సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యద్ధం నడిచింది. మేనేమెంట్ కోటా మంత్రి అంటూ కేటీఆర్ కామెంట్స్ చేయగా.. తండ్రి పేరుతో తాను రాజకీయ పదవులు పొందలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్.
కాగా, సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో భాగంగా కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై ప్రభుత్వం తీర్మానం అంటుంది కానీ, మాకు తీర్మాన కాపీ రాలేదు. బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై మాట్లాడం ఇష్టం లేదనుకుంటాను అంటూ వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సభకు ప్రతిపక్ష నాయకుడు రాలేదు. సభకి వచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్‌కు భయమేస్తోంది. సభ నుంచి వెళ్లేందుకు బీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ఎంత హడావిడి చేసినా సభ నుంచి బయటకు పంపొద్దు. ఢిల్లీలో చీకటి ఒప్పందాలు బయటపడతాయిన బీఆర్‌ఎస్ భయపడుతోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తండ్రి పేరుతో తాను రాజకీయం చేయడం లేదంటూ కౌంటరిచ్చారు. నేనేమీ మేనేజ్‌మెంట్ కోటాలో మంత్రి, ముఖ్యమంత్రి కాలేదని కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. తానేమీ పేమెంట్ కోటాలో పదవులు పొందలేదన్నారు. తండ్రి పేరు అంటే రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీని ముఖ్యమంత్రి అంటున్నారా? అని ప్రశ్నించారు. దీంతో, వీరి మధ్య మాటల యుద్ధం నడిచింది. సభలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment