టాలీవుడ్ సమ్మర్ ట్రిప్
జీవితాన్ని ఆస్వాదించడం ఓ కళ. అది తెలిసినవాళ్లు ముఖ్యమైన సందర్భాలను చాలా గ్రాండ్‌గా, డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే, ఖాళీ సమయాలను ఆస్వాదించడం కోసం ప్రత్యేకంగా టూర్‌లు ప్లాన్ చేసుకుంటారు. ఇటీవల మహేశ్‌బాబు భార్య నమ్రత అలానే చేశారు. అలాగే, అల్లు అర్జున్ కూడా ఓ ముఖ్యమైన సెలబ్రేషన్ కోసం విదేశాలు వెళ్లారు. ఇక... వీళ్ల ఎంజాయ్‌మెంట్ గురించి తెలుసుకుందాం.
గోవాలో సందడి
మహేశ్‌బాబు ఎంత బిజీగా ఉన్నప్పటికీ భార్యాపిల్లల కోసం టైమ్ స్పెండ్ చేస్తుంటారు. వీలు కుదిరినప్పుడల్లా విదేశాలు వెళ్లి ఎంజాయ్ చేస్తారు. వీళ్లు వెళ్లే ట్రిప్స్ గురించి వింటే, లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తారని ఎవరికైనా అనిపిస్తుంది. ఆ మధ్య విదేశాలకు వెళ్లారు. ఇప్పుడు గోవాలో ఉన్నారు. అక్కడి బీచ్‌లో పిల్లలు గౌతమ్, సితారలతో ఆడుకుంటూ, నమ్రత చాలా సందడి చేశారు. గోవాలో సీఫుడ్ చాలా బాగుంటుంది. అక్కడి ‘షిఫర్‌మెన్స్ వార్స్’ అనే రెస్టారెంట్‌కి వెళ్లి, ‘సీ ఫుడ్‌కి ఇది బెస్ట్ ప్లేస్’ అని మహేశ్, నమ్రత పేర్కొన్నారు.
దుబాయ్‌లో పండగ
మహేశ్‌బాబులానే అల్లు అర్జున్ పక్కా ఫ్యామిలీ మ్యాన్. భార్య స్నేహ, కొడుకు అయాన్‌తో హాలీడే ట్రిప్స్‌కి వెళుతుంటారు. ముఖ్యంగా అయాన్ బర్త్‌డేను బాగా సెలబ్రేట్ చేయడం బన్నీ అలవాటు. గత ఏడాది అయాన్ మొదటి బర్త్‌డేను సింగపూర్‌లో జరిపారు. ఈసారి కూడా బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి విదేశాన్నే ఎంచుకున్నారు. భార్యా, కొడుకుతో కలిసి దుబాయ్ వెళ్లారు. ఆదివారం అయాన్ బర్త్‌డేను అక్కడ జరిపారు. ఒకవేళ అయాన్ ప్రతి బర్త్‌డేను ఇలా ఏదో ఒక దేశంలో జరపాలని బన్నీ అనుకుంటున్నారేమో. అందుకే రెండో బర్త్‌డేకి కూడా విదేశాన్నే సెలక్ట్ చేసుకుని ఉంటారు.