రాజ్‌భవన్ స్కూల్‌ను సందర్శించి పిల్లలతో ముచ్చటిస్తున్న గవర్నర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం–మహిళల మధ్య వారధిగా వ్యవహ రించడం, మహిళా సమస్యలను పరి ష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికే గవర్నర్ తమి ళిసై మహిళా దర్బార్ కార్య క్రమా నికి శ్రీకారం చుట్టారని రాజ్‌భవన్ స్ప ష్టం చేసింది. గత నెల 10న నిర్వహించిన తొలి ప్రజాదర్బార్‌లో 193 అర్జీలు రాగా, వాటిని సమస్యల వారీగా విభ జించి, సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపించినట్టు సోమవారం ఓ ప్రకట నలో తెలిపింది.
అర్జీదారుల్లో కొందరికి వైద్యం, మరికొందరికి న్యాయ సలహా లు అందించామని పేర్కొంది. అర్హత లున్న వారికి గవర్నర్ తన విచక్ష ణాపరమైన గ్రాంట్ల నుంచి ఆర్థిక సహాయం సైతం అందించారని వెల్లడించింది. 42 మంది అర్జీదారులను మళ్లీ పిలిపించి న్యాయవాదులతో కౌన్సెలింగ్ అందించామని తెలిపింది. భార్యలను వదిలేసి విదేశాల్లో నివసిస్తున్న భర్తలను ఇంటర్‌పోల్ సహకారంతో రప్పించడానికి సహకరిస్తామని ముగ్గురు బాధిత మహిళలకు రేఖా శర్మ హామీ ఇచ్చినట్టు వెల్లడించింది. మహిళా సమస్యలను పరిష్కరించాలనే స్వచ్ఛమైన మనస్సుతోనే గవర్నర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రతికూల దృష్టితో చూడరాదని కోరింది.
ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
దేశం స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా తలపెట్టిన ఆజాదీకా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. దేశభక్తికి చిహ్నంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని ప్రజలను కోరారు. రాజ్‌భవన్ స్కూల్లో విద్యార్థులకు సోమవారం జాతీయ జెండాలు, నోట్‌బుక్‌లను పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 75 వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు గవర్నర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment