సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల తరహాలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా వేడుకలను నియంత్రించాలని స్పష్టం చేసింది. ఎక్కడా జనం గుమిగూడకుండా రెండు, మూడు రోజుల్లో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాజీలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతున్నాయని, క్రిస్మస్, నూత న సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశం ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ, రాజకీయ, సాంప్ర దాయ కార్యక్రమాల్లో కరోనా నియంత్రణ నిబంధ నలు పాటించడం లేదని, మాస్కులు ధరించడం లేదని, భౌతిక దూరం పాటించడం లేదని తెలి పారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందించింది.
ఎక్కడికక్కడ పరీక్షలు చేయండి: ‘ఢిల్లీ, మహారాష్ట్రలు వేడుకలను నియంత్రిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశాయి. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులతో ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా విమానాశ్రయాల్లో నిర్వహి స్తున్న తరహాలో రాష్ట్ర సరిహద్దులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలి. కరోనా నియంత్రణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై గత నెల 21న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలి. తీసుకున్న చర్యలపై జనవరి 4లోగా సమగ్ర నివేదిక సమర్పించండి..’ అని ధర్మాసనం ఆదేశించింది.
చదవండి: తెలంగాణలో రికార్డ్: తొలి ముస్లిం మహిళా ఐపీఎస్ సలీమా
Comments
Please login to add a commentAdd a comment