ఎంపీ ప్రజాదర్బార్‌కు విశేష స్పందన
కడప కార్పొరేషన్:
స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు విశేష స్పందన లభించింది. ప్రజల నుంచి ఫిర్యాదుల మేరకు సమస్యలను పరిష్కరించాలని ఆయా అధికారులకు ఎంపీ ఫోన్ చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని తిరుపతి మహిళా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ.ప్రభాకర్‌రెడ్డి(పీలేరు) తీసుకున్న పది లక్షలు రూపాయల్లో ఇంకా రూ. 5.60లక్షలు ఇవ్వాల్సి ఉందని వెంకమ్మ ఫిర్యాదు చేశారు. డబ్బు అడిగితే బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఫోన్‌చేసి సమస్యను పరిష్కరించాలని అవినాష్‌రెడ్డి కోరారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారని రాజుపాళెం, బద్వేల్‌కు చెందిన ప్రజలు ఫిర్యాదు చేశారు. అలాగే ప్రాద్దుటూరుకు చెందిన ప్రభుత్వ కళాశాలలో తాను ఉద్యోగం చేస్తుండేవాడినని, తనకు మళ్లీ ఆ ఉద్యోగం ఇప్పించాలని వై.కిరణ్‌కుమార్ అనే యువకుడు విన్నవించాడు. పోరుమామిళ్ల టైలర్స్ కాలనీలో హౌసింగ్ బోర్డు వారు తనకు ఎల్‌ఐజీ హౌస్ కేటాయించారని, ఇంతవరకూ తనకు ఇళ్లు చూపలే దని రహమతుల్లా అనే వృద్ధుడు ఫిర్యాదు చేశారు. సీబీఆర్ ప్రాజెక్టు టెర్మినేట్ అవుతోందని జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తనను తొలగించారని, ఆ ప్రాజెక్టు కొనసాగుతున్నందున మళ్లీ ఉద్యోగం ఇప్పించాలని ముస్తఫ్ ఖాన్ కోరారు. కార్యక్రమంలో చక్రాయపేట జెడ్పీటీసీ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు ఎంపీ సురేష్, మాజీ మున్సిపల్ చెర్మైన్ మునెయ్య, విద్యార్థి నాయకుడు బి.అమర్‌నాథ్‌రెడ్డి, ఐస్‌క్రీం రవి, మహిమలూరి వెంకటేష్ పాల్గొన్నారు.