి.ఇదీ చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!6. రివ్యూ మీటింగ్తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రతి ఆదివారం ఉదయం విద్యార్థితో రివ్యూ మీటింగ్ పెట్టుకోవాలి. ఇది దండించడానికో బెదరించ డానికో కాక విద్యార్థిని అర్థం చేసుకోవడానికి అన్నట్టుగా ముందు నుంచీ తల్లిదండ్రుల ప్రవర్తన ఉండాలి. ఆ వారం జరిగిన క్లాసులు, స్లిప్ టెస్ట్‌లు, మార్కులు, హోమ్‌వర్కులు... అన్నీ బేరీజు వేసుకుని విద్యార్థికి ఏదైనా సమస్య ఉంటే తెలుసుకొని సరి చేయడానికి ఈ రివ్యూ మీటింగ్‌లు గట్టిగా ఉపయోగపడతాయి.స్కూల్లో విద్యార్థి చదువుతున్నాడంటే ఇంట్లో తల్లిదండ్రులు కూడా చదువుతున్నట్టే. మా దగ్గర టైమ్ లేదు అంతా స్కూల్‌కే అప్పజెబుదాం అనుకుంటే విద్యార్థి గురించి ఏమీ తెలియకుండా పోతుంది. కొందరు పి.ఎం.ఐలకు కూడా వెళ్లరు. దీని వల్ల టీచర్లు ఇచ్చే సూచనలు మిస్ అవుతారు. కొత్త తరగతిలో మీ అబ్బాయి/అమ్మాయితో కలిసి మీరూ అడుగుపెట్టండి.

పార్టీ ఏదైనా సుందరాంగుల మణికట్టు... కనికట్టు
గాజులది ఆభరణాలను మించిన స్థాయి. సంప్రదాయం, వేడుక ఏదైనా మణికట్టు చుట్టూ మెరిసే వ్యక్తిగత శైలి. వివాహిత మహిళలకు గాజులలో శ్రేయస్సు, ప్రేమ మెండుగా కలిసి ఉంటాయి.అందుకే, పా మట్టి గాజులైనా వాటి స్థానాన్ని వీడి పోవు.ఆధునిక మహిళ ఆ గాజులను కొత్త అల్లికలు, రంగులు, శైలులతో మణికట్టును కనికట్టు చేస్తోంది.వేడుకల కోసం రకరకాల ఆభరణాలతో వార్డ్రోబ్ను కొంగొత్తగా నిర్మిస్తున్నా రాబోయే పండుగ రోజుల్లో చేతుల లుక్‌ను పెంచుకోవాలనుకునే వారికి సేకరణలో పూర్తిగా చోటు సంపాదించడానికి కావల్సినన్ని జతల గాజులు దొంతర్లుగా సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ట్రెండ్‌లో ఉన్న ముఖ్యమైన ఐదు రకాలు గాజుల పెట్టెలో తప్పక ఉండాల్సిందే! ప్రతిరోజు గ్లామర్ ... మినిమలిస్ట్ గోల్డ్ కడా బ్యాంగిల్బంగారు కడా గాజులు నిన్నటి తరం తప్పని ఆభరణం. బరువైన, చంకీ కడాలు ఇప్పుడు అందరికీ నచ్చడం లేదు. కొత్త తరం వెర్షన్ సొగసైనది, తేలికగా ఉండేది కోరుకుంటుంది. ఆధునిక టచ్‌తో కూడిన సాధారణ, లైట్‌వెయిట్ బంగారు కడాలను ఎంపిక చేసుకోవచ్చు. అల్లికలు, చివరలు ఓపెన్‌గా ఉండేవి, ఒకటి లేదా రెండు రేఖాగణిత నమూనాలు ఉన్నవి.. రోజువారీ దుస్తులకు సరైనవి. పూజల నుండి సంప్రదాయ శైలి వరకు కొన్ని సన్నని గాజులు, బోల్డ్ సింగల్ కడా ధరిస్తే రెండు విధాలుగా ఆకట్టుకుంటుంది. రిచ్ లుక్ కోసం ఒక మంద΄ాటి కడాను రెండు సున్నితమైన బంగారు గాజులతో జత చేయవచ్చు. ఫ్యామిలీ ఈవెంట్స్, కార్యాలయ పూజలు, రోజువారీ సల్వార్ సూట్‌కు కూడా ఇవి బాగుంటాయి.పోల్కీ గాజులు – భారతీయ వివాహానికి తప్పనిసరిబాలీవుడ్ వధువుల ఎంపికతో పోల్కీ బ్యాంగిల్స్ తిరిగి వచ్చాయి. గతంలో కంటే మరింత పెద్ద స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయి. అన్‌కట్ డైమండ్స్‌తో హెరిటేజ్ ఆకర్షణతో కూడిన ఈ గాజులు రాచకళను సృష్టిస్తున్నాయి. వివాహ వేడుకలకు ఇవి ప్రత్యేకం అని చెప్పవచ్చు. వేడుకలో ఎంచుకున్న డ్రెస్‌కు తగిన కలర్, డిజైన్‌ను బట్టి గాజుల తయారీ ఉంటుంది. ఇవి ఎప్పటికీ ఎవర్గ్రీన్ సెట్స్ అని చెప్పవచ్చు. వారసత్వ సంపదకు అర్హమైనవి, ఏదైనా పండుగ దుస్తులకు తక్షణ గ్లామ్‌ను జోడిస్తాయి.పోల్కీ గాజులను మెరిసేలా అలంకరించాలి. దీనికి కాంబినేషన్‌గా పోల్కీ చోకర్, చెవి పోగులతో జత చేయచ్చు. వివాహాలు, కర్వా చౌత్, యానివర్సరీ పార్టీలు, రాణిలా భావించాలనుకునే ఏదైనా కార్యక్రమంలో ఈ పోల్కీ గాజులను ధరించవచ్చు.మీనాకారీ గాజులు – రంగుల ఆనందంరంగుల రంగులతో ఉండే గాజులను ఎవ్వరైనా ఇష్టపడతారు. మీనాకారీ గాజుల ప్రకాశవంతమైన ఎనామిల్ వర్క్, అద్భుతమైన డిజైన్లకు పేరొందాయి. పూల నుండి నెమళ్ల వరకు ఇవి సంస్కృతి, రంగుల పరిపూర్ణ మిశ్రమం. దుస్తుల రంగులకు తగినవి ఎంపిక చేసుకోవాలంటే మీనాకారీ గాజులు సరైన ఎంపిక. పండుగలు, వేడుకలలో అలంకరణ బోరింగ్‌గా ఉండకుండా ఇవి సంప్రదాయ శక్తిని తెస్తాయి. లెహంగా లేదా చీర బార్డర్ కి సరిపోయే రంగు గాజులను ఎంచుకోవచ్చు. బోనాలు, నవరాత్రి, దీపావళి, తీజ్, హల్దీ ఫంక్షన్ల సమయాల్లో ధరించే దుస్తులకు ఈ గాజులు అదనపు ఆకర్షణను తెస్తాయి. వీటిలో వేడుకను బట్టి, ఫొటో బ్యాంగిల్స్ జత చేయడం మరో ఆకర్షణ. (ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో) స్టేట్మెంట్ కఫ్ బ్యాంగిల్స్ – ఆధునిక శైలిప్రతి గాజూ సంప్రదాయకంగా ఉండనవసరం లేదు. మీదైన స్టైల్ స్టేట్మెంట్ చూపించాలనుకున్నప్పుడు కఫ్ బ్యాంగిల్స్ సరైనవి. వీటిలో ముత్యాలు, స్టోన్స్, ఎనామెల్ లేదా వెడల్పుగా మెటల్ కఫ్‌లను ఎంచుకోవచ్చు. ఇండో–వెస్ట్రన్ శైలికి ఇవి మీకు అనుకూలంగా ఉంటాయి. స్పెషల్‌గా, సాధారణ దుస్తులను కూడా ఫ్యాషన్–ఫార్వర్డ్‌గా కనిపించేలా ఈ కఫ్ బ్యాంగిల్స్ చేస్తాయి. మణికట్టు మీద చంకీ కఫ్ ధరించి, మరొకటి సాధారణమైనది వేసుకోవాలి. ఇది స్టైల్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. స్టేట్మెంట్ పీస్‌గా మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. కాక్టెయిల్ పార్టీలు, ఫ్యూజన్ దుస్తులు లేదా మీరు మీ స్టైల్ గేమ్‌ను ప్రదర్శించాలనుకునే ఆఫీస్ గ్యాదరింగ్స్ కూడా ఈ కఫ్ బ్యాంగిల్స్ సరైన ఎంపిక. ట్రెండ్స్ మారుతాయి. కానీ గాజులు ఎప్పటికీ ఉంటాయి. వివాహ జ్ఞాపకాలలో, పండుగలలో, రోజువారీ ఆచారాలలో, వ్యక్తిగత ఫ్యాషన్ స్టేట్మెంట్లో కూడా భాగంగా నిలుస్తాయి. చక్కగా అలంకరించిన గాజుల చేతులు అద్భుతంగా కనిపించడమే కాదు, అవి మీదైన ప్రత్యేకతను ఎదుటివారికి పరిచయం చేస్తాయి. ఇక ఇప్పుడు మీరు గాజులు ధరించడానికి వివాహిత మహిళ మాత్రమే కాదు, నేటి అభివృద్ధిలో వెలిగే ఒక స్టైల్ ఐకాన్ కూడా!ఇదీ చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!
ఫొటోలు
అంతర్జాతీయం

పోటాపోటీగా దాడులు
టెల్ అవీవ్/టెహ్రాన్/జెనీవా: ఏడు రోజులుగా ఎడతెరిపిలేకుండా భీకరంగా బాంబులేసుకుంటూ పశ్చిమాసియాలో రావణకాష్టాన్ని మరింత రాజేసిన ఇజ్రాయెల్, ఇరాన్‌లు శుక్రవారం సైతం పోరుపంథాలోనే పయనించాయి. పోటాపోటీగా క్షిపణులు జారవిడుస్తూ రెండు దేశాల్లో ఉద్రిక్తతల్ని అమాంతం పెంచేశాయి. ఇజ్రాయెల్‌ను మరింత దెబ్బకొట్టేందుకు ఇరాన్ తన వద్ద పోగుబడిన క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇరాన్ క్లస్టర్ బాంబుల్ని ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్, హైఫా, బీర్షెబా, రెహోవోట్ నగరాలు సహా పలు ప్రాంతాలపై క్లస్టర్ బాంబులను వేయడంతో పెద్దసంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. తీరప్రాంత నగరమైన హైఫాలో భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. రక్తమోడుతూ జనం వీధుల్లో పరుగులు పెడుతున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించారు. కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నగర మేయర్ యొనా యాహవ్ చెప్పారు. రెహోవోట్‌లో దెబ్బతిన్న భవనాలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్వయంగా వచ్చి పరిశీలించారు. కర్మేయిన్ పట్టణంలో షెల్టర్‌లో దాక్కున్న 51 ఏళ్ల మహిళ భయంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ప్రతిగా ఇజ్రాయెల్ టెహ్రాన్‌లోని పలు క్షిపణి తయారీ కార్మాగారాలపై దాడులు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా సగం వరకు ఇరాన్ మిస్సైల్ లాంచర్లను నాశనంచేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఇయాల్ జమీర్ చెప్పారు. ఇరాన్ అణుపరిశోధనా ఏజెన్సీసహా పలు నగరాలపై తమ 60 యుద్దవిమానాలు బాంబుల వర్షం కురిపించాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. శుక్రవారం నాటికి ఇరాన్లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు సహా 657 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,000 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్‌లో 24 మంది చనిపోయారు. మరోవైపు ఇరాన్లో బుషెహర్ అణుకేంద్రంపై దాడితో అత్యంత ప్రమాదకర పరిస్థితి తలెత్తనుందని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ డైరెక్టర్ రఫేల్ గ్రోసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్లాంట్‌లో వేల కేజీల అణుపదార్థం ఉందని, అది బయటకొస్తే వినాశకర స్థాయిలో రేడియోధార్మికత వందలకిలోమీటర్ల పరిధికి విస్తరిస్తుందని ఆయన చెప్పారు. మరోవైపు అవసరమైన సమయంలో పోరులో భాగస్వాములమవుతామని హెజ్బొల్లా ఉగ్రసంస్థ ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ ఖాసిమ్ అన్నారు. ఇన్నాళ్లూ ఇరాన్ రహస్యంగా గాజాలో హమాస్, లెబనాన్‌లో హెబ్బొల్లా, యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారులను పెంచి పోషించినప్పటికీ ఎవరూ ఇంతవరకు సాయపడేందుకు ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా స్పందించడం గమనార్హం. అయితే హెజ్బొల్లా స్పందించిన వెంటనే లెబనాన్‌లోని దాని స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది.ఇజ్రాయెల్ వ్యతిరేక ర్యాలీలుతమపై దండెత్తిన ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్, ఇరాక్‌లో ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత వేలాదిగా రోడ్లమీదకొచ్చి భారీ నిరసనర్యాలీ చేపట్టారు. టెహ్రాన్, బాగ్దాద్, సదర్ సిటీల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు ఇప్పటికే హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్ కొత్తగా ఇరాన్‌తోనూ కయ్యం పెట్టుకోవడాన్ని ఇజ్రాయెలీలు తీవ్రంగా తప్పుబట్టారు. టెల్ అవీవ్‌లో వేలాది మంది ఆందోళనకారులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మరోవైపు ఇరాన్లో మౌలికసదుపాయాలు దెబ్బతిని గత 48 గంటలుగా ఇంటర్నెట్ స్తంభించింది. కేవలం 3 శాతం ప్రాంతాల్లో ఇంటర్నెట్ను పునరుద్ధరించారు. ఇరాన్‌లోని బ్యాంక్ సెఫాపై ఇజ్రాయెలీ హ్యాకర్లు సైబర్ దాడులు చేశారు. దీంతో ఏటీఎంలు పనిచేయక జనం ఇబ్బందులు పడ్డారు.ఇరాన్‌కు విదేశీ ఆయుధసాయంపై అమెరికా ఆంక్షలుఇరాన్ సైనికరంగంపై అమెరికా శుక్రవారం మరికొన్ని ఆంక్షలు విధించింది. ఇరాన్ సైన్యం ఉపయోగించే పలు రకాల ఆయుధాల్లో విడిభాగాలు, సాఫ్ట్వేర్లను సరఫరాచేసే విదేశీ సంస్థలు, వ్యక్తులపై అమెరికా నిషేధం విధించింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న వారిలో చైనా కంపెనీ, ఒక సరుకు రవాణా నౌక సంస్థ సైతం ఉన్నాయి. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, బాంబులను విక్రయించే సంస్థలనూ అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది.మరోదఫా చర్చలకు సిద్ధమన్న యూరప్ నేతలుస్విట్జర్లాండ్లోని జెనీవాలో శుక్రవారం బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతోపాటు యూరోపియన్ యూనియన్ విదేశీవిధానాల చీఫ్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చర్చలు జరిపారు. చర్చల్లో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో వెల్లడించలేదు. మరోదఫా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, చర్చలు ముగిశాక యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు చెప్పారు. మరోవైపు తమ సేనలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలను మీడియా అత్యుత్సాహంతో ప్రసారం చేయొద్దని స్థానిక మీడియాకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

క్షమాపణలు చెప్పిన బ్యూటీఫుల్ ప్రధాని
థాయ్‌లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా(38)కు అధికారం చేపట్టిన పది నెలలకే పదవీగండం ఎదురైంది. పొరుగుదేశం నేతకు ఆమె చేసిన ఓ ఫోన్ కాల్ లీక్ అవడం.. ఏకంగా ప్రధాని పీఠానికి ఎసరు పెట్టింది. ఆమెను రాజీనామా చేయాలంటూ ఒకవైపు డిమాండ్లు వెల్లువెత్తగా.. ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాన భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.థాయ్‌లాండ్ బిలియనీర్, మాజీ ప్రధాని అయిన తక్సిన్ షినవత్రా కుమార్తె ప్రస్తుత థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా((Thailand PM Paetongtarn Shinawatra). గతేడాది ఆగస్టులో ఆమె ఆ పదవిని చేపట్టారు. 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆమె.. ఆ దేశ చరిత్రలోనే అతి పిన్న ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. అందం, ఫ్యాషన్స్‌లోనూ స్టైల్ ఐకాన్‌గా, బ్యూటిఫుల్ పీఎంగా నెట్టింట విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు.కాల్ సంభాషణ బయటకు..థాయ్‌లాండ్ (Thailand)కు పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్(Hun Sen)కి థాయ్ ప్రధాని షినవత్రా ఫోన్ చేశారు. ‘‘అంకుల్’’ అంటూ ఆయనను సంబోధించిన ఆమె.. తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా సరిహద్దులో థాయ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బూన్‌సిన్ (Lt. Gen. Boonsin Padklangను ఉద్దేశించి) తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆమె ఆయనతో చెప్పారు పేర్కొన్నారు. అయితే, జూన్ 15వ తేదీన జరిగిన ఈ ఫోన్‌కాల్ సంభాషణ తాజాగా బయటకు వచ్చింది.సాధారణంగానే కంబోడియా-థాయ్‌లాండ్‌ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పైగా సరిహద్దు వివాదాల కారణంగా ఈ మధ్యకాలంలో(మే 28వ తేదీ నుంచి) అవి మరింతగా దెబ్బతిన్నాయి. అయితే.. 2023లో హున్ సేన్ ప్రధాని పదవి నుంచి దిగిపోగా.. ఆయన కుమారుడు హున్ మానెట్ అధికార పగ్గాలు చేపట్టారు. పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్సేన్. అలాంటి వ్యక్తితో షినవత్రా ఫోన్లో మాట్లాడడం.. పైగా దేశ భద్రతకు సంధించిన విషయాలను ప్రత్యర్థితో పంచుకున్న తీరు కూడా వివాదాస్పదమైంది.సొంత పక్షం నుంచే ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని ఫోన్‌తో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవత్రా సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ భూమ్‌జాయ్‌థాయ్ పార్టీ విడిపోయింది. ప్రస్తుతం థాయ్ పార్లమెంట్లో కనీసం 69 మంది ఎంపీలు ఆమెకు మద్దతు విరమించుకున్నారు. దీంతో షినవత్రాకు స్వల్ప మెజార్టీ(500 సభ్యులన్న పార్లమెంట్లో 254 సభ్యుల మద్దతు) మాత్రమే మిగిలింది. ఈ వివాదం ఇలాగే కొనసాగినా.. మరో మిత్రపక్షం వైదొలిగినా.. ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది.చేతులు జోడించి..ఈలోపు ఈ బ్యూటీఫుల్ ప్రధాని డ్యామేజ్ కంట్రోల్‌కి దిగారు. ఫోన్ కాల్ లీక్ వ్యవహారంపై ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆర్మీ, పోలీస్ అధినేతల సమక్షంలో చేతులు జోడించి ఆమె ఆ పని చేశారు. నా ఉద్దేశం శాంతిని నెలకొల్పడమే. ఇకపై హున్ సేన్‌తో ప్రైవేట్ సంభాషణలు ఉండవని తేల్చి చెప్పారామె. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని, సైన్యానికి అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారామె. ఈ క్షమాపణ థాయ్‌లాండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడకుండా ఆపుతుందా చూడాలి.

హర్మూజ్ జలసంధి మూతపడితే...???
ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. వారం రోజుల పరస్పర క్షిపణి దాడుల తరువాత ఇరుదేశాలిప్పుడు పైచేయి కోసం కొత్త ఎత్తుగడలు పన్నుతున్నాయి. జోక్యం చేసుకోవాలని ఒకవైపు ఇజ్రాయెల్ అమెరికాను రెచ్చగొడుతూంటే.. ఇరాన్ హర్మూజ్ జలసంధిని దిగ్బంధం చేయడం ద్వారా సమస్యను అంతర్జాతీయ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఏమిటీ హర్మూజ్ జలసంధి? దాన్ని మూసేస్తే ప్రపంచానికి మరీ ముఖ్యంగా భారత్‌కు ఏమిటి నష్టం?(India Effects With Hormuz Block). సూయెజ్ కెనాల్... యూరప్ దేశాలను హిందూ మహాసముద్రంతో కలిపే సముద్ర మార్గం. సరుకుల రవాణాకు అత్యంత కీలకం. సూయెజ్ లాంటిదే ఈ హర్మూజ్ జలసంధి కూడా. ఇరాన్, ఒమాన్‌ల మధ్య ఉంటుంది. పర్షియన్ జలసంధిని ఒమాన్ జలసంధితో, అరేబియా సముద్రంతోనూ కలుపుతుంది. సూయెజ్ కెనాల్, హర్మూజ్ జలసంధులు రెండింటి ద్వారా ముడిచమురు, ఎల్‌ఎన్‌జీలు సరఫరా అవుతూంటాయి. మన దేశం సౌదీ అరేబియా, ఖతార్ తదితర మధ్యప్రాచ్చ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు, ఎల్ఎన్జీ గ్యాస్‌లు సూయెజ్తోపాటు హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అవుతూంటాయి. ప్రపంచ చమురు రవాణాలో సుమారు తొమ్మిది శాతం సూయెజ్ కెనాల్ ద్వారా జరుగుతుంటే.. అంతకు రెట్టింపు మోతాదు హర్మూజ్ ద్వారా సాగుతూంటుంది. భారీ నౌకలు, ఆయిల్ కంటెయినర్లు ఉన్న నౌకలు వీటిని భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాలకు సరఫరా చేస్తూంటాయి. భారత్ తన చమురు అవసరాల్లో 80 శాతం వరకూ దిగుమతుల ద్వారా పూర్తి చేసుకుంటూ ఉంటుంది. ఇరాక్‌లోని బస్రా నుంచి అత్యధికంగా 20 - 23 శాతం వస్తూంటే.. రష్యా నుంచి వచ్చేది 18 - 20 శాతం వరకూ ఉంటుంది. ఇవి కాకుండా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, అమెరికా (ఆరేడు శాతం), నైజీరియా, పశ్చిమ ఆఫ్రికా, కువైట్ల నుంచి మిగిలిన ముడిచమురు కొనుగోలు చేస్తూంటాం. ద్రవరూప సహజ వాయువు (ఎల్ఎన్జీ) విషయానికి వస్తే మన దిగుమతుల్లో సగం ఖతార్ నుంచి అందుతూంటే.. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఆస్ట్రేలియా, రష్యా, మొజాంబీక్ల నుంచి మిగిలిన సగం వస్తాయి. 2022 తరువాత అంటే ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తరువాత రష్యా నుంచి ఎల్ఎన్జీ దిగుమతులు కొంచెం పెరిగాయి. ఇజ్రాయెల్‌పై కోపంతోనో లేక ఆ దేశానికి సర్ది చెప్పగల సామర్థ్యమున్న అమెరికా పట్టించుకోవడం లేదనో ఇరాన్ కనక ఈ జలసంధిని మూసేసిందంటే.. చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలకు చుక్కలు కనిపించడం ఖాయం!. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్‌కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి! ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్‌తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపు తప్పుతుంది.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా

క్లస్టర్ బాంబుతో ఇజ్రాయెల్ గజగజ
ఇరాన్- ఇజ్రాయెల్ (Iran-Israel) పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది. యుద్ధం 8వ రోజుకి చేరగా.. తమ భూభాగంలోకి ఏకంగా క్లస్టర్ బాంబులను ఇరాన్ ప్రయోగించిందని ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు దిగింది. అసలు ఈ క్లస్టర్ బాంబు అంటే ఏమిటి? వాటి ప్రమాద తీవ్రత ఎంత?. ఆ బాంబును చూసి ఇజ్రాయెల్ ఎందుకు వణికిపోతోంది? వాటిని నిషేధం నిజంగానే అమల్లో ఉందా?.. క్లస్టర్ బాంబు అనేది ఒక క్షిపణిలా కనిపించినా.. అది గాలిలోనే తెరుచుకుని చిన్న చిన్న పేలుళ్లతో కూడిన సబ్మ్యూనిషన్లు (submunitions) అనే మినీ బాంబులను నేల మీదకు వదిలిపెడుతుంది. భూమిని తాకిన వెంటనే అవి పేలిపోతాయి. ఇరాన్ ఇజ్రాయెల్‌పై జరిపిన తాజా దాడిలో.. ఒక మిసైల్ సుమారు 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి, దాని నుండి సుమారు 20 చిన్న పేలుడు పదార్థాలు (submunitions) సెంట్రల్ ఇజ్రాయెల్‌లో 8 కిలోమీటర్ల పరిధిలో పడ్డాయని సమాచారం. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో ఇలాంటి బాంబులను వాడినట్టు నమోదైన ఇది మొట్టమొదటి కేసు.మోస్ట్ డేంజర్ఇరాన్కు చెందిన ఇతర బాలిస్టిక్ క్షిపణుల కంటే ఈ క్లస్టర్ బాంబు క్షిపణులు భారీ ముప్పును కలిగిస్తాయనేది ఇజ్రాయెల్ వాదన. యుద్ధ తీవ్రతను పెంచేందుకు.. భారీ ముప్పును కలిగించేందుకు.. ఇరాన్ ఈ ఆయుధాలను ఉపయోగిస్తోందని, తమ పౌరులకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. డ్యామేజ్ ఏంటంటే.. ఇజ్రాయెల్ వార్తా సంస్థ ప్రకారం.. జూన్ 19న జరిగింది ఇదే. క్షిపణుల్లో ఒకటి అజోర్లోని మధ్య పట్టణంలో ఓ నివాసాన్ని తాకినట్లు తెలుస్తోంది. అయితే, దీని కారణంగా పెద్దగా ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా.. ఇందులోని కొన్ని బాంబులు పేలకుండా ఉన్నాయని, ఇవి పౌరుల ప్రాణాలకు నష్టం కలిగిస్తాయని అధికారులు తెలిపారు. ఈక్రమంలో తమ ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది. అలాంటివాటిని గుర్తిస్తే పౌరులు వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజలను హెచ్చరించింది. వివాదాలకు కేరాఫ్‌గా..క్లస్టర్ బాంబులను వివాదాలకు కేంద్ర బిందువుగా చెబుతుంటారు. అందుకు కారణం.. ఇవి కలిగించే నష్టమే. సాధారణ క్షిపణి ఒక్క స్థలంలో పెద్ద పేలుడు కలిగిస్తుంది. కానీ క్లస్టర్ బాంబు చిన్న చిన్న మ్యూనిషన్లను పెద్ద ప్రాంతంలో చల్లుతుంది. ఒక్కో submunition శక్తి తక్కువైనా, దాని విస్తృత పరిధి కారణంగా ఎక్కువమందికి ప్రమాదం కలిగించవచ్చు. మరీ ముఖ్యంగా జనావాసాలపై గనుక పడితే వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వీటిలో కొన్నివాటిని భూమిని తాకిన వెంటనే పేలకుండా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇవి తరువాత కాలంలో కూడా పౌరులకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అందుకే వీటి వినియోగంపై ఆంక్షలున్నాయి. 2008లో జరిగిన క్లస్టర్ మ్యూనిషన్లపై సమావేశ ఒప్పందం ప్రకారం.. ఈ బాంబులను ఉపయోగించడం, నిల్వ చేయడం, అమ్మకాలు-కొనుగోలు జరపడం పూర్తిగా నిషేధించబడింది. ఈ ఒప్పందంపై 111 దేశాలు, 12 ఇతర ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని అంగీకరించాయి. కానీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, చైనా, భారత్ కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేయలేదు. 2023లో ఉక్రెయిన్ సంక్షోభంలో రష్యాకు వ్యతిరేకంగా క్లస్టర్ బాంబులను అందించిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రష్యా కూడా తమపై క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఉక్రెయిన్ సైతం ఆరోపించింది. U.S. President Joe Biden is under scrutiny for providing Ukraine with cluster bombs.But what makes cluster bombs so controversial?#clusterbomb #joebiden #internationaltreaty #treaty pic.twitter.com/JCuAe0RM9H— CGTN Europe Breaking News (@CGTNEuropebreak) July 11, 2023
జాతీయం

చిన్నారుల పాటకు రాష్ట్రపతి ముర్ము కంటతడి
న్యూఢిల్లీ: చిన్నారుల పాట విని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కరిగిపోయారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ముర్ము శుక్రవారం 67వ బర్త్‌డే జరుపుకున్నారు. డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్‌కు వెళ్లిన ఆమెకు చిన్నారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అంధులైన చిన్నారులు రాష్ట్రపతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పాట ఆలపించారు. ‘ఈ రోజులు మళ్లీ మళ్లీ రావాలి, నా హృదయం మళ్లీ మళ్లీ పాడాలి, మీరు వెయ్యేళ్లు జీవించాలి, ఇదే నా కోరిక, హ్యాపీ బర్త్ డే టూ యూ.. (బార్ బార్ దిన్ ఏ ఆయే, బార్ బార్ దిల్ యే గాయే, తు జియో హజారోం సాల్, యే మేరీ హై ఆర్జూ...)అంటూ సాగిన పాట విని ఆమె కన్నీటిని ఆపుకోలేకపోయారు. ‘వాళ్లెంతో అందంగా, హృద్యంగా పాడారు. నేనెంతో ఉద్వేగానికి లోనయ్యా. వారి పాటవిని సంతోషంతో ఉప్పొంగిపోయా. నా కళ్ల వెంట నీళ్లు ఆగకుండా వచ్చేస్తూనే ఉన్నాయి’అని ఆమె పేర్కొన్నారు. కాగా, రాష్ట్రపతి ముర్ముకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తదితర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె జీవితం, నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రశంసించారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో 1958 జూన్ 20వ తేదీన ముర్ము జన్మించారు. దేశానికి 15వ రాష్ట్రపతిగా 2022 జూలై 25న బాధ్యతలు చేపట్టారు.

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు
చురాచంద్పూర్/బిష్ణుపూర్: మణిపూర్‌లో మళ్లీ అశాంతి చెలరేగింది. గురువారం చురాచంద్పూర్ జిల్లాలోని చింగ్ఫీ గ్రామంలో భద్రతా దళాలు, అనుమానిత కుకీ ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కుకీ వర్గానికి చెందిన ఒక మహిళ మరణించింది. ఆ తర్వాత బిష్ణుపూర్ జిల్లాలోని ఫుబాలా గ్రామంలో కాల్పుల్లో ఒక మైతేయి రైతు గాయపడ్డాడు. ఈ సంఘటనలతో ఈ ప్రాంతంలో మళ్లీ జాతుల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. ఇరువర్గాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. పోలీసులు, అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు బిష్ణుపూర్–చురాచంద్పూర్ సరిహద్దులో ఉన్న లోతట్టు గ్రామమైన ఫుబాలా వద్ద సాయుధులు కాల్పులు జరిపారు. పక్కనే ఉన్న కొండలలో నుంచి పొలాల్లో పనిచేస్తున్న రైతులపై అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. మైతేయి రైతు 60 ఏళ్ల నింగ్తౌజామ్ బిరెన్ ఎడమ చేతికి గాయమైంది. వెంటనే బిష్ణుపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. దాడి తరువాత, భద్రతా దళాలు సమీపంలోని చింగ్ఫీ గ్రామంలో ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో అను మానిత ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిగా యి. ఈ కాల్పుల్లో చురాచంద్‌పూర్‌లోని లాంగ్చింగ్మాన్బి గ్రామ అధిపతి ఖైఖోగిన్ హవోకిప్ భార్య హోయిఖోల్హింగ్ హవోకిప్ బుల్లెట్ తగిలి మరణించింది.

స్కూటీకి రూ. లక్ష... నంబర్‌కు రూ.14 లక్షలు
సిమ్లా: బైక్ లేదా కారు.. వాహనం ఏది కొ న్నా, రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు ఫ్యాన్సీ నెంబర్ కావాలని కోరుకుంటాం. ఏదైతే ఏముందిలే? అని కొందరనుకుంటే.. ఇష్టమైన నంబర్ కోసం ఎంతైనా ఖర్చు చేయాలనుకుంటారు మరికొందరు. ఈ కోవలోకే వస్తాడు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఈ వ్యక్తి. లక్ష రూపాయలు పెట్టి కొన్న స్కూటీకి వీఐపీ నంబర్ హెచ్‌పీ21సీ–0001 కోసం ఏకంగా రూ.14 లక్షలు చెల్లించాడు. ఆ నంబర్ కోసం వేలంలో ఇద్దరే పాల్గొనడం గమనార్హం. సోలన్ జిల్లాలోని బడ్డీకి చెందిన ఓ వ్యక్తి రూ.13.5 లక్షలు పాడగా.. హమీర్‌పూర్‌కు చెందిన సంజీవ్ కుమార్ అతని కంటే ఎక్కువగా రూ.14 లక్షలకు ఆ నంబర్‌ను కైవసం చేసుకున్నాడు. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఇదే. తనకు ప్రత్యేకమైన నంబర్లను సేకరించడం ఇష్టమని చెప్పే సంజీవ్ కుమార్.. ఫ్యాషన్ ముందు డబ్బులు లెక్క కాదంటున్నాడు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవడం తప్పదని చెబుతున్నాడు.

ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రించలేను
సివాన్: నిత్యం ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రించలేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాత్రి పగలు ప్రజల కోసమే పని చేస్తున్నానని చెప్పారు. ఆయన శుక్రవారం బిహార్, ఓడిశాలో పర్యటించారు. తొలుత బిహార్‌లోని సివాన్ జిల్లాలో రూ.5,900 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. బిహార్‌లోని పాటలీపుత్ర జంక్షన్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వరకు నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఆర్జేడీ అవమానించిందని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలను అంబేడ్కర్ వ్యతిరేకించారని గుర్తుచేశారు. అందుకే అంబేడ్కర్ అంటే ఆర్జేడీ, దాని మిత్రపక్షాలకు ఇష్టం లేదన్నారు. బాబాసాహెబ్ చిత్రపటాన్ని ఆర్జేడీ నేతలు పాదాలతో తొక్కేశారని, దీనిపై క్షమాపణ చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తే ఏమాత్రం స్పందించలేదని మండిపడ్డారు. అంబేడ్కర్ కంటే తామే గొప్పవాళ్లమని ఆర్జేడీ–కాంగ్రెస్ నాయకులు అహంకారం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అంబేడ్కర్ తన హృదయంలో ఉన్నాడని, ఆయన చిత్రపటాన్ని గుండెకు హత్తుకోవడం తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు కొల్లగొట్టడానికి ఆర్జేడీ, కాంగ్రెస్ కాచుకొని కూర్చున్నాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాం ‘‘భారతదేశ ప్రగతిని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. నిన్ననే విదేశాల నుంచి తిరిగొచ్చా. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి నేతలు మన దేశ అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రశంసించారు. పేదల సాధికారతకు ఎదురవుతున్న అడ్డంకులను ఎన్డీయే ప్రభుత్వం తొలగిస్తోంది. గత 11 ఏళ్లుగా ప్రజాసేవలో నిమగ్నమయ్యాం. అభివృద్ధి కోసం అహోరాత్రులూ శ్రమిస్తున్నాం. బిహార్‌లో మళ్లీ జంగిల్‌రాజ్ రావొద్దంటే విపక్ష ఇండియా కూటమి ఓడించాలి. ఎన్డీయే నినాదం సబ్కా సాత్, సబ్కా విశ్వాస్. విపక్ష కూటమి నినాదం పరివార్‌కా సాత్, పరివార్‌కా వికాస్. సొంత కుటుంబాల అభివృద్ధి తప్ప ప్రజలంటే వారికి లెక్కలేదు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం కాదా?’’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. భువనేశ్వర్‌లో తిరంగా యాత్ర ప్రధాని మోదీ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో తిరంగా యాత్ర, రోడ్‌షోలో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి జనతా మైదాన్ వరకు 9 కిలోమీటర్ల మేర జరిగిన ఈ యాత్రలో వేలాది మంది ప్రజలు భాగస్వాములయ్యారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయిన సందర్భంగా తిరంగా యాత్ర నిర్వహించారు. రూ.18,600 కోట్లకుపైగా విలువైన 105 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ట్రంప్ ఆహ్వానం తిరస్కరించా.. వాషింగ్టన్లో పర్యటించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించగా, తాను తిరస్కరించానని ప్రధాని మోదీ చెప్పారు. వాషింగ్టన్ పర్యటనకు బదులు ఒడిశాను ఎంచుకున్నానని తెలిపారు. భువనేశ్వర్ సభలో ఆయన మాట్లాడారు. ‘‘జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్ నాతో ఫోన్లో మాట్లాడారు. వాషింగ్టన్కు రావాలంటూ ఆహ్వానించారు. చర్చించుకుందామని, కలిసి భోజనం చేద్దామని అన్నారు. ఆహ్వానించినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలియజేశా. జగన్నాథుడు కొలువుదీరిన ఒడిశాకు వెళ్లాల్సి ఉందని చెప్పా. వాషింగ్టన్కు రాలేనంటూ ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించా’’ అని ప్రధానమంత్రి వెల్లడించారు.
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్‌మార్ట్‌లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.అమెరికాలోని వాల్‌మార్ట్‌లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్‌మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్‌మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్‌ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్‌మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్‌శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్‌గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్‌గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్‌గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్‌గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్‌గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్‌గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్‌గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్‌గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్‌లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్‌తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

కాలేజీ నుంచే ప్రేమ, సహ జీవనం.. గోవాకు తీసుకెళ్లి..
బనశంకరి: కన్నడిగ ప్రేమ జంట గోవా టూర్లో విషాదాంతంగా ముగిసింది. ప్రియురాలిని ప్రియుడు హతమార్చాడు. ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ గోవా పోలీసులు ప్రతాప్నగర వద్ద దార్‌బందోరా అటవీ ప్రదేశంలో యువతి హత్య కేసులో ఆమె ప్రియున్ని అరెస్ట్ చేశారు. అనుమానం పెనుభూతంగా మారి హత్య చేసినట్లు తెలిసింది.గోవా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్ కెవిన్, రోష్ని గోవాలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. సంజయ్ ఏ పనీ చేయకుండా తిరిగేవాడు, రోష్ని అతని ఇంటి దగ్గరే ఓ స్కూల్లో పనిచేసేది. వారికి కాలేజీ రోజుల్లోనే పరిచయమై ప్రేమగా మారింది. చాలా ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు. ఇక పెళ్లాడాలని గోవా ట్రిప్‌కు వెళ్లారు. శనివారం రాత్రి బస్సులో బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున దక్షిణ గోవా పరిధిలోని దార్‌బందోరా అనే ప్రాంతంలో దిగిపోయారు. ఇద్దరూ సమీప అడవిలోకి వెళ్లారు, అక్కడ సంజయ్ ఆమెను కిరాతకంగా కత్తితో పొడిచి చంపి, ఆమె ఫోన్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. ట్యాక్సీలో హుబ్లీకి చేరుకున్నాడు.బస్సు టికెట్లే క్లూ..మంగళవారం ఈ హత్య విషయం బయటపడింది. వెంటనే స్థానిక పోలీసులు క్షుణ్ణంగా గాలించారు. రోష్ని శవం వద్ద పర్సులో బస్సు టికెట్లు దొరకడంతో ఓ క్లూ లభించింది. పలు బస్టాండ్లలో సీసీ కెమెరాల చిత్రాలను సేకరించి ఆ జంట చిత్రాలను సంపాదించారు. అలా నిందితుని ఆచూకీ కనిపెట్టి బుధవారం సాయంత్రం కల్లా అరెస్టు చేశారు. ఇక, బాధితురాలు స్వస్థలం హుబ్లీ అని సమాచారం.అనుమానంతో హత్య: ఎస్పీదక్షిణ గోవా ఎస్పీ తికమ్సింగ్ వర్మ మాట్లాడుతూ.. రోష్ని మరొకరితో సన్నిహితంగా ఉంటోందని సంజయ్ అనుమానం పెంచుకున్నాడని, హత్య చేయాలని ముందే నిర్ణయించుకుని కత్తి కూడా తీసుకున్నాడని తెలిపారు. మాయమాటలు చెప్పి ఆమెను గోవాకు తీసుకువచ్చాని చెప్పారు. ఎంతో క్లిష్టమైన కేసును ఛేదించామని తెలిపారు. నిందితున్ని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. రోష్నిని తానే చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు, తరువాత ఆత్మహత్య చేసుకోవాలనుకుని బెంగళూరుకు వెళ్లిపోయానని చెప్పినట్లు తెలిసింది.

సాఫ్ట్వేర్ ఇంజినీరుతో పెళ్లి.. ఆరు నెలలకే టెకీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: అత్తింటివారి అదనపు కట్నం వేధింపుల కారణంగా పెళ్లయిన ఆరు నెలలకే ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్య చేసుకుంది. హైటెక్ సిటీ వద్ద దుర్గం చెరువులో దూకి తనువు చాలించింది. ఈ క్రమంలో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో భర్తతోపాటు అత్త, మామలు, మరిదిపై పోలీసులు కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని అడ్డగుట్టలో ఉంటున్న అంజయ్య, సుశీల దంపతుల కుమార్తె సుష్మ(27). ఈ ఏడాది జనవరి 31న సుష్మను నేరేడ్మెట్కు చెందిన అమృత్‌కు ఇచ్చి వివాహం చేశారు. సుష్మ, ఆమె భర్త అమృత్ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా చేస్తున్నారు. పెళ్లి సమయంలో రూ.5లక్షల నగదు, 6 తులాల బంగారం, రాయల్ ఎన్ఫీల్డ్ బైకు కట్నంగా కింద ఇచ్చారు. అయితే, పెళ్లి అయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కావాలంటూ భర్తతోపాటు అత్త, మామ, మరిది కలిసి సుష్మను వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. అనారోగ్యంతో ఉన్న సుష్మను ఈనెల 13న ఆసుపత్రిలో చేర్పించారు. 16న డిశ్చార్జి అయిన ఆమెను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ల్యాప్‌టాప్ తెచ్చుకునేందుకు సుష్మ తండ్రితో కలిసి అత్తగారింటికి వెళ్లింది.ఈ సందర్భంగా భర్తతో సహా కుటుంబ సభ్యులు పరుషంగా మాట్లాడారు. మళ్లీ ఎందుకు వచ్చావంటూ సూటిపోటి మాటలు అనడమే కాకుండా అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమె తండ్రి అంజయ్యను కూడా దూషించారు. దీంతో, సుష్మ మనస్తాపానికి గురైంది. బుధవారం మధ్యాహ్నం కంపెనీలో విధులకు వెళ్లింది. రాత్రి ఒంటి గంట వరకు ఇంటికి రాకపోవడంతో తండ్రి అంజయ్య కంపెనీ మేనేజర్‌కు ఫోన్ చేశాడు. రాత్రి 8.30 గంటల సమయంలోనే ఆమె బయటకు వెళ్లిందని చెప్పాడు.అలా చెప్పడంతో కంగారు పడిన అంజయ్య.. తెలిసిన చోట గాలించి గురువారం తెల్లవారు జామున 4 గంటలకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 7.30 గంటల సమయంలో దుర్గం చెరువులో ఓ మహిళ శవం తేలిందని స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి సుష్మ మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. సుష్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ప్రభాకర్‌రావు వ్యవహారంలో సిట్ బృందం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలో సుప్రీంకోర్టును పోలీసులు ఆశ్రయించనున్నారు. ప్రభాకర్‌రావు విచారణకు సహకరించడం లేదంటున్న సిట్.. ఈ నేపథ్యంలో ఆయనకు ఇచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని కోరనున్నట్లు సమాచారం. మరో వైపు ప్రభాకర్‌రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది.ఇప్పటికే మూడుసార్లు ప్రభాకర్‌రావుని విచారించిన పోలీసులు.. నాలుగోసారి కూడా విచారిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారుల పేర్లు చెప్పడంతో రివ్యూ కమిటీ సభ్యులను పోలీసులు విచారించారు. త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ను సైతం పోలీసులు సైతం రికార్డ్ చేయనున్నారు. నిందితుల విచారణతో పాటు సాక్షుల వాంగ్మూలాలు కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నారు.ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్‌కు పంపిన నంబర్లపై సిట్ ఆరా తీస్తోంది. సిట్ అధికారులు స్వయంగా వెళ్లి జితేందర్, అనిల్ నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభాకర్‌రావు టీం మావోయిస్టు సానుభూతిపరులు అంటూ ఇచ్చిన ఫోన్ నెంబర్లు ట్యాపింగ్‌కు అనుమతి ఇవ్వడంపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.ఫోన్ ట్యాపింగ్‌కు ఐజీ లేదా ఆ పై స్థాయి ఆఫీసర్కే అధికారం ఉంది. పదవి విరమణ పొంది.. ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్‌రావును ఫోన్ లీగల్ ఇంటర్ సెప్సన్కు డిసిగ్నటెడ్ అథారిటీగా నియమించడంపై సిట్ ఆరా తీస్తోంది. డిసిగ్నేటెడ్ అథారిటీకి 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టే అవకాశం.. గడువు ముగిసిన తర్వాత నిఘా పెట్టాలంటే రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి.. కానీ ప్రభాకర్‌రావు ఇష్టం వచ్చినట్లు ట్యాపింగ్‌కు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. డీజీపీ జితేందర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావు సిట్ అధికారులు విచారిస్తున్నారు.

మంట కలిసిన మానవ సంబంధం
వరంగల్: ధన దాహం.. ఆస్తి పంపకాల్లో తేడాలతో రక్త సంబంధాలు మంట కలిసిపోతున్నాయి.. భూ వివాదంలో అన్నాదమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హత్యకు దారితీసింది. సొంత త మ్ముళ్లు (పినతల్లి కుమారులు).. అన్నయ్య వల్లపు కృష్ణ(43)ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్యకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య మాణిక్యమ్మకు ఒక కొడుకు కృష్ణ, ముగ్గురు కుమార్తెలు ప్రమీల, రమణ, వినోద ఉన్నారు. రెండవ భార్య నర్సమ్మకు ఇద్దరు కొడుకులు నరేశ్, మహేశ్ ఉన్నారు.లింగయ్యకు గ్రామ ప్రధాన రహదారికి ఆనుకుని 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొన్నేళ్ల క్రితం లింగయ్య తన ముగ్గురు కొడుకులకు, కూతురు రమణకు భూమి పట్టా చేయించాడు. కొన్నేళ్ల తర్వాత భూమి పంపకాలు చేశాడు. బిడ్డకు ఎందుకు పట్టా చేశావని రెండో భార్య కొడుకులు తండ్రితో గొడవ పడుతున్నారు. పలుమార్లు పంచాయితీలు, పోలీస్ స్టేషన్లో కేసుల దాకా వెళ్లింది. అయినా సమస్య పరి ష్కారం కాలేదు. ఈ క్రమంలో భూమి పంపకాల్లో రిజిస్ట్రేషన్ సర్వేనంబర్ ప్రకారం రెండో భార్య కొడుకుల్లో ఒకరు నరేశ్‌కు రోడ్డు వైపు వచ్చింది. కాగా, తండ్రి.. ముగ్గురు కుమారులకు రోడ్డువైపు సమానంగా ఉండేలా పంపకాలు చేశాడు. కానీ, నరేశ్ రిజిస్ట్రేషన్ ప్రకారం తనకు భాగం వచ్చిందంటూ తండ్రి చేసిన పంపకాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ పంచాయితీ ముదిరిపాకాన పడింది. కృష్ణ తన భార్య సత్యవతి, కుమారుడు మిన్ను, కుమార్తెతో కలిసి హైదరాబాద్‌లో బతుకుతున్నాడు. ఈ నెల 17న (మంగళవారం) హైదరాబాద్ నుంచి సీరోలుకు వచ్చాడు. బుధవారం ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. ముందస్తు పథకం ప్రకారం తమ్ముళ్లు నరేశ్, మహేశ్, వారి భార్యలు, కాంపలి్లకి చెందిన నున్న వీరన్న(నరేశ్ బావమరిది) కలిసి వ్యవసాయ భూమి వద్ద కృష్ణతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న తండ్రి లింగయ్య అక్కడికి చేరుకున్నాడు. గొడవ ముదరడం, తండ్రి గొడవను ఆపే యత్నం చేశారు. అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో నరేశ్ తన అన్న కృష్ణ కుడి మెడపై నరికాడు. ఆపే యత్నం చేస్తున్న తండ్రికి సైతం గాయాలయ్యాయి. కృష్ణ రక్తమడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలియడంతో సీరోలు ఎస్సై నగేశ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, తండ్రి లింగయ్యను చికిత్స నిమిత్తం వెంటనే మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మరిపెడ సీఐ రాజ్‌కుమార్ సీరోలుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, నిందితుడు నరేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కొడుకు పుట్టిన రోజే తండ్రి మరణం..మృతుడు వల్లపు కృష్ణ కొడుకు మిన్ను పుట్టిన రోజు బుధవారం. సాయంత్రం వేడుకలు చేద్దామని అనుకున్న తరుణంలో ఈ హత్య జరగడంతో ఆ కుటుంబాన్ని కుంగదీసింది.