క్రిస్మస్‌ వేడుకలకు రాణీగారు దూరం! | UK Queen too ill for christmas service for first time in 28 years | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ వేడుకలకు రాణీగారు దూరం!

Published Sun, Dec 25 2016 7:15 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM

క్రిస్మస్‌ వేడుకలకు రాణీగారు దూరం!

క్రిస్మస్‌ వేడుకలకు రాణీగారు దూరం!

దాదాపు 28 ఏళ్లలో తొలిసారిగా ఈ సంవత్సరం బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2 క్రిస్మస్ సంబరాలకు దూరంగా ఉన్నారు. ఆమెకు బాగా జలుబు చేయడంతో సండ్రింగ్‌హామ్‌లో జరిగే వేడుకలకు వెళ్లలేదని తెలిసింది. బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన వారు క్రిస్మస్ సంబరాలకు వెళ్లకపోవడం దాదాపు ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఆమెను చూసేందుకు ఈ సందర్భంలోనే భారీ సంఖ్యలో సామాన్య ప్రజలు చర్చికి వస్తారు. రాణీగారికి జలుబు చాలా ఎక్కువగా ఉందని, అందువల్ల ఆమెను లోపలే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది.
 
రాబోయే రోజుల్లో రాచకుటుంబం నిర్వహించే క్రిస్మస్ సంబరాల్లో రాణీగారు పాల్గొంటారని తెలిపారు. రాణీ ఎలిజబెత్ ఆరోగ్యం సాధారణంగా అయితే బాగానే ఉంటుంది. ఆమె గత కొన్నేళ్లుగా ప్రయాణాలు కూడా బాగానే చేస్తున్నారు. ఇటీవలి కాలంలో రాణీగారి భర్త ప్రిన్స్ ఫిలిప్ (95) ఇటీవలి కాలంలో ప్రజల ముందు రావడం, సహాయ కార్యక్రమాలు చేయడం మానుకున్నారు. ఆయనకు కూడా ఈ వారం మొదటి నుంచి జలుబు ఎక్కువగా ఉందని బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాలు చెప్పాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement