సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం రాజ్‌భవన్‌లో తన సలహాదారులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏపీవీఎన్ శర్మ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏకే మహంతితో సమావేశమయ్యారు. తెలంగాణ వ్యవహారాలతో పాటు వర్తమాన అంశాలపై ఈ సమావేశం నిర్వహించినట్టు గవర్నర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం–రాజ్‌భవన్ మధ్య సంబంధాలు, రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయమై అనుసరించాల్సిన విధానం, రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలపై గవర్నర్ చర్చించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment