Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Chittoor Bangarupalyam Tour Live Updates1
రైతులపై రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తారా : వైఎస్‌ జగన్‌

వైఎస్‌ జగన్‌ బంగారుపాళ్యం పర్యటన అప్‌డేట్స్‌ రైతుల జీవితాలు నాశనం చేయాలని కుట్రలు చేస్తున్నారువైఎస్‌ జగన్‌ వస్తున్నాడని 2వేల మంది పోలీసులను మోహరించారురైతులను రౌడీ షీటర్లతో పోలుస్తారా?రైతుల సమస్యలపై మాట్లాడితే భయమెందుకుఏ పంటకూ కూడా గిట్టుబాటు ధరలేదురాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందిప్రభుత్వం రైతుల మీద కుట్రలు చేయడం దారుణంవైఎస్సార్‌సీపీ హయాంలో మామిడి పంటకు గిట్టుబాటు ధర ఉండేదికర్ణాటకలో కేజీ మామిడి రూ.16 కొంటున్నారుకర్ణాటకలో కేజీ మామిడి రూ.16 ఇచ్చి కేంద్రమే కొంటుందికర్ణాటకలో కేంద్రం మామిడి కొనుగోలు చేస్తుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?రాష్ట్రంలో మామిడికి కనీసం రూ.12 కూడా ఇచ్చే పరిస్థితి లేదుమా ప్రభుత్వంలో రైతన్నను ఆర్బీకేలు చేయిపట్టి నడిపాయిఇప్పటి వరకూ రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు, ఇన్‌ పుట్‌ సబ్సీడీ అందలేదుధరలపై మామిడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారువైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేజీ మామిడి రూ.22 నుంచి రూ.29లకు కొన్నాంరూ.2లకు కేజీ మామిడినా..? ఇదేం దారుణంకూటమి ప్రభుత్వంలో మామిడి రైతులు కన్నీరు పెడుతున్నారుధరలపై మామిడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారుమామిడి రైతులను కూటమి ప్రభుత్వం దివాళా తీసేలా చేసిందిమామిడి ఫ్యాక్టరీలు, ప్రభుత్వం మామిడి రైతులను మోసం చేస్తున్నాయి.చంద్రబాబు పుణ్యాన ఆర్‌బీకేలు నిర్విర్యమయ్యాయినియోజకవర్గాల్లో అగ్రి టెస్ట్‌ ల్యాబులు నిర్వీరయమయ్యాయిమామిడి పంటను రాష్ట్రమే కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలిరైతుల తరుఫున వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఉద్యమిస్తుందిరాష్ట్రంలో ప్రతీ రైతుకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందిరైతుల తలలు పగలకొడతారా? 12వందల మందిని జైల్లో పెడతారా?రాష్ట్రంలో ఉంది పోలీసులా? రాక్షసులా?కూటమి ప్రలోభాలు,లంచాలకు పోలీసులు లొంగొద్దురేపు పోలీసులను కూడా చంద్రబాబు మోసం చేస్తారుమార్కెట్‌ యార్డు వద్దకు చేరుకున్న వైఎస్‌ జగన్‌బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌ యార్డుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌మామిడి రైతుల సమస్యలను తెలుసుకోనున్న వైఎస్‌ జగన్‌జనసందోహంగా మారిన మార్కెట్‌ యార్డ్‌. పోలీసుల వలయం దాటుకుని మార్కెట్‌ యార్డుకు రైతులు తరలివచ్చారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు రైతులు తరలివచ్చారు. వేలాది సంఖ్యలో రైతులు అక్కడికి వచ్చారు. మామిడి రైతుల ఆవేదనమామిడి మార్కెట్‌ యార్డ్‌కు రాకుండా 25 చెక్‌పోస్టులు పెట్టారు.బంగారుపాళ్యం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు చేరుకున్నాం.అడ్డదారుల్లోపరుగులు పెట్టుకుంటూ యార్డుకు వచ్చాం.కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదు.ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అయ్యింది. వైఎస్‌ జగన్‌ పర్యటనపై కూటమి కుట్రలు.. వైఎస్‌ జగన్‌ బంగారుపాళ్యం పర్యటనపై ప్రభుత్వం కుట్రలు.వైఎస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నం.వైఎస్‌ జగన్‌ పర్యటనకు అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌.పోలీసుల లాఠీచార్జ్‌లో​ కార్యకర్తకు గాయాలు.గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లకుండా జగన్‌ను అడ్డుకున్న ఎస్పీ.కాన్వాయ్‌లోని వాహనాలను అడ్డుకున్న పోలీసులుమాజీ మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా వాహనాలు అడ్డగింత.రైతులు కూడా బంగారుపాళ్యం రాకుండా బారికేడ్లు.రైతుల సమస్యలు జగన్‌కు చెప్పుకోకుండా చేయాలని కుట్ర. చిత్తూరు జిల్లా పోలీసుల ఓవరాక్షన్అడుగడుగునా పోలీసుల చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలుహెలిప్యాడ్ నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు పొడవునా పోలీసులు, చెక్ పోస్టులుచివరికి వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలనూ లెక్కించి పంపుతున్న పోలీసులుఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా ఆపేసిన పోలీసులుYSRCP నేతల కార్లకూ అనుమతి లేదంటూ నిలిపివేతహైవే మీద బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ కు అంతరాయంచిత్తూరు-బెంగుళూరు వైవే మీద ప్రయాణీకులకు ఇబ్బందులుపోలీసులు లాఠీచార్జ్‌లో వైఎస్సార్‌సీపీ కార్యక‍ర్త తలకు గాయం.వెంటనే ఆసుప్రతికి తరలించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు. వైఎస్‌ జగన్‌కు మా సమస్యలు చెప్పుకుంటాం: రైతులుజగన్‌ మా దగ్గరికి వస్తే ప్రభుత్వానికి ఎందుకంత ఉలికిపాటు.బంగారుపాళ్యం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు చేరుకున్నాం.ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు.వైఎస్‌ జగన్‌కు మా సమస్యలు చెప్పుకుంటాం.జగన్‌ పాలనలో మాకు గిట్టుబాటు ధర వచ్చింది. యార్డుకు వచ్చిన రైతులు..వైఎస్‌ జగన్‌ కోసం భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలుపోలీసులు చెక్‌పోస్టులు పెట్టినప్పటికీ రైతులు యార్డ్‌కు చేరుకున్నారు. వైఎస్‌ జగన్‌ కోసమే యార్డ్‌కు వచ్చినట్టు పలువురు కార్యకర్తలు, ‍ప్రజలు తెలిపారు వైఎస్‌ జగన్‌ పర్యటనలో పాల్గొనకుండా రైతులకు ఆటంకాలు.సమీప ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరింపు.ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు కనిపిస్తే సీజ్‌పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు తరలివచ్చిన రైతులు. బంగారుపాళ్యం చేరుకున్న వైఎస్‌ జగన్‌ కాసేపట్లో మార్కెట్‌ యార్డ్‌కు వైఎస్‌ జగన్‌కూటమి సర్కార్‌ కుట్రలు, పోలీసులను చేధించిన రైతులుమామిడి మార్కెట్‌కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన రైతులు, ప్రజలువైఎస్‌ జగన్‌ కోసం తరలిన అభిమానులు..వైఎస్ జగన్ పర్యటనకు భారీగా తరలివస్తున్న ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలుఅడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులువైఎస్‌ జగన్ పర్యటనకు వచ్చేవారి వాహనాలు సీజ్ చేసి, చార్జ్‌షీట్‌ ఓపెన్ చేస్తామంటూ పోలీసుల బెదిరింపులుఅయినా తగ్గిన అభిమానులునడుచుకుంటూ వైఎస్‌ జగన్‌ని చూడటానికి వెళ్తున్న ప్రజలుబంగారుపాళ్యం వచ్చే రహదారులలో చెక్ పోస్టులు ఏర్పాటువైఎస్సార్‌సీపీ నేతలతో పోలీసులు వాగ్వాదం.కొన్నిచోట్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులపై పోలీసుల లాఠీచార్జ్. బంగారుపాళ్యం బయలుదేరిన వైఎస్‌ జగన్‌కాసేపట్లో మామిడి మార్కెట్‌ యార్డ్‌కు వైఎస్‌ జగన్‌గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్న రైతులు మామిడి రైతులను పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌ చెక్‌పోస్టుల ఏర్పాటు.. తిరుపతి, కర్ణాటక ప్రధాన రహదారి నాలుగు ప్రాంతాలలో చెక్ పోస్ట్ ఏర్పాటుకర్వేటినగరం, చిత్తూరు మార్గమధ్యంలో రెండు చోట్ల చెక్‌పోస్టులుకొత్తపల్లి మిట్ట, గంగాధర నెల్లూరులో రెండు చెక్ పోస్టులు ఏర్పాటువాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు.వైఎస్ జగన్ పర్యటన వచ్చే వాహనాలను సీజ్ చేస్తామంటున్న పోలీసులుఉదయం నుండి వాహనాలలో వస్తున్న అభిమానులు, పార్టీ నాయకులుప్రధాన నాయకులను అనుమతించి, ఇతర నాయకులను దింపేస్తున్న పోలీసులుభారీగా పోలీసుల మోహరింపువైఎస్ జగన్ పర్యటనపై ప్రభుత్వ కుట్రలుబంగారుపాళ్యం మామిడి యార్డును ఖాళీ చేయించిన అధికారులురైతులను రానివ్వకుండా యార్డుకు తాళాలురైతులను జగన్ పర్యటనలో పాల్గొననీయకుండా అడుగడుగునా ఆటంకాలుసమీప గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపుఆటోలు, ట్రాక్టర్లు ఇతర వాహనాలు కనిపిస్తే సీజ్ చేస్తున్న పోలీసులుప్రభుత్వ చర్యలపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహంపోలీసుల ఓవరాక్షన్‌బంగారుపాళ్యం చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల ఓవరాక్షన్‌వైఎస్ జగన్ పర్యటనకు వచ్చే రైతులు, నాయకులు, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులువాహనాలను సీజ్ చేస్తున్న పోలీసులుకూటమి ప్రభుత్వం, పోలీసుల వ్యవస్థతో నిరంకుశ పాలన కొనసాగిస్తుందని రైతుల ఆగ్రహంటోల్ గేట్ వద్దకు చేరుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామినారాయణ స్వామి కామెంట్స్‌..జగన్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తుందివైఎస్ జగన్ అంటే కూటమి ప్రభుత్వానికి భయం.అందుకే అడుగడుగునా అడ్డుకుంటున్నారుచిత్తూరు జిల్లా బంగారుపాళ్యం రహదారుల్లో అడుగడుగునా ఆంక్షలుపోలీసులు ఆంక్షలు..బంగారుపాళ్యంలో ఆటంకాలు సృష్టిస్తున్న పోలీసులుబంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు రైతులు రాకుండా వి.కోట మండలం కారకుంట వద్ద పోలీసుల తనిఖీలు, వీడియో రికార్డుబైరెడ్డిపల్లి మండలం కైగల్ వద్ద కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలుబంగారుపాళ్యం మండలం మిట్టపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు, వీడియో రికార్డింగ్ చేసిన తర్వాతనే అనుమతి చిత్తూరు..వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ పర్యటనపై అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ పర్యటనలో పాల్గొనకూ­డ­దని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం.. రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం జరుగుతోంది.కూటమి నేతల బెదిరింపులు...దారుణంగా ధరల పతనంతో కుదేలైన మామిడి రైతుల దుస్థితిని నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపా­ళెం మార్కెట్‌ను సందర్శించనున్న మాజీ సీఎం, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పర్యటనకు టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది.ఎన్ని ఆటంకాలు సృష్టించినా...మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. వైఎస్‌ జగన్‌ ఇటీవల నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నా.. హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బంగారుపాళ్యం పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీశారు.ఎన్ని ఆటంకాలు సృష్టించినా వైఎస్‌ జగన్‌ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని వైఎస్సార్‌సీపీ నేతలు తేల్చి చెప్పటంతో.. ఎట్టకేలకు అనుమతులు ఇస్తూనే హెలిప్యాడ్‌ వద్ద కేవలం 30 మంది, మార్కెట్‌ యార్డులో 500 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు సుమారు 400 మందికి నోటీసులు జారీ చేశారు.వైఎస్‌ జగన్‌ పర్యటన ఇలా... వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరుతారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.20 గంటలకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌కు చేరుకుని మామిడి రైతులతో సమావేశమవుతారు. వారి కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు.

SP Manikanta Over At YS Jagan Convoy In Bangarupalyam2
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌.. పోలీసులపై వైఎస్‌ జగన్‌ సీరియస్‌

సాక్షి, చిత్తూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అభిమానులు, రైతులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బంగారుపాళ్యంకు తరలివచ్చారు. వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ అభిమానులు, కార్యకర్తలు తమ ప్రియతమ నాయకుడి కోసం తరలివచ్చారు. ఈ క్రమంలో వారిపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఈనేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్‌, లాఠీచార్జ్‌పై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారుపాళ్యంలో పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో వైఎస్సార్‌సీపీ నాయకుడు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రగిరి యువజన విభాగం కార్యదర్శిపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో అతడి తలకు బలమైన గాయమై.. రక్తస్రావం జరిగింది. ఈ విషయం తెలిసి.. బంగారుపాళ్యం వద్ద కారు దిగేందుకు వైఎస్‌ జగన్‌ ప్రయత్నించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను కొట్టారని కారు దిగేందుకు వైఎస్‌ జగన్‌కు తెలియడంతో కారును ఆపారు. లాఠీచార్జ్‌లో గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లేందుకు జగన్‌ ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ను కారు దిగకుండా ఎస్పీ మణికంఠ అడ్డుకుని ఓవరాక్షన్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ కారు దిగకుండా.. అక్కడి నుంచి పంపించేశారు.దీంతో, చిత్తూరు పోలీసులపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీచార్జ్‌పై వైఎస్‌ జగన్‌ సీరియస్‌ అయ్యారు. గాయపడిన పార్టీ నేతను పరామర్శించనివ్వరా అంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయం అంటూ మండిపడ్డారు. మరోవైపు.. బంగారుపాళ్యంలో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పోలీసుల చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలు చేస్తూ.. వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలనూ లెక్కించి పంపుతున్నారు. హెలిప్యాడ్ నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు పొడవునా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తనిఖీల్లో భాగంగా ఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా పోలీసులు ఆపేశారు. వైఎస్సార్‌సీపీ నేతల కార్లకూ అనుమతి లేదంటూ నిలిపివేశారు. హైవే మీద బారికేడ్లు పెట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు.

SIT Hand Over Phone Tapping case Prabhakar Rao laptop And Phone3
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను సిట్‌ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు డేటా కీలకంగా మారనుంది. వీటి నుంచి డేటాను సేకరించి పనిలో అధికారులు ఉన్నారు.వివరాల ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను సిట్‌ అధికారులు సీజ్ చేశారు. అనంతరం, ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కి సిట్ అధికారులు పంపించారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ నుండి మార్చి15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రభాకర్‌ రావు.. పలువురు బీఆర్‌ఎస్‌ నేతలతో, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సిట్‌ అనుమానం వ్యక్తం చేస్తోంది.ఇక, ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్‌ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. రేపు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. 2023 నవంబర్ 15 నుండి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లను సిట్‌ గుర్తించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ధ్వంసమైన హార్డ్ డిస్కులలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్టు సమాచారం. దీంతో, సిట్‌ అధికారులు.. హార్డ్ డిస్కులపైన ఆశలు పెట్టుకున్నారు. డేటా రిట్రైవ్, హార్డ్‌ డిస్కులోని రహస్యాలపై సిట్ ఆరా తీస్తోంది.

ENG VS IND 3rd Test: Rishabh Pant Needs 5 More Sixes To Become All Time Six Hitter Of Indian Test History4
ENG VS IND 3rd Test: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో రిషబ్‌ పంత్‌

టీమిండియా డాషింగ్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రేపటి నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో మరో 5 సిక్సర్లు బాదితే టెస్ట్‌ల్లో భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్‌ పేరిట ఉంది. వీరూ 103 టెస్ట్‌ల్లో 90 సిక్సర్లు బాదాడు. వీరూ తర్వాతి స్థానంలో రోహిత్‌ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్‌ 67 టెస్ట్‌ల్లో 88 సిక్సర్లు కొట్టాడు. పంత్‌ విషయానికొస్తే.. ఇతగాడు కేవలం 45 మ్యాచ్‌ల్లోనే 86 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించేందుకు మరో 5 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. పంత్‌ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్ట్‌లో ఈ రికార్డు సాధించడం ఖాయంగా కనినిస్తుంది.ఓవరాల్‌గా చూస్తే టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో పంత్‌ 12వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో పంత్‌ 5 సిక్సర్లు కొడితే భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డుతో పాటు టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకుతాడు. టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ పేరిట ఉంది. స్టోక్స్‌ 113 మ్యాచ్‌ల్లో 133 సిక్సర్లు బాదాడు. స్టోక్స్‌ తర్వాతి స్థానాల్లో బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (107), గిల్‌క్రిస్ట్‌ (100), టిమ్‌ సౌథీ (98), గేల్‌ (98), కల్లిస్‌ (97), సెహ్వాగ్‌ (91), ఏంజెలో మాథ్యూస్‌ (90), రోహిత్‌ శర్మ (88), లారా (88) ఉన్నారు (టాప్‌-10లో).కొద్ది రోజుల కిందట మరో భారీ సిక్సర్ల రికార్డు బద్దలు కొద్ది రోజుల కిందట జరిగిన ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లో పంత్‌ మరో భారీ సిక్సర్ల రికార్డు సాధించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో బెన్‌ స్టోక్స్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. పంత్‌ ఇంగ్లండ్‌లో (టెస్ట్‌ల్లో) 23 సిక్సర్లు బాదగా.. స్టోక్స్‌ సౌతాఫ్రికాలో 21 సిక్సర్లు కొట్టాడు. భీకర ఫామ్‌లో పంత్‌ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో పంత్‌ రెండు ఇన్నింగ్స్‌లో శతకాలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 140 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో పంత్‌ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (25) ఔటైనా, రెండో ఇన్నింగ్స్‌లో తనదైన శైలిలో మెరుపు అర్ద సెంచరీ (65) చేశాడు. రేపటి నుంచి లార్డ్స్‌ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. పంత్‌ మరోసారి చెలరేగాలని అంతా ఆశిస్తున్నారు. ఈ సిరీస్‌లో భారత్‌, ఇంగ్లండ్‌ తలో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్‌ భారీ విజయం సాధించింది.

Golden Visa investment program offered by several countries for citizenship5
దేశాలు పిలుస్తున్నాయ్‌..

మనలో చాలామంది ఇతర దేశాల పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడాలనుకుంటారు. అయితే ఇది మధ్యతరగతి వారికి కొంత కష్టం కావొచ్చుకానీ, ధనవంతులకు మాత్రం సులువే. అందుకు అనుగుణంగా ప్రస్తుతం చాలా దేశాలు వాటి సిటిజన్‌షిప్‌ నియమాల్లో మార్పులు తీసుకొస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత మొన్నామధ్య ఆ దేశ పౌరసత్వం పొందాలంటే గోల్డ్‌కార్డు వీసా తీసుకోవాలని దాన్ని ప్రదర్శించారు. డబ్బు కడితే చాలా దేశాల పౌరసత్వం కార్డు మీ జేబులో ఉంటుంది. ఈ లిస్ట్‌లో కేవలం యూఎస్‌తోపాటు చాలా దేశాలే ఉన్నాయి. ప్రధానంగా ఏయే దేశాలు తమ పౌరసత్వం కోసం ఎలాంటి నిబంధనలు పెట్టాయో తెలుసుకుందాం.యూఎస్‌ఏఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఐదు మిలియన్ డాలర్ల(సుమారు రూ.44 కోట్లు) విలువైన కొత్త గోల్డ్ కార్డు వీసాలు ప్రారంభించింది. సంపన్న విదేశీయులకు గోల్డ్ కార్డులను అందించడానికి ట్రంప్ ఈ కొత్త ప్రణాళికను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టారు. ఇది వారికి యూఎస్ రెసిడెన్సీ, పౌరసత్వానికి అవకాశం కల్పిస్తుంది. దాంతోపాటు అమెరికా ఖజానాకు ట్రిలియన్ల ఆదాయాన్ని సృష్టించగలదని, ఇది దేశ రుణాన్ని తగ్గించడానికి దోహదం చేస్తుందని తెలిపారు. కొత్త గోల్డెన్‌ కార్డు కొంత వరకు గ్రీన్ కార్డు మాదిరి వెసులుబాటు అందిస్తున్నా ప్రధానంగా సంపన్నులపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.అమెరికాలో పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన వీసా(ఈబీ-5 వీసా) పాలసీని ట్రంప్‌ మార్చాలని యోచించారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు ‘గోల్డ్ కార్డ్’ వీసాను మంజూరు చేశారు. ఈ వీసాను ఐదు మిలియన్‌ డాలర్ల(సుమారు రూ.44 కోట్లు)తో పొందాల్సి ఉంటుంది. యూఎస్ సిటిజెన్​షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్​సీఐఎస్) వెబ్‌సైట్‌ ప్రకారం, ఈబీ-5 వీసా విధానాన్ని ఉద్యోగ కల్పన-విదేశీ పెట్టుబడిదారుల మూలధన పెట్టుబడుల ద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి 1990లో కాంగ్రెస్​ ఆమోదించింది. 2021 సెప్టెంబరు నుంచి 2022 సెప్టెంబరు 30వ తేదీ వరకు దాదాపు 8వేల మంది ఈ వీసాలను పొందారు.జన్మతః పౌరసత్వాన్ని గుర్తించరు..ఈబీ-5 ద్వారా పెట్టుబడిదారులు, వారి జీవిత భాగస్వాములు.. 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అవివాహిత పిల్లలు నాన్-టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియా (టీఈఏ) ప్రాజెక్టులో 1.8 మిలియన్ డాలర్లు లేదా టీఈఏ ప్రాజెక్టులో కనీసం 8,00,000 డాలర్లు పెట్టుబడి పెడితే శాశ్వత నివాసానికి అర్హులు. అయితే, ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని అధికారులు గుర్తించారు. దాంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ అధికారం చేపట్టిన తర్వాత జన్మతః పౌరసత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చి వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్‌ ప్రభుత్వం గుర్తించబోదని ట్రంప్‌ తెలిపారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేశారు. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జన్మతః పౌరసత్వ విధానం కొనసాగుతోంది.సింగపూర్ గోల్డెన్ వీసావ్యాపార అవకాశాలు, అధిక జీవన నాణ్యతను కోరుకునే అధిక నికర విలువ కలిగిన వ్యక్తులకు సింగపూర్ గమ్యస్థానంగా తోస్తుంది. సింగపూర్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ (జీఐపీ) ద్వారా భారీ పెట్టుబడులు పెట్టేవారికి పౌరసత్వం కల్పిస్తున్నారు. దేశంలో శాశ్వత ఉనికిని చాటుకోవాలనుకునే అల్ట్రా-హైనెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్‌డబ్ల్యూఐ) కోసం ఈ వీసా ప్రోగ్రామ్ రూపొందించారు. ఈ వీసా ప్రాసెసింగ్ సమయం సాధారణంగా 9–12 నెలలుగా ఉంటుంది. జీఐపీలో పౌరసత్వం పొందాలంటే కనీసం 10 మిలియన్‌ సింగపూర్‌ డాలర్లు(రూ.67 కోట్లు) పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. జీఐపీకు అర్హత పొందాలంటే దరఖాస్తుదారులు బిజినెస్ లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌లో నిరూపితమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉండాలి. టెక్, హెల్త్‌కేర్‌, లాజిస్టిక్స్ లేదా ఫైనాన్స్ వంటి ఆమోదించబడిన రంగాల్లో ఒకదానిలో బిజినెస్‌ చేస్తుండాలి.పౌరసత్వం ఎప్పుడు వస్తుందంటే..గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ కింద పర్మినెంట్ రెసిడెన్సీ (పీఆర్) హోదా పొందిన రెండేళ్ల తర్వాత, దరఖాస్తుదారులు ప్రత్యేకంగా సింగపూర్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియలో కీలకమైన షరతు ఉంది. సింగపూర్ ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు. అందువల్ల ఆ దేశ పౌరసత్వం పొందడానికి దరఖాస్తుదారులు తమ ప్రస్తుత పౌరసత్వాన్ని వదులుకోవాలి.ప్రయోజనాలుసింగపూర్ గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ పెట్టుబడిదారులకు అందించే వీసా ఉంటే 190కి పైగా దేశాలకు ప్రత్యేకంగా వీసా లేకుండా ప్రయాణించవచ్చు. సింగపూర్‌లో గరిష్టంగా 24% వరకు మాత్రమే వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచ స్థాయి వైద్యం, విద్య, ఉన్నత జీవన ప్రమాణాలకు సింగపూర్‌ కీలకంగా మారింది.ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభంయూకేయూకేలో ఈ గోల్డ్‌కార్డ్‌ వీసాను అధికారికంగా ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాగా పిలుస్తారు. పెట్టుబడిదారులను, ప్రతిభావంతులైన ఆకర్షించడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి యూకే ప్రయత్నాల్లో భాగంగా 2020లో ఈ వీసాను ప్రవేశపెట్టింది. ఇది యూకేలో వ్యాపారం చేయాలనుకునే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. ఈ వీసా 3 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. తర్వాత శాశ్వత నివాసానికి ఇండెఫినెట్‌ లీవ్‌ టు రిమేన్‌(ఐఎల్ఆర్) కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఐఎల్ఆర్ ప్రక్రియలో దరఖాస్తుదారులు కనీసం 5 సంవత్సరాలు (ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాపై గడిపిన సమయంతో సహా) యూకేలో నివసించినట్లు రుజువు చేయాలి. ఇతర నివాస, ఆదాయ ప్రమాణాలను చేరుకోవాలి. వ్యాపారంలో కనీసం 50000 పౌండ్లు(రూ.58,29,000) పెట్టుబడి పెట్టాలి.ఈ వీసాకు అర్హతలు..ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాకు అర్హత సాధించడానికి దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఆమోదం పొందాలి. యూకే ప్రభుత్వం గుర్తించిన బిజినెస్ ఇంక్యుబేటర్, ఇన్వెస్టర్‌ ద్వారా ఆమోదం పొందాలి. మీ వ్యాపార ఆలోచన సృజనాత్మకమైనదని, ఆచరణీయమైనదని ఆ ఈ సంస్థ ధ్రువీకరించాలి. దరఖాస్తుదారులు బీ2 స్థాయి ఇంగ్లిష్ (సీఈఎఫ్ఆర్ స్కేల్) కలిగి ఉండాలి. ఇది అప్పర్ ఇంటర్మీడియట్ నైపుణ్యానికి సమానం. ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా దీన్ని నిరూపించవచ్చు.

Alia Bhatt Ex Assistant Arrested For Cheating Actor Of RS 77 Lakh6
హీరోయిన్‌ పేరుతో 77 లక్షల మోసం.. మాజీ పీఏ అరెస్ట్‌!

బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌(Alia Bhatt ) మాజీ పర్సనల్‌ అసిస్టెంట్‌(పీఏ) వేదికా ప్రకాశ్‌ శెట్టిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హీరోయిన్‌ సంతకాలు ఫోర్జరీ చేసి రూ. 77 లక్షల మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆలియా తల్లి, దర్శకురాలు సోనీ సోనీ రజ్దాన్‌ ఇచ్చిన ఫిర్యాదుతో వేదిక ప్రకాశ్‌శెట్టిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2021 నుంచి 2024 వరకు అలియా వ్యక్తిగత సహాయకురాలిగా వేదిక పని చేసింది. ఆ సమయంలో ఆలియాకు సంబంధించిన ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్లు, పేమెంట్స్‌, షెడ్యూల్‌ ప్లానింగ్‌లను వేదికనే చూసుకునేది. అదే సమయంలోనే వేదికా నకిలీ బిల్లులు సృష్టించి ఆలియా సంతకాన్నీ మార్ఫింగ్‌ చేసి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఐదు నెలల క్రితమే వేదికపై ఆలియా తల్లి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే సోనియా ముంబై నుంచి పారిపోయింది. రాజస్తాన్‌, కర్ణాటక, పుణెల్లో తిరుగుతూ.. చివరకు బెంగళూరులో పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్ట్‌ చేసి ముంబైకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Gujarat Vadodara Gambhira Bridge Collapsed, Video Viral7
ఒక్కసారిగా కూలిపోయిన వంతెన.. ట్రక్కు, కార్లు నదిలో పడిపోయి..

గాంధీనగర్‌: గుజరాత్‌ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కూలిపోయింది. ఒక్కసారిగా వంతెన కూలిపోవడంతో దానిపై నడిచే వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. కొందరు ప్రయాణీకులు గల్లంతయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని ఆనంద్ పట్టణం, వడోదరలను కలుపుతూ మహిసాగర్ నదిపై పద్రా వద్ద గంభీర వంతెన ఉంది. బుధవారం ఉదయం గంభీర వంతెనలోని కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దానిపై వెళ్తున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే.. సహాయక బృందాలు అక్కడి చేరుకుని నదిలో ఉన్న వారిని రక్షించారు. వాహనాల నుంచి ఇప్పటివరకు నలుగురిని రక్షించారని.. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. Gujarat’s Gambhira Bridge Collapse Kills Nine, Severs Key Vadodara–Anand Routehttps://t.co/aYn6KEELhi— DeepNewz (@deepnewzcom) July 9, 2025 #WATCH | Vadodara, Gujarat | The Gambhira bridge on the Mahisagar river, connecting Vadodara and Anand, collapses in Padra; local administration present at the spot. pic.twitter.com/7JlI2PQJJk— ANI (@ANI) July 9, 2025అయితే, వంతెన పాతబడడంతో పాటు.. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కూలిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తంచేశారు. వంతెన కూలడంతో ఇరు పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. How this happened ? “The Gambhira Bridge connecting Vadodara and Anand has collapsed in the middle. Several vehicles are feared to have fallen into the river; rescue operations are ongoing.”The middle portion just vanished. #Vadodara pic.twitter.com/t2yZSoXexz— Kumar Manish (@kumarmanish9) July 9, 2025#BREAKING 2 people dead in Gujatat bridge collapse A portion of the decades-old Gambhira bridge, connecting Vadodara & Anand near Padra has collapsed over the Mahisagar river The 45yr old structure gave way while vehicles were passing over it, plunging at least four into… pic.twitter.com/VwVJXxym8p— Nabila Jamal (@nabilajamal_) July 9, 2025

Shiv Sena MLA Gaikwad Thrashes Canteen Contractor8
పప్పు బాగోలేదని.. శివసేన ఎమ్మెల్యే వీరంగం

ముంబై: శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌ క్యాంటీన్‌ నిర్వాహకునిపై తన ప్రతాపం చూపారు. ఈ ఘటన ముంబైలోని ఆకాశవాణి గెస్ట్‌ హౌస్‌లో చోటుచేసుకుంది. క్యాంటీన్‌లో తనకు వడ్డించిన ఆహారంలో పప్పు బాగోలేదని, అది తిన్న కొద్దిసేపటికే తనకు అనారోగ్యంగా అనిపించిందని సంజయ్ గైక్వాడ్ చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశంలో సమస్యను లేవనెత్తుతానని ఆయన అన్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బుల్దానా నుండి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన గైక్వాడ్, శాసనసభ్యుల కోసం ప్రభుత్వం కేటాయించిన వసతి గృహం అయిన ఆకాశవాణి ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉంటున్నారు. శివసేనలోని ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న క్యాంటీన్ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేసినట్లు సమాచారం. వైరల్‌ అయిన వీడియోలో గైక్వాడ్ షర్టు, టవల్‌ ధరించి క్యాంటీన్ నిర్వాహకునితో గొడవపడుతున్న దృశ్యం కనిపిస్తుంది. Meet Shah Sena’s MLA Sanjay Gaikwad. Last year he had threatened&announced 11 lakh rupees to anyone who cuts off Sh. Rahul Gandhi’s tongue. Now the man is seen beating up a poor helpless canteen worker. But wait no news TV outrage here since its a BJP ally pic.twitter.com/XVwnEzJFSU— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) July 9, 2025కొన్ని సెకన్ల తర్వాత ఆ ఎమ్మెల్యే క్యాంటీన్‌ నిర్వహకునికి ముఖంపై ఒక పిడిగుద్దు కొడతారు. దీంతో అతను కింద పడిపోతాడు. తరువాత అతను లేవగానే మళ్లీ అతని చెంపమీద ఎమ్మెల్యే కొడుతూ నా స్టైల్‌ ఇదే అంటూ వ్యాఖ్యానించడం వినిపిస్తుంది. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతానని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అనడం వినిపిస్తుంది. క్యాంటీన్‌లో ఆహార నాణ్యతపై తాను రెండుసార్లు ఫిర్యాదు చేశానని గైక్వాడ్ పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాలుక తెగ్గోసేవారికి రూ. 11 లక్షలు ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌పై కూడా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

High Court Sensational Orders To Andhra Pradesh Judges9
హైకోర్టు జోక్యంతోనైనా అరాచకాలు తగ్గుతాయా?

ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానానికి అభినందనలు. రెడ్‌బుక్‌ పేరుతో రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై అరాచకాలకు తెగబడుతున్న తెలుగుదేశం పార్టీకి ముకుతాడు వేసే దిశగా న్యాయస్థానం మేలైన చర్య తీసుకుంది. సోషల్‌మీడియా పోస్టుల విషయంలో అరెస్ట్‌ అయిన వారికి రిమాండ్‌ ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, పౌరుల హక్కుల పరిరక్షణకు విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోబోమని జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్లకు జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతున్న కొందరు పోలీసు అధికారుల ఇష్టారాజ్య పోకడలకు కొంతమేర బ్రేక్‌ వేసింది. హైకోర్టు విడుదల చేసిన సర్క్యులర్‌ ప్రకారం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు ఇకపై యాంత్రికంగా రిమాండ్ విధించరాదు. పోలీసులు పెట్టిన కేసు లోతుపాతులు, నిందితులపై మోపుతున్న బీఎన్‌ఎస్‌ సెక్షన్ల హేతుబద్ధతలను పరిశీలించిన తర్వాతే రిమాండ్‌పై చర్య తీసుకోవాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పెట్టుకోవాలి. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులలో రిమాండ్ అవసరం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇటీవలి కాలంలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు కొందరు అవసరమున్నా లేకపోయినా పోలీసులు మోపిన కేసుల్లో నిందితులను రిమాండ్‌కు పంపుతున్న విమర్శలు ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానాలు అప్పుడప్పుడు రిమాండ్‌ తీరుతెన్నులను తప్పుపడుతున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో హైకోర్టు ఈ సర్క్యులర్‌ జారీ చేసింది. దీనిని ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ అవుతుందని కూడా స్పష్టం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సర్క్యులర్‌కు సంబంధించిన వార్తలకు తెలుగుదేశం అనుకూల మీడియా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం!ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్‌బుక్ పేరుతో సొంత రాజ్యాంగం అమలు చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేస్తూ, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తూ సమాజంలో భయభ్రాంతులను సృష్టిస్తున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌లు చట్టాలతో సంబంధం లేకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. లోకేష్ మరో అడుగు ముందుకేసి రెడ్‌బుక్ ఏదో ఘనకార్యమైనట్లు సమర్థిస్తూ మాట్లాడుతున్న తీరు ఆయన అపరిపక్వతను తెలియచేస్తుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు దారుణంగా కేసులు పెడుతూ వస్తున్నారు.జర్నలిస్టులను కూడా వదలి పెట్టుకుండా వేధిస్తున్నారు. చివరికి పరిస్థితి ఏ దశకు చేరిందంటే అధికారంలో ఉన్న టీడీపీ జనసేనలకు అనుకూలంగా వ్యవహరించకపోతే ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై సైతం రెడ్‌బుక్ ప్రయోగిస్తున్నారు. సిద్ధార్థ్‌ కౌశల్ అనే ఐపీఎస్‌ ఈ రెడ్‌బుక్ పిచ్చి గోలతో తాను పని చేయలేనని స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. కొందరు అధికారులు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక తల పట్టుకుంటున్నారు. అధికార పార్టీ కొమ్ము కాసే కొద్ది మంది అధికారులు మాత్రం రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ చట్టాలను, నిబంధలను గాలికి వదిలి వేస్తున్నారు. కొందరు జిల్లా కలెక్టక్టర్లు, ఎస్పీలు 'నీవు ఫలానా కులం వాడివి కదా! అయినా వైఎస్సార్‌సీపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నావు’ అని అడుగుతున్నారట. దీనికి సంబంధించి ఒక వ్యక్తి చెప్పిన మాటల వీడియో వైరల్ అయింది. జిల్లా స్థాయి అధికారులే అలా ఉంటే క్షేత్రస్థాయిలో ఉండే వారు ఏమి చేయగలుగుతారు? పద్దతిగా ఉంటే శంకరగిరి మాన్యాలు పట్టవలసి వస్తుందని భయపడుతున్నారు. కొన్ని సందర్భాలలో అధికారులు తాము వేధించామనే బయట చెప్పండని నిందితులతో అంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటివరకు వందలాది మంది సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం వంటివి జరిగాయి. రిమాండ్‌ విషయంలో తగు జాగ్రత్తలతో వ్యవహరించాలని హైకోర్టు సర్క్యులరైతే పంపింది కానీ... మెజిస్ట్రేట్లు దీని పూర్తి స్థాయిలో అమలు చేయగలుగుతారా? లేదా?అన్న చర్చ ఉంది. ఎందుకంటే మెజిస్ట్రేట్లు పోలీసులు పెట్టే సెక్షన్ల ఆధారంగా రిమాండ్‌కు పంపుతారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, వాటి పరిధిలోకి రాకుండా, అవసరం ఉన్నా, లేకపోయినా కఠినమైన సెక్షన్లతో కేసులుపెట్టే అవకాశం ఉంటుందన్నది కొందరు న్యాయవాదుల అభిప్రాయంగా ఉంది. ఉదాహరణకు ఎవరినైనా వేధించాలని భావిస్తే, సంబంధం ఉన్నా, లేకపోయినా ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. కొందరు మెజిస్ట్రేట్లు ఈ విషయాన్ని గుర్తించి ఆయా సెక‌్షన్లను తీసి వేయిస్తున్నా, అన్ని సందర్భాల్లోనూన అలా చేయగలుగుతారా? అన్నదానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అయితే హైకోర్టు సూచనలతో మెజిస్ట్రేట్లు సోషల్ మీడియా, తదితర భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలోనైనా తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటారన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఎన్నికలకు ముందు లోకేశ్‌ రెడ్‌బుక్ అంటూ తిరుగుతుంటే, అదేదో పిచ్చిగోలలే! తెలిసి, తెలియని మాటలులే అని అంతా అనుకున్నారు. కాని కూటమికి అధికారం రాగానే అదే ప్రమాదకరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొన్నిసార్లు ఈ రెడ్‌బుక్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ఒక టాక్‌! అయినా తన కుమారుడిని నియంత్రించలేక పోతున్నారని చెబుతున్నారు. పోలీసు అధికారులు కూడా సీఎం కంటే మంత్రి లోకేశ్‌ మాటలకే ఎక్కువ విలువ ఇస్తున్నారని టీడీపీ వర్గాలు సైతం అంటున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులపై ఒకటికి పది చోట్ల కేసులు పెట్టి వేధించడం, ఒక కేసులో బెయిల్ వస్తే పీటీ వారంట్ల పేరుతో ఇంకో కేసులో అరెస్టు చేయడం వంటివన్నీ ఏపీలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలకు ఇదొక బెంచ్ మార్క్ అయ్యే ప్రమాదం ఉందని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నారు. నిప్పుకు గాలి తోడైనట్లుగా ఈ రెడ్‌బుక్ అరాచకానికి తెలుగుదేశం మీడియా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి అవ్వాలని ఉవ్విళ్లూరుతున్న లోకేశ్‌ హుందాగా వ్యవహరించాలని చెప్పడానికి టీడీపీ ఎవరూ సాహసించడం లేదట. అంతేకాదు. టీడీపీ నాయకత్వం అండ చూసుకుని హైకోర్టు న్యాయమూర్తులను ఇష్టం వచ్చినట్లు విమర్శించే దశకు కొందరు చేరుకున్నారు. తీర్పులను విశ్లేషించవచ్చు. కాని న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న తీరుపై బార్ కౌన్సిల్ సైతం తప్పు పట్టింది. జస్టిస్ శ్రీనివాస రెడ్డి కోర్టులోనే తన ఆవేదనను వ్యక్తపరిచారు.అయినా టీడీపీ తన ధోరణి మార్చుకుంటుందా?లేదా?అన్నది చెప్పలేం. ఎందుకంటే చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాజకీయ ప్రత్యర్ధుల వ్యక్తిత్వ హననం అన్నది తెలుగుదేశం పార్టీలో ఒక విధానంగా మారింది. టీడీపీ మీడియా అండగా ఉంటోంది. ఇతర పార్టీల వారి సంగతెందుకు! చివరికి 1995లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును సైతం వదలి పెట్టకుండా దారుణమైన కథనాలు ప్రచారం చేశారు. ఒకవైపు నీతులు చెప్పడం, మరో వైపు ఇలా ఎదుటి వారి పట్ల అమానుషంగా వ్యవహరించడం అన్నది టీడీపీ వ్యూహంగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్‌ను న్యాయ వ్యవస్థ ఎంత గట్టిగా అమలు చేస్తుందో, పోలీస్ వ్యవస్థ ఎంతగా గౌరవిస్తుందో వేచి చూడాల్సిందే.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Nargis Fakhri opens up 9 Day Water Fast To Look Snatched10
'వాటర్‌ ఫాస్టింగ్‌' ఆరోగ్యానికి మంచిదేనా..? నటి నర్గీస్‌ ఫక్రీ..

బాలీవుడ్‌ నటి నర్గీస్‌ ఫక్రీ అమెరికన్ నటి, మోడల్‌. అమెరికాలో మోడల్‌గా పనిచేసిన ఫక్రీ 2011లో బాలీవుడ్‌లో వచ్చిన రొమాంటిక్ డ్రామా చిత్రం రాక్‌స్టార్‌ మూవీతో ఉత్తమ మహిళా నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుని దక్కించుకుని అందర్నీ ఆకర్షించింది. నటన పరంగానే గాదు, గ్లామర్‌ పరంగానూ తనకు సాటిలేరెవ్వరూ అన్నట్లుగా ఆకర్షణీయంగా ఉంటారామె. ఇటీవల సోహా అలీకాన్‌తో జరిగిన సంభాషణలో తన ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ వెల్లడించి అందరిని విస్తుపోయేలా చేశారు. తన లుక్‌ అంతలా ఉండటానికి తొమ్మిది రోజుల కఠిన ఉపవాసమేనని అంటోంది. దాని వల్ల తన ముఖంలో గ్లో వస్తుందని చెబుతోంది. నిజానికి అలాంటి ఉపవాసం ఆరోగ్యానికి మంచిదేనా..?. నిపుణులు ఏమంటున్నారంటే..సోహా అలీఖాన్‌ సంభాషణలో తన లైఫ్‌స్టైల్‌ గురించి వెల్లడించింది. కెటిల్‌బెల్‌ వంటి వ్యాయామాలు చేస్తానని, 8 గంటలు నిద్ర తప్పనిసరి అంటూ తన బ్యూటీ రహస్యాలు షేర్‌ చేసుకున్నారు. అయితే తాను ఏడాదికి రెండుసార్లు కఠిన ఉపవాసం ఉంటానని ఆ సమయంలో అస్సలు ఏమి తినని చెప్పుకొచ్చింది. కేవలం నీళ్లు మాత్రమే తాగుతానని అంటోంది. దాని వల్ల ముఖం పీక్కుపోయినట్లు కనిపించినా..ఒక విధమైన గ్లో వస్తుందని చెప్పుకొచ్చిందామె. అయితే ఇది కాస్తా కష్టమైనదని, ఎవ్వరూ ప్రయత్నించొద్దని సూచించారామె. ఇంకా తనకు బట్టర్‌ చికెన్‌, బిర్యానీ వంటి భారతీయ వంటకాలన్నా మహా ఇష్టమని తెలిపింది. అలాగే చర్మం ఆరోగ్యం కోసం హైడ్రేటెడ్‌గా ఉంటానని, మంచి నిద్ర, మినరల్స్‌, విటమిన్లు, పోషకాలతో కూడిన ఆహారమే తీసుకుంటానని చెప్పుకొచ్చారు నర్గీస్‌ ఫక్రీ. వాటర్‌ ఫాస్టింగ్‌ మంచిదేనా..?ఇది ఒకరకమైన ఉపవాసం. ఫ్యాట్‌ డైట్‌ పరంగా చేసే క్రేజీ ఫాస్టింగ్‌ అని చెబుతున్నారు. ఈ విధానంలో కేవలం నీటిని మాత్రమే తీసుకుంటారు. ప్రస్తుతం ఇది బాగా ట్రెండింగ్‌లో ఉంది. అలాగే పరిశోధనల్లో కేవలం నీటినే ఆహరంగా తీసుకుని ఉపవాసం ఉండే ఈ ప్రక్రియతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. అయితే ఇది ఎంతలా ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. సరైన విధంగా చేయకపోతే అంతే స్థాయిలో ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దుష్ప్రభావాలు..దీని వల్ల నీటి ఉపవాసం నిర్జలీకరణం, కండరాల నష్టం, రక్తపోటు మార్పులు వంటి ఇతర ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఆహారం లేకుండా ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. పైగా ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, కండరాల నష్టం, రోగనిరోధక శక్తి తగ్గడం, అలసట, తలతిరగడం,, మతిమరుపు, జీవక్రియ మందగించడం తదితర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే అందరి వ్యక్తుల శరీర తీరు విభిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇది అందరికి సరిపడదని అన్నారు. ఇలాంటివి ఆరోగ్య నిపుణుల సమక్షంలో ఏ మేరకు చేయాలో నిర్ణయించి పాటిస్తేనే మంచిదని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఐరన్‌ సయామీ..! ఒకే ఏడాదిలో రెండుసార్లు..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement