Live Updates
ఫార్ములా ఈ రేస్ కేసుపై అసెంబ్లీలో కేటీఆర్ సవాల్
ఈ కార్ల కేసుపై అసెంబ్లీలో ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్
- ఇప్పుడే మా సభ్యులు చెబుతున్నారు నాపై ఏదో కేసు నమోదు చేశారని
- ప్రస్తుతం సభ నడుస్తున్న సందర్భంగా స్పీకర్‌ను కోరుతున్నాను
- ఈ ప్రభుత్వానికి నిజాలు ప్రజలకు తెలియజేయాలన్న చిత్తశుద్ది ఉంటే ఈ-రేసుపై సభలో చర్చ పెట్టాలి
- ఈ-రేసులో జరిగిన అన్ని అంశాలపైన చర్చకు సిద్దంగా ఉన్నాను
2024-12-19 18:18:16
ఓఆర్‌ఆర్ టెండర్లపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన
- ఓఆర్‌ఆర్ అమ్మకం టెండర్లపై సిట్ విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
- బీఆర్‌ఎస్ జమానాలో ఓఆర్‌ఆర్‌ను అప్పనంగా అమ్ముకున్నారు
- ఓఆర్‌ఆర్‌ను కట్టబెట్టిన తీరుపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది
- హరీశ్‌రావు కోరిక మేరకే ఓఆర్‌ఆర్ టెండర్లపై సిట్ విచారణకు ఆదేశిస్తున్నామన్న సీఎం
2024-12-19 16:39:23
స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాకు రెడీ.. భట్టి సిద్ధమా: హరీశ్‌రావు
- ఏడాదిలో లక్ష కోట్లకుపైగా అప్పులు చేశామని మీరే ఒప్పుకున్నారు
- మేం మిగులు రాష్ట్రంగానే మీకు అప్పగించాం
- మేం గురుకులాల మెస్ ఛార్జీలు పెంచలేదంటున్నారు
- ఇది నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం
- నేను రాజీనామా లేఖస్పీకర్ ఫార్మాట్‌లో ఇస్తాను
- భట్టి రాజీనామా ఇవ్వడానికి సిద్ధమా
2024-12-19 15:58:49
సభలో హరీశ్‌రావు వ్యాఖ్యలపై గందరగోళం
- మా గొంతు నొక్కినా నిజమే చెబుతాం
- అర్ధరాత్రి 12 గంటల వరకు సభ నడిపినా సమాధానం చెబుతా
- నన్ను దొంగ అన్న వెదవ ఎవరు నన్ను దొంగ అంటేనే యూజ్‌లెస్ ఫెల్లో అన్నాను
- దబాయించి అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది
2024-12-19 15:30:21
బీఆర్‌ఎస్ ఫ్లోర్‌లీడర్ ఎవరు: శ్రీధర్‌బాబు సెటైర్లు
- ఎంఐఎం ఫ్లోర్‌లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ
- ఆయనకు సమాధానం ఇస్తాం
- బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ ఎవరు
- ఎవరికి సమాధానం చెప్పాలి
- అసలు నేనేందుకు క్షమాపణ చెప్పాలి.. ఎవరికి క్షమాపణ చెప్పాలి
- బీఆర్‌ఎస్‌పై మంత్రి శ్రీధర్‌బాబు సెటైర్లు
2024-12-19 15:00:22
అప్పుల చర్చపై ప్రతిపక్షాల అభ్యంతరం
- అప్పులపై చర్చకు అభ్యంతరం తెలిపిన అక్బరుద్ధీన్
- ఏ అంశంపై చర్చ చేపడుతున్నారో ముందుగా సమాచారమివ్వాలని సూచన
- అప్పులపై చర్చ వద్దంటే ఆపేస్తామన్న మంత్రి శ్రీధర్‌బాబు
- ప్రాధాన్యత అంశాలను ప్రభుత్వం చర్చకు తీసుకుంటుంది
- బీఆర్‌ఎస్ శాసనసభాపక్షనేత ఎవరో ముందు చెప్పాలన్న మంత్రి
- సభలో ఏం చర్చిస్తారో ముందుగా చెప్పాలన్న సభ్యుల డిమాండ్
2024-12-19 14:50:31
సభను నడిపే విధానం ఇది కాదు: హరీశ్‌రావు
- సభను ఎన్ని రోజులు నడుపుతారో ముందు చెప్పాలి
- సభను నడిపే విధానం ఇది కాదు
- చర్చ దేని మీద అనేది పది నిమిషాల ముందు చెప్పడం సరికాదు
2024-12-19 14:37:13
లేనివి ఉన్నట్లు చూపించడం హరీశ్‌రావుకు వెన్నెతో పెట్టిన విద్య: భట్టి విక్రమార్క
- ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చూపించడం హరీశ్‌రావుకు వెన్నెతో పెట్టిన విద్య
- అప్పులపై హరీశ్‌రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
- ఓ పక్క అప్పులు కడుతూ మరోపక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం
- ఆర్బీఐ రిపోర్టులో ఉన్నది రాష్ట్ర బడ్జెట్‌లో ఉన్న అప్పులు మాత్రమే
- మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ గాడిన పడింది
- అప్పులపై స్వల్పకాలిక చర్చలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
2024-12-19 14:34:15
అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతల నిరసనలు
- అసెంబ్లీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగిన మంత్రి పొన్నం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్..
2024-12-19 12:34:44
ఫారెస్ట్ బౌండరీలను ఫిక్స్ చేస్తాం: పొంగులేటి
- మంత్రి పొంగులేటి కామెంట్స్..
- త్వరలోనే వెయ్యి మంది సర్వేయర్లను నియమిస్తాం.
- ఫారెస్ట్ బౌండరీలను ఫిక్స్ చేస్తాం..
- అంతరాష్ట్ర బౌండరీ సమస్యను ఇతర రాష్ట్రాలతో మాట్లాడి పరిష్కరించుకుంటాం..
- ఫారెస్ట్ అధికారులు, పోడు వ్యవసాయం చేసే వారికి మధ్య గొడవలు జరగకుండా మూడు నెలల్లో పరిష్కారం చూపిస్తాం.
- ఎమ్మెల్యేలు తమ లెటర్ హెడ్ ద్వారా తమ నియోజకవర్గంలోని రెవెన్యూ సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం..
2024-12-19 12:23:44
హరీష్ వర్సెస్ మంత్రి కోమటి..
- హరీష్‌రావు ఏ హోదాలో అడుగుతున్నారని ప్రశ్నించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
- హరీష్‌రావు అందరి లాగే ఎమ్మెల్యే..
- ఎల్‌వోపీ లీడర్ సభకు రాడు..
- హరీష్‌రావు ఎల్‌వోపీ కాదు.. డిప్యూటీ లీడర్ కూడా కాదు.
- ఆయనకు పదేపదే మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నారు.
- క్వశ్చన్ అవర్‌లో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటన్న హరీష్ రావు.
2024-12-19 10:26:34
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. విపక్షాలను హెచ్చరించిన స్పీకర్
- నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
- అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి.
- విపక్షాలను హెచ్చరించిన స్పీకర్.
- అసెంబ్లీ రూల్స్‌కు విరుద్ధంగా అసెంబ్లీ ఆవరణలో విపక్షాలు నిరసన..
- మరోసారి రూల్స్‌కు విరుద్ధంగా చేయకూడదని హెచ్చరించిన స్పీకర్..
- సభలోకి ఎవరైనా ఫ్లకార్డులు తెస్తే బయటకు పంపించాలని ఆదేశం.
2024-12-19 10:17:16
ఎడ్ల బండిపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు..
- రైతు సమస్యలపై చర్చకు ప్రభుత్వం నిరాకరిస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
- ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఎడ్ల బండ్లపై బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలు
- ఎడ్ల బండితో బీజేపీ వినూత్న నిరసన
- నిన్న రైతు హామీలు, అమలు వైఫల్యంపై చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేపీ
- వాయిదా తీర్మానం తిరస్కరించిన స్పీకర్
- రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వానికి సమయం లేదా అంటూ మండిపాటు
2024-12-19 09:53:41
అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్..
- అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు.
- సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు.
2024-12-19 09:53:41
బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం..
- రైతు రుణమాఫీ, రైతు భరోసా, అన్ని పంటలకు బోనస్ అంశాలపై బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కామెంట్స్..
- కాంగ్రెస్ ప్రభుత్వం బీఏసీని నిర్వీర్యం చేస్తోంది.
- అంతా స్పీకర్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు
- ప్రజా సమస్యలపై మేము చర్చకు అడుగుతుంటే ప్రభుత్వం పారిపోతున్నది.
- కాంగ్రెస్ ప్రభుత్వం శాసన వ్యవస్థను బలహీనపరుస్తోంది.
- కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదు.. అంతా అరాచక పాలనే.
- లక్ష కోట్లు అప్పుల చేసినా.. ప్రభుత్వం కొత్తగా ఒక్క స్కీమ్‌ను కూడా అమలు చేయలేదు
2024-12-19 09:10:40
గంట ముందుగానే అసెంబ్లీకి సీఎం..
- నేడు అసెంబ్లీకి గంట ముందుగానే సీఎం రేవంత్ రానున్నారు.
- 10 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ.
- 9 గంటలకే అసెంబ్లీ కి చేరుకోనున్న సీఎం..
- భూ భారతి, రైతు భరోసా, పంచాయతీపై సభలో చర్చ ఉన్న నేపథ్యంలో పార్టీ సభ్యులు అధికారులతో సీఎం సమావేశం.
2024-12-19 08:43:31
బీజేపీ నేతల వినూత్న నిరసనలు..
- నేడు బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
- నేడు ఎండ్ల బండిపై అసెంబ్లీకి రానున్న బీజేపీ ఎమ్మెల్యేలు
- రైతులకు రుణమాఫీ, రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్
2024-12-19 08:43:31
ఐదో రోజు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు..
- తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి.
- అసెంబ్లీలో మొదట క్వశ్చన్ అవర్
- నకిరేకల్ నియోజకవర్గంలో పిల్లాయిపల్లి-ధర్మారెడ్డి కాలువ పనులు
- ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిస్థితి
- గిరిజనులు మరియు అటవీశాఖ అధికారుల మధ్య భూ వివాదాలు
- రేషన్ డీలర్ల సమస్యలు
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం
- కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు
- మేలు రకం ధాన్యానికి బోనస్
- విద్యుత్ కంపెనీల్లో జూనియర్ లైన్ మెన్‌గా ఆర్టిజన్స్
- దేవాలయాల అభివృద్ధి
- ఆటో డ్రైవర్లకు ఆర్ధిక సహాయంపై చర్చించనున్నారు.
- అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ ముగిసిన తర్వాత తెలంగాణ భూభారతి చట్టంపై చర్చ
- పంచాయతీ రాజ్ అమైన్డ్‌మెంట్ బిల్, మున్సిపల్ అమైన్డ్‌మెంట్ బిల్ , జీహెచ్ఎంసీ అమైన్డ్‌మెంట్ బిల్లును సభలో ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం.
- రైతు భరోసాపై నేడు షార్ట్ డిస్కషన్ కొనసాగనుంది.
2024-12-19 08:43:31
Advertisement