పూల తోట..  మంచు వాన... | trisha loves flowers | Sakshi
Sakshi News home page

పూల తోట..  మంచు వాన...

Published Wed, Mar 28 2018 12:24 AM | Last Updated on Wed, Mar 28 2018 12:24 AM

trisha loves flowers - Sakshi

జోరుగా హుషారుగా షికారు చేస్తే అలసట అంతా మాయమైపోతుంది. అందుకే బిజీ బిజీగా వర్క్‌ చేశాక ఓ చిన్న హాలిడే తీసుకుంటుంటారు సెలబ్రిటీలు. త్రిష అయితే వీలున్నప్పుడల్లా విదేశాలు చెక్కేస్తారు. ఆమెకు ట్రావెలింగ్‌ అంటే ఇష్టం. ఇటీవల లండన్, స్కాట్‌ల్యాండ్‌ వంటి పలు దేశాలు చుట్టొచ్చారు. ఈ సందర్భంగా హాలిడే ట్రిప్స్‌ని ఎలా ఎంజాయ్‌ చేస్తారో త్రిష చెప్పుకొచ్చారు.
►బేసిక్‌గా నాకు ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. హాలిడే ట్రిప్‌ అంటే ఎగై్జట్‌ అవుతాను. నా ఫేవరెట్‌ హాలిడే స్పాట్‌ న్యూయార్క్‌. మా నాన్నగారు అక్కడే వర్క్‌ చేసేవారు. సో.. అక్కడికి చాలాసార్లు వెళ్లాను.
► షాపింగ్‌ మాల్స్‌ ఉంటే చాలు నాకు ఇంకేం అవసరం లేదు. దుబాయ్, లండన్, న్యూయార్క్‌ వంటివి షాపింగ్‌కు బెస్ట్‌ ప్లేసెస్‌. ఇప్పటివరకూ నేను షాపింగ్‌ చేసినవాటిలో బెస్ట్‌ అంటే స్విస్‌ వాచ్‌. వెనీస్‌ వెళ్లినప్పుడు అది కొనుక్కున్నాను.
►అడ్వెంచర్‌ ట్రిప్స్, నార్మల్‌ ట్రావెలింగ్‌ను ఒకేలా ఇష్టపడతాను. ఎనర్జీ లెవల్స్‌ ఫుల్‌గా ఉన్నప్పుడు బంగీ జంప్స్, స్కై డైవింగ్స్‌ చేస్తాను. షూటింగ్‌ అప్పుడు బాగా అలిసిపోతే బీచ్‌ సైడ్స్‌ లేదా హిల్‌ స్టేషన్స్‌లో సేద తీరతాను.
► నేను ట్రావెలింగ్‌కు వెళ్లానంటే.. వచ్చేటప్పుడు నా వెనకాల సూట్‌కేసులు సూట్‌కేసులు ఉండాల్సిందే. మా అమ్మ ఎప్పుడూ లైట్‌గా ప్యాక్‌ చేసుకో అంటుంటారు. అలాగే చేసుకుంటాను. కానీ వచ్చేటప్పుడు సూట్‌కేస్‌ల సంఖ్య పెరిగిపోతుంది. ఆ రేంజ్‌లో షాపింగ్‌ చేస్తాను.
► ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు డైట్‌ అస్సలు పాటించను. ఒకవేళ అలా చేస్తే అది మహా పాపమే అవుతుంది. నాకు నచ్చినంత తినేస్తా. ఎలాగూ ట్రావెలింగ్‌లో ఎక్కువగా నడుస్తూనే ఉంటాం కాబట్టి వెయిట్‌ కూడా కంట్రోల్‌లోనే ఉంటుంది.
►ఈ హాలిడే ట్రిప్‌లో నెదర్‌ల్యాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌ వెళ్లాను. అక్కడ పూల తోటలో ఫుల్లుగా ఎంజాయ్‌ చేశాను. రంగు రంగుల పూల మధ్య మనసు ఆహ్లాదకరంగా అనిపించింది. స్కాట్‌ల్యాండ్‌లో మంచు వాన కురిసింది. ఆ వానకు ఒళ్లు పులకరించింది. హాలిడే అప్పుడు ఎలాంటి బాధ్యత ఉండదు. హ్యాపీగా ఎంజాయ్‌ చేయడం. అందుకే అక్కణ్ణుంచి తిరిగొచ్చేటప్పుడు కొంచెం ఎనర్జిటిక్‌గా, ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఆ ఎనర్జీతో ఇక్కడ జోరుగా షూటింగ్స్‌లో పాల్గొంటాను. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement