
నయనతార, విఘ్నేష్ శివన్,
లైఫ్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోరు నయనతార, విఘ్నేష్ శివన్. పుట్టినరోజులు, పండగలు, సినిమా విజయాలు.. ఇలా దేన్నీ మిస్ కాకుండా సెలబ్రేట్ చేసుకుంటారు. వీటికి అదనంగా అడపా దడపా హాలీడే ట్రిప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నయన్–శివన్ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. క్రిస్మస్ ట్రీను అలంకరిస్తూ ఇద్దరూ సెల్ఫీలు దిగారు. ‘‘అందరికీ హ్యాపీ అండ్ జాయ్‌ఫుల్ క్రిస్మస్ శుభాకాంక్షలు’’ అంటూ ఈ ఫొటోలను షేర్ చేశారు. పండగలు కలసి సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ జంట పెళ్లి పండగను ఎప్పుడు చేసుకుంటారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
నయనతార