prajadarbar
-
మహిళలు–ప్రభుత్వం మధ్య వారధిగా ఉండేందుకే...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం–మహిళల మధ్య వారధిగా వ్యవహ రించడం, మహిళా సమస్యలను పరి ష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికే గవర్నర్ తమి ళిసై మహిళా దర్బార్ కార్య క్రమా నికి శ్రీకారం చుట్టారని రాజ్‌భవన్ స్ప ష్టం చేసింది. గత నెల 10న నిర్వహించిన తొలి ప్రజాదర్బార్‌లో 193 అర్జీలు రాగా, వాటిని సమస్యల వారీగా విభ జించి, సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపించినట్టు సోమవారం ఓ ప్రకట నలో తెలిపింది. అర్జీదారుల్లో కొందరికి వైద్యం, మరికొందరికి న్యాయ సలహా లు అందించామని పేర్కొంది. అర్హత లున్న వారికి గవర్నర్ తన విచక్ష ణాపరమైన గ్రాంట్ల నుంచి ఆర్థిక సహాయం సైతం అందించారని వెల్లడించింది. 42 మంది అర్జీదారులను మళ్లీ పిలిపించి న్యాయవాదులతో కౌన్సెలింగ్ అందించామని తెలిపింది. భార్యలను వదిలేసి విదేశాల్లో నివసిస్తున్న భర్తలను ఇంటర్‌పోల్ సహకారంతో రప్పించడానికి సహకరిస్తామని ముగ్గురు బాధిత మహిళలకు రేఖా శర్మ హామీ ఇచ్చినట్టు వెల్లడించింది. మహిళా సమస్యలను పరిష్కరించాలనే స్వచ్ఛమైన మనస్సుతోనే గవర్నర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రతికూల దృష్టితో చూడరాదని కోరింది. ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ దేశం స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా తలపెట్టిన ఆజాదీకా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. దేశభక్తికి చిహ్నంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని ప్రజలను కోరారు. రాజ్‌భవన్ స్కూల్లో విద్యార్థులకు సోమవారం జాతీయ జెండాలు, నోట్‌బుక్‌లను పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 75 వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు గవర్నర్ తెలిపారు. -
తూతూమంత్రంగా పోలీస్ ప్రజాదర్బార్
కర్నూలు: పుష్కరాల విధుల్లో భాగంగా ఎస్పీ ఆకే రవికష్ణ శ్రీశైలంలో ఉండటంతో సోమవారం పోలీసు ప్రజాదర్బార్ తూతూమంత్రంగా సాగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాసులు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికంగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఎస్పీకి చెప్పుకుందామని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు జిల్లా కేంద్రానికి తరలివచ్చి పోలీసు ప్రజాదర్బార్‌లో వినతిపత్రాలు సమర్పించారు. సమస్యలపై ఆరా తీసి స్థానిక పోలీసు అధికారులను కలవాల్సిందిగా సిఫారసు చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నంద్యాల, ఎర్రకోట, గోవిందపల్లె, నందికొట్కూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల నుంచి బాధితులు తరలివచ్చి తమ సమస్యలను చెప్పుకున్నారు. కుటుంబ కలహాలు, భూతగాదాలు, స్థలాల ఆక్రమణ వంటి సమస్యలపై బాధితులు పోలీసు ప్రజాదర్బార్‌ను ఆశ్రయించారు. -
పులివెందులలో వైఎస్ జగన్ బిజిబిజీ...
వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత రెండు రోజులుగా పులివెందులలో పర్యటిస్తున్నారు. ఆయన తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ వినతులు స్వీకరించారు. పులివెందుల మండలంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు రాజశేఖర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అప్పుల బాధతాళలేక గతనెల 19 వ తేదీన పొలం వద్దనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు, ఇటీవల వార్డు కౌన్సిలర్ అరుణకుమారి కుమారుడి వివాహం జరిగింది. అరుణకుమారి ఇంటికి వెళ్లి ఆయన నూతన జంటకు ఆశీస్సులు అందజేశారు. -
షరా మామూలే..!
కర్నూలు అగ్రికల్చర్: జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ఎప్పటిలాగే ప్రజాదర్బార్ పోటెత్తింది. ఎన్ని సార్లు తిరిగినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోయారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్ వినతులు స్వీకరించారు. జేసీ హరికిరణ్, ఏజేసీ రామస్వామి, డీఆర్ఓ గంగాధర్ గౌడ్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి పివి.రమణరావు, ల్యాండ్రిఫామ్స్ తహశీల్దారు ఎలిజబెత్ తదితరులు కూడా వినతులు స్వీకరించారు.వచ్చిన వినతులను అక్కడే స్కానింగ్ చేసి ప్రజావాణి వెబ్సైట్లో ఉంచి సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన సమస్యల్లో కొన్ని ఇలా ఉన్నాయి. చాగలమర్రి మండలం చిన్న బోధనం గ్రామంలో రాంపుల్లయ్య పాయన్నలు 4.62 ఎకరాల ప్రభుత్వ భూమిని కొన్ని దశాబ్దాలుగా అనుభవిస్తున్నారు. ఇందులో రెండు ఎకరాలకు ప్రభుత్వం వీరికి పట్టా, పాస్ పుస్తకం కూడా ఇచ్చింది. అయితే ఓబుల్‌రెడ్డి అనే వ్యక్తి తన భార్య భారతి పేరు మీద 4.62 ఎకరాకు బోగస్ పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుని ఆన్లైన్లో ఎక్కించుకున్నాడు. దీనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు. ఉయ్యాలవాడ మండలం బోడెమ్మనూరు గ్రామంలో గ్రామ దేవత పెద్దమ్మ మాన్యం భూములను పెద్దలు ఆక్రమించుకున్నారు. కొన్నేళ్లుగా దీనిపై ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకునే వారు లేరు. పేదలు అనుభవిస్తున్న మాన్యం భూములను పెద్దలు ఆక్రమించుకున్న విషయం తెలిసినా ఎవ్వరు స్పందించడం లేదు. ఇప్పటికైనా చర్యలు తీసుకొని మాన్యం భూములను పెద్దల నుండి స్వాధీనం చేసుకోవాలని ఓబులపతి, ఓబులేసు తదితరులు కోరారు. హామీలు అమలు చేయండి.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడిచిన ఇప్పటి వరకు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల్లో ఏ ఒక్కదానిపైన దృష్టి సారించలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని విభజన చట్టంలోని హామీలను సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజాదర్బార్‌లో కలెక్టర్‌ను కోరారు. డీసీసీ అధ్యక్షుడు బీవై.రామయ్య, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, మాజీ జడ్పీ ఛైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, డీసీసీ ఉపాధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు తదితరులు కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. -
వేళ తప్పితే వేటే!
సమయపాలన పాటించని ఉద్యోగులపై కలెక్టర్ కన్నెర్ర 20 మందికి తాఖీదులు.. ఇద్దరు డీటీలకు కూడా ప్రజాదర్బార్‌కు రాని అధికారులకు క్లాస్ పాలనలో కలెక్టర్ రఘునందన్ కొత్త ఒరవడి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సమయపాలన పాటించని ఉద్యోగులపై కొత్త బాస్ కొరడా ఝళిపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించిన 20 మందికి తాఖీదులు జారీ చేశారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన‘ప్రజాదర్బార్’కు డుమ్మా కొట్టిన ఉన్నతాధికారులను వదలకూడదని నిర్ణయించిన కలెక్టర్ రఘునందన్‌రావు.. విధులకు ఆలస్యంగా వచ్చిన, ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన ఉద్యోగులకు నోటీసులు ఇవ్వాలని సంబంధిత శాఖాధిపతులను ఆదేశించారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడమే తరువాయి కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్‌డేకు విధిగా జిల్లా అధికారులు హాజరుకావాలని, మండల స్థాయిలోనూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సర్క్యులర్ జారీ చేశారు. ఈ క్రమంలోనే గత 21న కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగుల హాజరును స్వయంగా తెలుసుకున్న సంగతి తెలిసిందే. సంజాయిషీ ఇవ్వాల్సిందే.. కార్యాలయానికి సకాలంలో హాజరుకాని ఉద్యోగుల నుంచి సంజాయిషీ కోరాలని ఆయా శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గత సోమవారం విధులకు ఆలస్యంగా వచ్చిన 12 మందికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వీరిలో ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు టైపిస్టులు, ఒక యూడీఆర్‌ఐ ఉన్నారు. అలాగే మండల పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న 8 మందికి కూడా శ్రీముఖాలను జారీ చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. నిర్ణీత సమయానికి విధులకు రాని ముగ్గురితోపాటు అనధికారికంగా విధులకు ఎగనామం పెట్టిన మరో ఐదుగురికి ఈ నోటీసులు అందాయి. దర్బార్‌కు రానివారి సంగతి తేల్చండి.. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజాదర్బార్‌కు జిల్లా అధికారులు ముఖం చాటేస్తున్నారు. ఆర్నెల్లుగా అర్జీలను స్వీకరించేందుకు కలెక్టర్, జేసీలు సైతం హాజరుకాకపోవడంతో దర్బార్‌పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. యథారాజా తథా అధికారి అన్న తరహాలో జిల్లా బాస్‌లు రాకపోవడంతో అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ప్రతి సోమవారం ప్రజాదర్బార్ మొక్కుబడిగా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించినకలెక్టర్ రఘునందన్‌రావు.. పాత రికార్డుల దుమ్ముదులపాలని నిర్ణయించారు. ప్రజాదర్బార్‌కు సంబంధించి కొన్ని నెల ల హాజరు వివరాలను నివేదిం చాలని డీఆర్ఓను ఆదేశిం చారు. ఈ సమాచారాన్ని బేరీజు వేయ డం ద్వారా గ్రీవెన్స్‌డేకు రాని అధికారులకు తలంట నున్నట్లు తెలిసింది. కలెక్టరేట్ తరహా లోనే క్షేత్రస్థాయిలోనూ ఇదే విధానం అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచా రం. చెత్తకుప్పలను తలపించేలా వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీలు.. మెకానిక్ షెడ్డును పోలినట్లు చెడిపోయిన కార్ల పార్కింగ్తో కనిపించిన కలెక్టరేట్ ఆవరణను కొత్త యంత్రాంగం ‘క్లీన్’గా చేసిం ది. కేవలం ఆవరణలేకాకుండా.. పనితీరులోనూ మార్పు తెచ్చేలా నయా బాస్ రఘునందన్ సంస్కరణలు తీసుకురావడం విశేషం. -
సోదరుడిగా సూచనలు చేస్తా!
తెలుగు ప్రజలంతా సంతోషంగా ఉండాలి: గవర్నర్ నరసింహన్ సీనియర్ బ్రదర్‌గా రెండు రాష్ట్రాల శ్రేయస్సుకు కృషి చేస్తా కొత్త ఏడాది రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించిన గవర్నర్ సాక్షి, హైదరాబాద్: ‘2015 మనందరికీ మంచి ఏడాది కావాలి... తెలుగు ప్రజలంతా సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుతున్నా. రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు సంతోషంగా ఉంటారనే నమ్మకం ఉంది’ అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. సీనియర్ బ్రదర్‌గా, గైడ్, ఫ్రెండ్, ఫిలాసఫర్‌గా రెండు రాష్ట్రాల శ్రేయస్సుకు కృషి చేస్తానని, సూచనలు చేస్తానని ఆయన చెప్పారు. నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్ గురువారం రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రముఖులతో పాటు వందలాది మంది సామాన్య ప్రజలు గవర్నర్‌ను కలసి నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలి పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ కొత్త ఏడాదిలో రెండు రాష్ట్రాల సీఎంలతో తరచూ సమావేశాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తానని, వివాద రహిత తెలుగు రాష్ట్రాలే తన కల అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రులిద్దరూ మంచి విజన్‌తో పనిచేస్తున్నారని, కొత్త ఏడాదిలో వారి ప్రణాళికలకు ఫలి తాలు అందుతాయని ఆశిస్తున్నానన్నారు. ఎంసెట్ పరీక్ష విషయంలో రెండు రాష్ట్రాల విద్యా మంత్రులతో సమావేశమైనప్పుడు కొన్ని మార్గాలు సూచించానని, వాటిని పరిగణనలోకి తీసుకొని ఆలోచిస్తామని వారి వురూ అంగీకరించారని తెలిపారు. అయితే ఇప్పటి వరకూ అధికారికంగా తనకు ఎలాంటి నివేదిక అందలేదని, దాని కోసమే వేచిచూస్తున్నానని చెప్పారు. వర్సిటీల వీసీల నియామకాలపై వివాదాలు త్వరలోనే సద్దుమణిగేలా చొరవ తీసుకుంటానన్నారు. పోలవరం ముంపు మండలాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించే విషయమై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. సమాజంపై మీడియా అమిత ప్రభావం చూపుతుందని, పాత్రికేయులు వక్రీకరణలు మాని నిర్మాణాత్మక సూచనలు చేయాలని గవర్నర్ ఈ సందర్భంగా సూచించారు. గవర్నర్‌ను కలసిన వారిలో ఏపీ సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు, డీజీపీ రాముడు, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు, హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, యాదవరెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులున్నారు. రెండు రాష్ట్రాల వేడుకల్లో పాల్గొంటా.. జనవరి 26న రెండు రాష్ట్రాల గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొంటానని గవర్నర్ వెల్లడించారు. 26న ఉదయం విజయవాడలో జరిగే ఏపీ ఉత్సవాలకు హాజరవుతానన్నారు. అనంతరం నేరుగా వాయు మార్గంలో హైదరాబాద్ చేరుకుని తెలంగాణ గణతంత్ర వేడుకల్లో పాల్గొననున్నట్టు వివరించారు. 26న సాయంత్రం రాజ్‌భవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలకు విందు ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. -
ప్రజాదర్బార్‌లో సమస్యల వెల్లువ
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాదర్బార్‌కు వినతులు వెల్లువెత్తాయి. వినతుల తాకిడిని తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఆన్లైన్, మండల కేంద్రంలోని మండల పరిషత్‌లోని గ్రీవెన్స్‌లోను వినతులు ఇవ్వవచ్చని ప్రకటించింది. కానీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు ఇవేవి పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ నిర్వహించే ప్రజాదర్బార్‌లో వినతులు ఇస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు నమ్ముతున్నారు. మరి వారి నమ్మకం నెరవేరుతుందా అంటే అదీ లేదు.. ఒకే సమస్యపై పరిష్కారం కోసం ఇటు ప్రజాదర్బార్ చుట్టూ అటు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజాదర్బార్‌లో జాయింట్ కలెక్టర్ కన్నబాబు, ఏజేసి రామస్వామి, డీఆర్ఓ గంగాధర్ గౌడ్ వినతులు స్వీకరించారు. కలెక్టర్ సిహెచ్.విజయ్‌మోహన్, ఉప ముఖ్యమంత్రి వెంట జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడంతో జేసీ గ్రీవెన్స్ నిర్వహించారు. వచ్చిన వినతులన్నింటిని స్కానింగ్ చేసి ప్రజావాణి వెబ్సైట్లో పెట్టారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన సమస్యల్లో ముఖ్యమైనవి. -
ఎంపీ ప్రజాదర్బార్‌కు విశేష స్పందన
కడప కార్పొరేషన్: స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు విశేష స్పందన లభించింది. ప్రజల నుంచి ఫిర్యాదుల మేరకు సమస్యలను పరిష్కరించాలని ఆయా అధికారులకు ఎంపీ ఫోన్ చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని తిరుపతి మహిళా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ.ప్రభాకర్‌రెడ్డి(పీలేరు) తీసుకున్న పది లక్షలు రూపాయల్లో ఇంకా రూ. 5.60లక్షలు ఇవ్వాల్సి ఉందని వెంకమ్మ ఫిర్యాదు చేశారు. డబ్బు అడిగితే బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఫోన్‌చేసి సమస్యను పరిష్కరించాలని అవినాష్‌రెడ్డి కోరారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారని రాజుపాళెం, బద్వేల్‌కు చెందిన ప్రజలు ఫిర్యాదు చేశారు. అలాగే ప్రాద్దుటూరుకు చెందిన ప్రభుత్వ కళాశాలలో తాను ఉద్యోగం చేస్తుండేవాడినని, తనకు మళ్లీ ఆ ఉద్యోగం ఇప్పించాలని వై.కిరణ్‌కుమార్ అనే యువకుడు విన్నవించాడు. పోరుమామిళ్ల టైలర్స్ కాలనీలో హౌసింగ్ బోర్డు వారు తనకు ఎల్ఐజీ హౌస్ కేటాయించారని, ఇంతవరకూ తనకు ఇళ్లు చూపలే దని రహమతుల్లా అనే వృద్ధుడు ఫిర్యాదు చేశారు. సీబీఆర్ ప్రాజెక్టు టెర్మినేట్ అవుతోందని జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తనను తొలగించారని, ఆ ప్రాజెక్టు కొనసాగుతున్నందున మళ్లీ ఉద్యోగం ఇప్పించాలని ముస్తఫ్ ఖాన్ కోరారు. కార్యక్రమంలో చక్రాయపేట జెడ్పీటీసీ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు ఎంపీ సురేష్, మాజీ మున్సిపల్ చెర్మైన్ మునెయ్య, విద్యార్థి నాయకుడు బి.అమర్నాథ్రెడ్డి, ఐస్‌క్రీం రవి, మహిమలూరి వెంకటేష్ పాల్గొన్నారు. -
గుడ్డి దర్బార్
కర్నూలు(కలెక్టరేట్): రోజులు.. వారాలు.. నెలలు.. సంవత్సరాలు గడిచినా ప్రజాదర్బార్ వినతుల్లో అధిక శాతం పరిష్కారానికి నోచుకోని పరిస్థితి. జిల్లా కేంద్రంలో స్వయంగా కలెక్టర్ బాధితుల గోడు విని పరిష్కారానికి సిఫారసు చేస్తున్నా కింది స్థాయిలో నిర్లక్ష్యం వేళ్లూనుకుంది. ప్రతి వారం నిర్వహించే ఈ కార్యక్రమానికి వచ్చిన సమస్యలే 30 శాతం వరకు మళ్లీ వస్తుండటమే అందుకు నిదర్శనం. ఒక్క రెవెన్యూ శాఖకు చెందినవే 11,352 వినతులు పరిష్కారానికి నోచుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందులో 8,716 వినతులను డిస్పోజల్ (పరిష్కారం) చేసినట్లు చూపుతున్నా.. 80 శాతం సమస్యలు ఎక్కడికక్కడే ఉండటం గమనార్హం. జిల్లా కలెక్టర్ తనకు వచ్చిన వినతులను పరిష్కారం నిమిత్తం ఎండార్స్మెంట్ రాసి సంబంధిత అధికారికి రెఫర్ చేస్తారు. ఆయన తన కింది స్థాయి అధికారికి పంపి డిస్పోజల్ చేసినట్లు చూపడం పరిపాటిగా మారింది. బాధితులు మాత్రం అదే వినతితో ప్రతి వారం ప్రజాదర్బార్ గడప తొక్కాల్సి వస్తోంది. ప్రజాదర్బార్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 33,507 వినతులు అందగా.. 30,007(90 శాతం) పరిష్కరించినట్లు అధికారులు కలెక్టర్‌కు నివేదించారు. పరిష్కారం ఈ స్థాయిలో ఉంటే ప్రజాదర్బార్‌కు బాధితులు పదేపదే ఎందుకు వస్తున్నారనేది వేయి డాలర్ల ప్రశ్న. జిల్లా పరిపాలనకు అధిపతి అయిన కలెక్టర్‌కు నేరుగా వినతులు అందిస్తున్నా సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం వల్ల ప్రజాదర్బార్‌పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఆదోని, ప్యాపిలి, చాగలమర్రి, ఆత్మకూరు, సంజామల, ఆలూరు ప్రాంతాల నుంచి కర్నూలుకు వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలంటే బాధితులకు కనీసం రూ.300 ఖర్చు అవుతుంది. ప్రతి వారం ఇలాంటి వారు వందల్లో ఉంటున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వినతులు ఇస్తున్నా అధికారులు ఎండార్స్‌మెంట్‌తో సరిపెడుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఒక సమస్యతో బాధితుడు మళ్లీ వస్తే అందుకు కారణాలను కలెక్టర్, జేసీలు పరిశీలిస్తే లోపం ఎక్కడుందనే విషయం బయటపడుతుంది. ఈ విషయంపై దృష్టి సారించనంత వరకు బాధితులు ప్రజాదర్బార్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. మండలాల్లో కనిపించని గ్రీవెన్స్ ప్రతి సోమవారం మండల స్థాయిలో మండల పరిషత్ కార్యాలయంలో విధిగా ప్రజాదర్బార్ నిర్వహించాల్సి ఉంది. ఇప్పటివరకు మండల పరిషత్ అధ్యక్షులు లేనందున స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాంది. మండలస్థాయి గ్రీవెన్స్‌కు విధిగా స్పెషల్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులు పాల్గొనాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే మండల స్థాయిలో గ్రీవెన్స్ తూతూమంత్రంగా సాగుతోంది. సగం మండలాల్లో ఆ ఊసే కరువైంది. సోమవారం దాదాపు 30 మండలాల్లో ప్రజాదర్బార్ నిర్వహించకపోవడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. -
పూర్తిస్థాయిలో మొదలైన గ్రీవెన్స్‌సెల్
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: దాదాపు మూడు నెలల తర్వాత ప్రజాదర్బార్ పూర్తిస్థాయిలో జరగడంతో వినతులు వెల్లువెత్తాయి. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు, జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్‌రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. హౌసింగ్ పీడీ రామసుబ్బు, డీఆర్డీఏ పీడీ నజీర్‌సాహెబ్, జేడీఏ ఠాగూర్‌నాయక్‌లు తమ శాఖలకు సంబంధించిన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొద్దిసేపు సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఇకపై ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజాదర్బార్, డయల్ యువర్ కలెక్టర్‌కు వచ్చిన సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేయాలని వివరించారు. ఇంటి పట్టాలు ఇవ్వండి: గోస్పాడు మండలం బీవీనగర్‌లో కొన్నేళ్ల క్రితం చింతమానువనంలో ఇళ్లు, గుడిసెలు నిర్మించుకుని 70 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారికి పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్‌కు ప్రజాదర్బార్‌లో వినతిపత్రం సమర్పించాను. - శ్రీనివాసరెడ్డి -
31న ఓటర్ల తుదిజాబితా
సాక్షి, గుంటూరు: ఓటర్ల తుది జాబితా ప్రచురణకు గడువు కోరడంతో ఎన్నికల కమిషన్ ఈ నెల 31న ప్రచురణకు ఆదేశాలిచ్చిందని, 17వరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులపై విచారణ జరుగుతుందని జిల్లా కలెకర్ ఎస్.సురేశ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు రోజుల్లో యంత్రాంగమంతా భౌతిక పరిశీలన పూర్తిచేయాలని, 18 నుంచి 30 వరకు కంప్యూటరైజేషన్, డేటా ఎంట్రీ పూర్తిచేసి తుది జాబితా ఎన్నికల కమిషన్ అనుమతి మేరకు ప్రచురిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా 3.25 లక్షల వరకు క్లెయిమ్స్ వచ్చాయని, ఇప్పటికే 80 శాతం వరకు పరిశీలన పూర్తయిందన్నారు. సుమోటో కింద 39 వేల బోగస్ ఓట్లు తొలగించడం జరుగుతుందని, ఏవైనా అభ్యంతరాలు, తొలగింపులు ఉంటే 17 లోపే జరగాలన్నారు. తుది జాబితా ప్రచురించిన తర్వాత తొలగింపులు కుదరవని స్పష్టం చేశారు. ఈ నెల 18న జిల్లాలోని ఆరు పంచాయతీలు, 45వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉందని, అయి తే నామినేషన్ల ఘట్టం పూర్తయిన తర్వాత నాలుగు పంచాయతీల సర్పంచ్‌లు, 29 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయని వివరించారు. పెదకూరపాడు మండలం ముస్సాపురం, ముప్పాళ్ళ మండలం కుందూరివారిపాలెం, పొన్నూరు మండలం కసుకర్రు, మంగళగిరి మండలం బేతపూడి గ్రామాల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ నాలుగు సర్పంచ్ స్థానాలకు పది మంది, 29 వార్డులకు 38 మంది బరిలో ఉన్నారన్నారు. ముత్తాయపాలెం, రామచంద్రపురం సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదన్నారు. వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని, సిఫార్సులతో జరగవని స్పష్టంచేశారు. పోస్టులు ఇప్పిస్తామనే ప్రచారం తన దృష్టికి వచ్చిందని, అభ్యర్థులు ఎవరూ మోసపోవద్దని కలెక్టరు చెప్పారు. ఇక ప్రజాదర్బార్..ఇకపై డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తామని, ప్రజాదర్బార్ పేరుతో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ నెల 20న గురజాల రెవెన్యూ డివిజన్లో జిల్లాస్థాయి అధికారులంతా హాజరై పథకాలపై సమీక్ష చేస్తారన్నారు. డయల్ యువర్ ఆఫీసర్ కార్యక్రమం ప్రతిరోజూ జరుగుతుందని, 9.30 గంటల నుంచి 10.30 వరకు సెల్ నంబరు 98669 92627కు ఫిర్యాదిదారులు ఫోన్ చేయవచ్చన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్‌గా తాను అన్ని అంశాలపై ఈ కార్యక్రమంలో పాల్గొంటానని, ఒకటవ, మూడవ మంగళవారాల్లో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ అంశాలు, సివిల్ సప్లయిస్, ఆధార్, మీ సేవ, లీగల్ మెట్రాలజీ, సినిమాటోగ్రఫీపై హాజరవుతారని, ఫిర్యాదులు చేయవచ్చన్నారు. -
ప్రజల సాక్షిగా ప్రజాదర్బార్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజాదర్బార్ ప్రజలకు మరింత ఉపయోగపడే విధంగా కలెక్టర్ విజయకుమార్ పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. అర్జీలు రాసేందుకు ప్రభుత్వ సిబ్బందిని నియమించడమేగాకుండా వాటిని అక్కడికక్కడ విచారించేందుకు వీలుగా అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారుల స్థాయిలో పరిష్కారం కాని వాటిని నేరుగా తన వద్దకు తీసుకొచ్చే విధంగా రూపకల్పన చేశారు. అందరి సమక్షంలో సంబంధిత సమస్య గురించి కింది వరుసలో కూర్చున్న అధికారులను మైక్ ద్వారా మాట్లాడిస్తూ బహిరంగంగా చెప్పించడంతో ప్రజలు కూడా వాటి స్థితిగతులను తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఈ విధానంతో ప్రజలు కూడా సమస్య స్థితిగతిని సావధానంగా తెలుసుకుని ముందుకు కదులుతున్నారు. గతంలో గుంపులు గుంపులుగా ప్రజలు అర్జీలు చేతపట్టుకొని వచ్చేవారు. కొన్నిసార్లు గందరగోళంగా ఉండేది. ఈ సారి మాత్రం అలాంటి వాతావరణం కనిపించలేదు. ఒకరి తర్వాత ఒకరి అర్జీని కలెక్టర్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్‌లు స్వీకరించారు. హెల్ప్ డెస్క్‌తో తీరిన రాత కష్టాలు ప్రజాదర్బార్ కోసం ప్రకాశం భవనంలోకి ప్రజలు అడుగు పెట్టగానే కుడివైపు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. సమస్యలతో బాధపడుతున్నవారు ఆ సమస్యను అధికారులకు ఎలా తెలియజేయాలో తెలియక అక్కడే ఉన్న ప్రైవేట్ రైటర్లను ఆశ్రయించేవారు. వారు ఒక్కో అర్జీదారుడి నుంచి 10 నుంచి 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అంతేగాకుండా సంబంధిత అధికారి తనకు బాగా పరిచయమని, తాను చెబితే మీ సమస్య పరిష్కారం అవుతుందని నమ్మబలికి 200 నుంచి 500 రూపాయల వరకు వసూలు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. తాజాగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌తో ప్రైవేట్ రైటర్లు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హెల్డ్ డెస్క్‌లో సిబ్బంది ప్రజలకు అర్జీలు రాసే పనిలోనే నిమగ్నమయ్యారు. టెన్ టేబుల్స్ హెల్ప్ డెస్క్‌లో అర్జీలు రాయించుకున్న ప్రజలు సమీపంలోని కౌంటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆ అర్జీపై నంబర్ వేస్తారు. ప్రత్యేకంగా శాఖల వారీగా ఏర్పాటు చేసిన టేబుల్స్ వద్దకు నంబర్ వేసి పంపించే ప్రక్రియ చేపట్టారు. టేబుల్-1లో పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాలు, కార్మిక, ఎక్సైజ్, దేవాదాయ, రిజిస్ట్రార్, ట్రెజరీ, అటవీ, డీపీఆర్ఓ, భూసేకరణ స్పెషల్ కలెక్టర్, సర్వే అండ్ ల్యాండ్స్, జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారులను ఉంచారు. టేబుల్-2లో వ్యవసాయశాఖ, పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ, ఉద్యానశాఖ, జిల్లా సహకార సంస్థ, ఏపీఎస్ఐడీసీ, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులను ఉంచారు. టేబుల్-3లో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గిరిజన సంక్షేమశాఖ, వికలాంగుల సంక్షేమశాఖ, ఐటీడీఏ, మహిళా శిశు సంక్షేమశాఖ, ఎల్డీఎం, భూగర్భ జలవనరుల శాఖ, నాబార్డు, పీడీసీసీ బ్యాంకులకు చెందిన అధికారులను ఉంచారు. టేబుల్-4లో డీఆర్డీఏ, డ్వామా, హౌసింగ్, జిల్లా ఉపాధి కల్పనాధికారి, సీపీఓ శాఖల అధికారులను ఉంచారు. టేబుల్-5లో విద్యాశాఖ, గురుకుల పాఠశాలలు, రాజీవ్ విద్యామిషన్, వయోజన విద్యాశాఖ, ఆర్ఐఓ, జిల్లా గ్రంథాలయం, జిల్లా క్రీడాభివృద్ధి అధికారులను ఉంచారు. టేబుల్-6లో ఆర్అండ్బీ, ట్రాన్స్‌కో, ప్రాజెక్ట్స్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఉంచారు. టేబుల్-7లో జిల్లా పరిశ్రమల కేంద్రం, చేనేత జౌళిశాఖ, మార్కెటింగ్, మైన్స్, స్టెప్, ఖాదీ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఉంచారు. టేబుల్-8లో డీఎంహెచ్ఓ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, వైద్య విధాన పరిషత్, రిమ్స్, రెడ్‌క్రాస్‌లకు చెందిన వారిని ఉంచారు. టేబుల్-9లో మెప్మా, మునిసిపల్ కమిషనర్లను ఉంచారు. టేబుల్-10లో జిల్లాపరిషత్, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్టీఓ, ఆర్టీసీ అధికారులను ఉంచారు. -
ప్రజాదర్బార్‌కు వినతుల వెల్లువ
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు అర్జీదారులు పోటెత్తారు. ప్రజాదర్బార్‌కు అన్ని శాఖల అధికారులు ఉదయం పదిన్నర గంటలకల్లా హాజరయ్యారు. అప్పటికే ప్రజలు అర్జీలతో పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అధికారులు మాత్రం అర్జీదారులను పట్టించుకోకుండా కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ కోసం ప్రకాశం భవనం ప్రధాన గేటువైపు చూస్తున్నారు. ఉదయం 11.42 గంటలకు కలెక్టర్ రావడంతో అప్పటి వరకు మౌనంగా కూర్చున్న జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్‌తోపాటు ఇతర అధికారుల్లో కదలిక వచ్చింది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం ప్రారంభించారు. అర్జీదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ఆదేశించారు. రైతులను ఆదుకోవాలి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు కలెక్టర్‌ను కోరారు. జిల్లాలో 85 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయన్నారు. పత్తి పంట కాపుదశలోనే నీట మునిగిందన్నారు. మిర్చి కోత దశలోనే ఉరకలెత్తి ఎండిపోయిందని చెప్పారు. వరి, పొగాకు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయన్నారు. రైతులకు ఎకరాకు 25 వేల రూపాయల చొప్పున పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌పై విచారణ జరపాలి చీరాల మండలం రామకృష్ణాపురం గ్రామ సర్పంచ్ ఎం లీలాకుమారి అవినీతి అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఉప సర్పంచ్ ఎస్కే ఆజాద్ కోరారు. 2003 నుంచి 2008 వరకు సర్పంచ్‌గా ఉన్న సమయంలో ఆమె నిధులు దుర్వినియోగం చేశారన్నారు. ఆర్ఆర్ యాక్ట్ కింద రూ.6,36,153 రికవరీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీ కార్యాలయం పైఅంతస్తు పూర్తి చేయకుండా నిధులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్మశానానికి స్థలం కేటాయించాలి నాగులుప్పలపాడు మండలం చేకూరుపాడు ఎస్సీ కాలనీకి శ్మశాన స్థలం కేటాయించాలని కాలనీవాసులు కోరారు. ఊరికి తూర్పువైపున పాత శ్మశానానికి దారి లేకపోవడంతో మెయిన్ బజారులో నుంచి శవాలు తీసుకువెళ్తుంటే గ్రామస్తులు కొందరు అభ్యంతరం చెబుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బోగస్ పట్టాలు రద్దు చేయాలి రెండున్నర దశాబ్ధాల నుంచి సాగు చేసుకుంటున్న బంజరు భూమికి నల్గొండ జిల్లాకు చెందిన గణిత పద్మ, మోర్తాల పెంటారెడ్డి, మోర్తాల కృష్ణారెడ్డిలు బోగస్ పట్టాలు సృష్టిం చారని, ఆ పట్టాలు రద్దు చేయాలని త్రిపురాంతకం మండలం ఎండూరివారిపాలేనికి చెందిన ఎస్సీలు కోరారు. గ్రామ సరిహద్దులోని అన్నసముద్రం వద్ద సర్వే నం 217లో బంజరు భూమిని చదును చేసుకుని 28 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ సుధాకర్, పీ రాంబాబు కోరారు. మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావడం లేద ని, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆధార్ లింక్ పెట్టడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించాలి పంచాయతీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాన్ని వెంటనే చెల్లించాలని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు కోరారు. తాము సమ్మెలో లేనప్పటికీ జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. టంగుటూరు, స్వర్ణ, కురిచేడు, దొనకొండ, తరిమెళ్ల, ఇడుపులపాడు పంచాయతీల్లో నెలల తరబడి వేతనాలు బకాయిలో ఉన్నాయని చెప్పారు. వికలాంగుల హాస్టల్‌కు వార్డెన్‌ను నియమించాలి ఒంగోలులోని ప్రభుత్వ వికలాంగుల బాలుర వసతి గృహానికి అన్ని అర్హతలు కలిగిన వ్యక్తిని వార్డెన్‌గా నియమించాలని ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ చాలెంజ్డ్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా కార్యదర్శి ఎస్కే కాలేషా కోరారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డిగ్రీ, బీఈడీ లేదా ఎంఏ చదివిన వారిని వార్డెన్‌గా నియమించాల్సి ఉండగా, అర్హతలేని వ్యక్తిని నియమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రజాదర్బార్‌కు సమైక్య సెగ
సమైక్య సెగ ప్రజాదర్బార్‌ను తాకింది. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ఉదయం మొదలైన కార్యక్రమాన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అడ్డుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డితో పాటు పలువురు జిల్లా అధికారులు సునయన ఆడిటోరియానికి చేరుకున్నారు. సమైక్య ఉద్యమం జిల్లా నలుమూలల ఉద్ధృతమవడంతో రవాణా వ్యవస్థ స్తంభించి ప్రజలు కూడా తక్కువగానే చేరుకున్నారు. వీరి వినతులను కలెక్టర్ స్వీకరిస్తుండగా జేఏసీ చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్రెడ్డి, నగర అధ్యక్షుడు లక్ష్మన్న, జేఏసీ నాయకులు కృష్ణుడు, రాజు తదితరులు వెళ్లి అడ్డుకున్నారు. ‘‘తెలుగు వారిని విభజించే కుట్ర జరుగుతోంది. రాష్ట్ర విభజనపై అందరం కలసికట్టుగా పోరాటం సాగించాలి. ఇందులో జిల్లా అధికారులు కూడా భాగస్వాములు కావాలి. పాలనను స్తంభింపజేయాలి. ప్రజాదర్బార్ నిర్వహించకుండ వెళ్లిపోవాలి’’ అని జేఏసీ చైర్మన్ కోరారు. జేఏసీ ప్రతినిధులు కలెక్టర్ ఎదుట నేలపై బైఠాయించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత కలెక్టర్‌తో సహా జిల్లా అధికారులంతా కార్యక్రమం నుంచి బయటకు వచ్చేశారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది నుంచి జిల్లా రెవెన్యూ అధికారి వినతులు స్వీకరించారు.