Holiday Trips
-
వేసవి ప్రయాణానికి రెడీ
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పర్యాటకులు చల్లటి ప్రదేశాలకు ప్రయాణం కడుతున్నారు. వరుసగా రెండు వేసవి సీజన్లలో కరోనా కారణంగా ప్రయాణం చేయలేని పరిస్థితులు.. ఈ విడత లేకపోవడం కూడా పర్యాటక రంగంలో సందడిని పెంచింది. గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి సేదతీరేందుకు పట్టణ వాసులు మొగ్గు చూపిస్తున్నారు. పర్వత, కొండ ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు ఈ విడత డిమాండ్ అనూహ్యంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. హోటళ్లు, ఫ్లయిట్ బుకింగ్‌లు జోరుగా జరుగుతున్నట్టు పేర్కొన్నాయి. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు ఈ వేసవిలో ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. ఇందులోనూ ఎక్కువ మంది విహార యాత్రలకే మొగ్గు చూపిస్తున్నట్టు ఓయో సర్వేలో తెలిసింది. 64 శాతం మంది వేసవిలో సెలవులు పెట్టేసి నచ్చిన ప్రదేశానికి వెళ్లొద్దామని అనుకుంటుంటే.. 94 శాతం మంది దేశీయంగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. ఉత్తరాదిలో వీటికి డిమాండ్.. ఆన్లైన్లో వివిధ పోర్టళ్లపై బుకింగ్ తీరును పరిశీలిస్తే.. ఉత్తరాదిలో రిషికేష్, హరిద్వార్, సిమ్లా, ముస్సోరీ, డెహ్రాడూన్ ప్రాంతాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఈ ప్రాంతాల్లోని హోటల్స్, రిసార్ట్‌ల్లో దాదాపు గదులన్నీ బుకింగ్ అయిపోయాయి. రూమ్ టారిఫ్‌లు కరోనాకు ముందుతో పోలిస్తే 10–15 శాతం అధికంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా రిషికేష్, హరిద్వార్‌లోని అన్ని ఇంటర్నేషనల్ బ్రాండెడ్ హోటళ్లలో మే నుంచి జూన్ చివరికి నాటికి బుకింగ్‌లు పూర్తిగా అయిపోయాయి. ఈ ఏడాది పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లకు డిమాండ్ కరోనా ముందు నాటి స్థాయికి చేరుకున్నట్టు, సగటు రూమ్ చార్జీలు 10 శాతం పెరిగినట్టు ఎస్సైర్ హాస్పిటాలిటీ గ్రూపు సీఈవో అఖిల్ అరోరా తెలిపారు. ఎస్సైర్ గ్రూపునకు బిమ్టల్, జిమ్‌కార్బెట్ ప్రాంతాల్లో హోటళ్లు ఉన్నాయి. కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నా ప్రయాణాలకు డిమాండ్ తగ్గలేదని అరోరా చెప్పారు. పుంజుకున్న బుకింగ్‌లు.. వేసవి కోసం కశ్మీర్, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, అరుణాచల్, మణిపూర్, త్రిపుర ప్రాంతాలు ఆకర్షణీయంగా (అధిక డిమాండ్) మారిపోయాయి. దేశం బయట దుబాయి, మాల్దీవులు, థాయిలాండ్, యూఎస్‌కు డిమాండ్ నెలకొంది. ‘‘మే, జూన్ నెలలకు సంబంధించి ముందస్తు బుకింగ్‌లు పెద్ద ఎత్తున పెరిగాయి. ప్రజలు ఎక్కువ రోజుల పాటు విడిది కోసం వెళ్లాలని చూస్తున్నారు’’అని ఈజ్‌మైట్రిప్ ప్రెసిడెంట్ హిమంక్ త్రిపాఠి తెలిపారు. ఫ్లయిట్ బుకింగ్‌లు కరోనా ముందు నాటికి చేరినట్టు మేక్మైట్రిప్ సీఈవో రాజేష్ మాగోవ్ వెల్లడించారు. సులభ వాయిదాల్లో రుణాలు లభించడం డిమాండ్‌కు తోడ్పడుతున్నట్టు ఆయన చెప్పారు. రికవరీ బలంగా.. 2022 ఏప్రిల్ నెలలో సగటు రోజువారీ ఫ్లయిట్ డిపార్చర్లు 2,726గా ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో రోజువారీ 2,000తో పోలిస్తే మంచి వృద్ధి కనిపిస్తోంది. మార్చి నెలలో రోజువారీ డిపార్చర్లు 2,588తో పోల్చి చూసినా ఏప్రిల్‌లో 5 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. విమానాల్లో ప్రయాణికుల భర్తీ కూడా గతేడాది ఇదే నెలతో పోలిస్తే 2022 ఏప్రిల్‌లో 36 శాతం అధికంగా ఉంది. గత నెలలో ఒక ఫ్లయిట్లో సగటు ప్రయాణికుల సంఖ్య 128గా ఉంది. కరోనాకు ముందు సగటు ప్రయాణికులు 135 కంటే కొంచెం తక్కువగా ఉంది. దేశీయంగా ప్రయాణికుల రద్దీ ఏప్రిల్‌లో వార్షికంగా చూస్తే 83 శాతం పెరిగి 10.5 మిలియన్లుగా ఉంది. కరోనాకు ముందున్న 11 మిలియన్ల కంటే ఇది స్వల్పంగానే తక్కువ. పెంటప్ డిమాండ్ ఈ ఏడాది పర్యాటక ప్రాంతాలు, విహార యాత్రా స్థలాలకు డిమాండ్ గణనీయంగా ఉండడానికి.. గత రెండు వేసవి సీజన్లలో ప్రయాణం చేయలేని వారు ఈ ఏడాది ప్రాధాన్యం ఇస్తుండడం వల్లేనని అనుకోవాలి. గుడ్ ఫ్రైడే, విసు వీక్ సందర్భంగా 8 లక్షల బుకింగ్‌లు నమోదయ్యాయని.. 2022లో ఇదే అత్యధికమని ఓయో చీఫ్ సర్వీస్ ఆఫీసర్ షీరంగ్ గాడ్బోల్ తెలిపారు. రానున్న కొన్ని నెలల్లో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నట్టు చెప్పారు. -
భార్యతో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రామ్‌చరణ్
హీరో రామ్‌చరణ్‌కి స్మాల్ బ్రేక్ రావడంతో హాలిడే మోడ్‌లో ఉన్నారు. విహారయాత్ర కోసం విదేశాలకు వెళ్లిన చరణ్ ఫోటోలను ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ హాలిడే ట్రిప్‌ను కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్లో రామ్‌చరణ్ జాయిన్ అవుతారని తెలుస్తోంది. కాగా ఆయన ఓ హీరోగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవి హీరోగా చేసిన ‘ఆచార్య’ చిత్రంలో రామ్‌చరణ్ ఓ కీలక పాత్ర చేశారు. -
'ఆ ఫోటోలు పెడుతున్నారు..కొంచెమైనా సిగ్గుండాలి'
ముంబై : ఓ వైపు దేశమంతా కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం తమ ఎంజాయ్‌మెంట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. సెలబ్రిటీలు మాత్రం వినోదాల కోసం విదేశాలకు వాలిపోతున్న సంగతి తెలిసిందే. హాలీడే ట్రిప్పుల పేరుతో ప్రేమపక్షులు మాల్దీవుల బీచుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇటీవలె అలియా భట్, రణ్‌బీర్ కపూర్, దిషా పటాని-టైగర్ ష్రాఫ్ హాలీడే ఎంజాయ్ చేయడం కోసం మాల్దీవులు చెక్కేసిన సంగతి తెలిసిందే. వీరి హాలిడే ట్రిప్పై నెటి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘‘కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా.. ఓ వైపు దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మీకు టూర్లు కావాల్సి వచ్చిందా’’అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా విషయంపై బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ స్పందించారు. ఇప్పడు ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుంది. మన దేశంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వీళ్లు మాత్రం తమ జల్సాల కోసం డబ్బులను నీళ్లలా ఖర్చుపెడుతున్నారు. ఓ వైపు దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుంటే...వీరు మాత్రం వెకేషన్ ట్రిప్పులను ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలు పెడుతున్నారు. కొంచెం అయినా సిగ్గుండాలి. వీళ్లు యాక్టింగ్ గురించి తప్పా ఇంకేమీ మాట్లాడలేరు అంటూ బాలీవుడ్ సెలబ్రిటీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఒక తన వెకేషన్ గురించి మాట్లాడుతూ..తాను బుధానాలోని తన కుటుంబంతో సమయం గడుపుతున్నానని, ఇదే తనకు మాల్దీవులు అని చెప్పుకొచ్చారు. చదవండి : అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్ ‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’ -
విరామం విహారం వినోదం
షూటింగ్, ప్రయాణాలు, ప్రమోషన్లతో యాక్టర్స్ డైరీ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఆ రొటీన్ నుంచి చిన్న బ్రేక్ కోసం అప్పుడప్పుడు సరదా ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. ఆ చిన్న విరామంలో విహారం, వినోదం ఉండేలా చూసుకుంటుంటారు. ప్రస్తుతం అలాంటి చిన్న ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు మెహరీన్. జనవరిలో మెహరీన్ నటించిన మూడు సినిమాలు (ఎంత మంచి వాడవురా!, పటాస్ (తమిళం) అశ్వథ్థామ) విడుదలయ్యాయి. ప్రస్తుతం శ్రీలంకలో హాలిడేయింగ్ చేస్తున్నారామె. శ్రీలంకలోని వాటర్ పార్కులు, జూ పార్కులు చుట్టేస్తున్నారు మెహరీన్. ఆ ఫొటోలు తన సోషల్‌మీడియాలో పంచుకున్నారు. మరోవైపు ‘కంచె’ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలీలో వెకేషన్ చేస్తున్నారు. అక్కడ జలపాతాల వద్ద దిగిన ఫొటోలను షేర్ చేశారు. -
స్విట్జర్లాండ్ టూర్‌కే భారతీయుల అధిక ప్రాధాన్యత
స్విట్జర్లాండ్ : మంచు ప్రదేశాలంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అందులో భారతీయులైతే మరి ముఖ్యంగా ఇష్టపడుతారు. ఈ విషయాన్నే కొన్ని పర్యాటక సర్వేలు కూడా తేల్చిచెబుతున్నాయి. మంచు ప్రదేశాల పర్యాటక జాబితాలో ముందుండే స్విట్జర్లాండ్‌కు మన భారతీయులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారంటా. 59 శాతం మంది భారతీయులు సెలవు రోజుల్లో పర్యటించడానికి ఎక్కువగా స్విట్జర్లాండ్‌ను ఎంచుకోవడంలో ఆసక్తిని చూపుతున్నట్లు క్లబ్ మెడ్ చేసిన సర్వేలో వెల్లడైంది. ఈ క్లబ్ మెడ్ సర్వే ప్రకారం సెలవుల రోజుల్లో భారతీయులు ఎక్కువ మంది స్విట్జర్లాండ్‌లో టూరిస్టులుగా ఉంటున్నారని, దాదాపు 96 శాతం భారతీయ ప్రజలు రాబోయే మూడేళ్లలో యురోపియన్ మంచు ప్రాంతాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో అధిక సంఖ్యలో భారతీయులు విహరయాత్రకు యురోపియన్ మంచు ప్రాంతాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టూరిజంలో వైవిధ్యమైన, సాహోసోపేతమైన, ప్రయోగత్మకంగా ఉండే మంచు ప్రదేశాల వైపే పర్యటించడానికి భారతీయులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని గ్లోబల్ స్నో హాలిడే లీడర్, ఆసియా-పసిఫిక్ స్నో బ్రాండ్ స్టడీ 2019(ఏపీఏసీ) నివేదిక పేర్కొంది. ఆసియా-పసిఫిక్ మంచు క్రీడలను భారతీయులు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. స్నో బోర్డింగ్, స్కైయింగ్ స్నో రైడింగ్లు అత్యంత ప్రజాదరణ పోందిన మంచు క్రీడలు. స్విట్జర్లాండ్‌లోని సెయింట్-మోర్టిజ్ రోయ్ సోలైల్, ఇటలీలోని సెర్వినియా, ఫ్రాన్స్‌లోని లెస్ డ్యూక్స్‌లోని కోన్ని మంచు ప్రదేశాలు స్నో స్కైయ్ డ్రైవింగ్ పర్యాటక ప్రదేశాలు. ఈ ప్రదేశాలకు ప్రతి ఏటా 75 శాతం భారతీయులు వస్తున్నారని, వారు కేవలం స్నో డ్రైవింగ్ కోసమే ఇక్కడికి రావడానికి ఆసక్తిని చూపుతున్నారని ఏపీఏసీ సర్వే వెల్లడించింది. ప్రయాణంలో కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ప్రయాణ విషయానికి వస్తే భారతీయులు ఎక్కువగా కుటుంబానికే ప్రాధాన్యతనిస్తున్నారు. కుటుంబంతో కలసి పర్యటించడానికి ఇష్టపడుతున్నట్లు సర్వేలో తెలింది. అన్ని వయసుల వారు సరదగా గడపడానికి, అనుగుణంగా ఉండేటువంటి పర్యాటక ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. సోలోగా టూరీస్టుల కంటే 27 శాతం భారతీయులు మూడు తరాలతో కుటుంబీకులతో కలిసి పర్యాటించేందుకు ఇష్టపడే భారతీయులు 27 శాతం ఉన్నారని, ఇది ఆసియా-పసిఫీక్ సగటు 18 శాతాన్ని అధిగమించినట్లు వెల్లడైంది. -
తక్కువ ధరకే ఫ్లాట్స్, హాలిడే ట్రిప్స్..
పంజగుట్ట: తక్కువ ధరకే ఫ్లాట్స్.. హాలిడే ట్రిప్స్ తీసుకెళతామంటూ ప్రచారం చేసుకుని పలువురి నుంచి నగదు వసూలు చేసిన ఓ సంస్థ బోర్డు తిప్పేసిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన షేక్ ఖాధర్ బాషా, పానగంటి విజయ్ కుమార్, అనూజ్ పటేల్ కలిసి వెంకటరమణ కాలనీలో ఎలైట్ రియాలిటీ సర్వీసెస్ సంస్థను ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. తక్కువ ధరకే యాదగిరిగుట్ట సమీపంలో ఫ్లాట్స్ ఇస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. సెలవుదినాల్లో దేశ, విదేశాల్లో హాలిడే ట్రిప్స్‌కు తీసుకువెళతామని నమ్మించి ఒకొక్కరి నుంచి అడ్వాన్స్‌గా రూ.లక్ష నుండి రూ.2 లక్షల వరకు వసూలు చేశారు. చెల్లించిన డబ్బులకు బాండ్ పేపర్‌పై రాసి ఇచ్చారు. వీరి మాటలు నమ్మిన 30 మంది రూ.40 లక్షలకు పైగా మోసపోయినట్లు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సదరు సంస్థ కార్యాలయానికి వెళ్లగా అప్పటికే బోర్డు తిప్పేసి పారిపోయారు. నిందితులు ప్రయారిటీ సర్వీసెస్, ల్యాండ్ మార్క్ ఇన్ఫ్రా, ఫారŠూచ్యన్ గ్రూప్ ఆఫ్ ఎస్టేట్స్ పేరుతో పలు సంస్థలను స్థాపించి చాలా మందిని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరి బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని ఎస్సై సతీష్ తెలిపారు. కాగా నిందితులు ముంబైలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హ్యాపీ క్రిస్మస్
లైఫ్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోరు నయనతార, విఘ్నేష్ శివన్. పుట్టినరోజులు, పండగలు, సినిమా విజయాలు.. ఇలా దేన్నీ మిస్ కాకుండా సెలబ్రేట్ చేసుకుంటారు. వీటికి అదనంగా అడపా దడపా హాలీడే ట్రిప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నయన్–శివన్ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. క్రిస్మస్ ట్రీను అలంకరిస్తూ ఇద్దరూ సెల్ఫీలు దిగారు. ‘‘అందరికీ హ్యాపీ అండ్ జాయ్‌ఫుల్ క్రిస్మస్ శుభాకాంక్షలు’’ అంటూ ఈ ఫొటోలను షేర్ చేశారు. పండగలు కలసి సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ జంట పెళ్లి పండగను ఎప్పుడు చేసుకుంటారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నయనతార -
పూల తోట.. మంచు వాన...
జోరుగా హుషారుగా షికారు చేస్తే అలసట అంతా మాయమైపోతుంది. అందుకే బిజీ బిజీగా వర్క్ చేశాక ఓ చిన్న హాలిడే తీసుకుంటుంటారు సెలబ్రిటీలు. త్రిష అయితే వీలున్నప్పుడల్లా విదేశాలు చెక్కేస్తారు. ఆమెకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఇటీవల లండన్, స్కాట్‌ల్యాండ్ వంటి పలు దేశాలు చుట్టొచ్చారు. ఈ సందర్భంగా హాలిడే ట్రిప్స్‌ని ఎలా ఎంజాయ్ చేస్తారో త్రిష చెప్పుకొచ్చారు. ►బేసిక్‌గా నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. హాలిడే ట్రిప్ అంటే ఎగై్జట్ అవుతాను. నా ఫేవరెట్ హాలిడే స్పాట్ న్యూయార్క్. మా నాన్నగారు అక్కడే వర్క్ చేసేవారు. సో.. అక్కడికి చాలాసార్లు వెళ్లాను. ► షాపింగ్ మాల్స్ ఉంటే చాలు నాకు ఇంకేం అవసరం లేదు. దుబాయ్, లండన్, న్యూయార్క్ వంటివి షాపింగ్‌కు బెస్ట్ ప్లేసెస్. ఇప్పటివరకూ నేను షాపింగ్ చేసినవాటిలో బెస్ట్ అంటే స్విస్ వాచ్. వెనీస్ వెళ్లినప్పుడు అది కొనుక్కున్నాను. ►అడ్వెంచర్ ట్రిప్స్, నార్మల్ ట్రావెలింగ్‌ను ఒకేలా ఇష్టపడతాను. ఎనర్జీ లెవల్స్ ఫుల్‌గా ఉన్నప్పుడు బంగీ జంప్స్, స్కై డైవింగ్స్ చేస్తాను. షూటింగ్ అప్పుడు బాగా అలిసిపోతే బీచ్ సైడ్స్ లేదా హిల్ స్టేషన్స్‌లో సేద తీరతాను. ► నేను ట్రావెలింగ్కు వెళ్లానంటే.. వచ్చేటప్పుడు నా వెనకాల సూట్‌కేసులు సూట్‌కేసులు ఉండాల్సిందే. మా అమ్మ ఎప్పుడూ లైట్‌గా ప్యాక్ చేసుకో అంటుంటారు. అలాగే చేసుకుంటాను. కానీ వచ్చేటప్పుడు సూట్‌కేస్‌ల సంఖ్య పెరిగిపోతుంది. ఆ రేంజ్లో షాపింగ్ చేస్తాను. ► ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు డైట్ అస్సలు పాటించను. ఒకవేళ అలా చేస్తే అది మహా పాపమే అవుతుంది. నాకు నచ్చినంత తినేస్తా. ఎలాగూ ట్రావెలింగ్‌లో ఎక్కువగా నడుస్తూనే ఉంటాం కాబట్టి వెయిట్ కూడా కంట్రోల్లోనే ఉంటుంది. ►ఈ హాలిడే ట్రిప్‌లో నెదర్‌ల్యాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్ వెళ్లాను. అక్కడ పూల తోటలో ఫుల్లుగా ఎంజాయ్ చేశాను. రంగు రంగుల పూల మధ్య మనసు ఆహ్లాదకరంగా అనిపించింది. స్కాట్‌ల్యాండ్‌లో మంచు వాన కురిసింది. ఆ వానకు ఒళ్లు పులకరించింది. హాలిడే అప్పుడు ఎలాంటి బాధ్యత ఉండదు. హ్యాపీగా ఎంజాయ్ చేయడం. అందుకే అక్కణ్ణుంచి తిరిగొచ్చేటప్పుడు కొంచెం ఎనర్జిటిక్‌గా, ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఆ ఎనర్జీతో ఇక్కడ జోరుగా షూటింగ్స్‌లో పాల్గొంటాను. -
టాలీవుడ్ సమ్మర్ ట్రిప్
జీవితాన్ని ఆస్వాదించడం ఓ కళ. అది తెలిసినవాళ్లు ముఖ్యమైన సందర్భాలను చాలా గ్రాండ్‌గా, డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే, ఖాళీ సమయాలను ఆస్వాదించడం కోసం ప్రత్యేకంగా టూర్లు ప్లాన్ చేసుకుంటారు. ఇటీవల మహేశ్‌బాబు భార్య నమ్రత అలానే చేశారు. అలాగే, అల్లు అర్జున్ కూడా ఓ ముఖ్యమైన సెలబ్రేషన్ కోసం విదేశాలు వెళ్లారు. ఇక... వీళ్ల ఎంజాయ్మెంట్ గురించి తెలుసుకుందాం. గోవాలో సందడి మహేశ్‌బాబు ఎంత బిజీగా ఉన్నప్పటికీ భార్యాపిల్లల కోసం టైమ్ స్పెండ్ చేస్తుంటారు. వీలు కుదిరినప్పుడల్లా విదేశాలు వెళ్లి ఎంజాయ్ చేస్తారు. వీళ్లు వెళ్లే ట్రిప్స్ గురించి వింటే, లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తారని ఎవరికైనా అనిపిస్తుంది. ఆ మధ్య విదేశాలకు వెళ్లారు. ఇప్పుడు గోవాలో ఉన్నారు. అక్కడి బీచ్‌లో పిల్లలు గౌతమ్, సితారలతో ఆడుకుంటూ, నమ్రత చాలా సందడి చేశారు. గోవాలో సీఫుడ్ చాలా బాగుంటుంది. అక్కడి ‘షిఫర్మెన్స్ వార్స్’ అనే రెస్టారెంట్‌కి వెళ్లి, ‘సీ ఫుడ్‌కి ఇది బెస్ట్ ప్లేస్’ అని మహేశ్, నమ్రత పేర్కొన్నారు. దుబాయ్‌లో పండగ మహేశ్‌బాబులానే అల్లు అర్జున్ పక్కా ఫ్యామిలీ మ్యాన్. భార్య స్నేహ, కొడుకు అయాన్‌తో హాలీడే ట్రిప్స్‌కి వెళుతుంటారు. ముఖ్యంగా అయాన్ బర్త్‌డేను బాగా సెలబ్రేట్ చేయడం బన్నీ అలవాటు. గత ఏడాది అయాన్ మొదటి బర్త్‌డేను సింగపూర్‌లో జరిపారు. ఈసారి కూడా బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి విదేశాన్నే ఎంచుకున్నారు. భార్యా, కొడుకుతో కలిసి దుబాయ్ వెళ్లారు. ఆదివారం అయాన్ బర్త్‌డేను అక్కడ జరిపారు. ఒకవేళ అయాన్ ప్రతి బర్త్‌డేను ఇలా ఏదో ఒక దేశంలో జరపాలని బన్నీ అనుకుంటున్నారేమో. అందుకే రెండో బర్త్‌డేకి కూడా విదేశాన్నే సెలక్ట్ చేసుకుని ఉంటారు.