
వరంగల్ జిల్లా గోండులు తమ హస్తకళా నైపుణ్యంతో రూపకల్పన చేసిన పురాతన లాంతరును గవర్నర్ తమిళిసై ప్రధాని మోదీకి కానుకగా అందజేసారు.
సాక్షి, హైదరాబాద్: పరేడ్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రధానిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందచేశారు.
ప్రధాని రాత్రి రాజ్‌భవన్‌లో బస చేసి, సోమవారం ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఏపీలోని విజయవాడ చేరుకుని అటు నుంచి హెలికాప్టర్‌లో భీమవరానికి వెళ్లనున్నారు.