
అబ్బో... ఇప్పుడెక్కడ క్రిస్మస్ అండీ! పండక్కి ఇంకో పాతిక రోజులు ఉందిగా? అనొచ్చు. కానీ, కాజల్ అగర్వాల్‌కి ఆల్రెడీ క్రిస్మస్ వచ్చింది. ఇప్పుడా సంబరాల్లోనే ఉన్నారు. అదీ ప్యారిస్‌లో! ఇదేం లెక్క? ఇండియాలో డిసెంబర్ 25న, ప్యారిస్‌లో పాతిక రోజుల ముందు క్రిస్మస్ చేస్తారా! అనే డౌటొచ్చిందా? అదేం కాదు. కాజల్ అగర్వాల్ ‘ప్యారిస్ ప్యారిస్’ అనే తమిళ సినిమా చేస్తున్నారిప్పుడు. హిందీ హిట్ ‘క్వీన్’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. కంగనా రనౌత్ పాత్రలో కాజల్ నటిస్తున్నారు. ఇప్పుడీ సిన్మా షూటింగ్ ప్యారిస్‌లో జరుగుతోంది. అందులో భాగంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట! ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ప్యారిస్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరో పది రోజులు అక్కడే చేస్తారట! నటుడు రమేశ్ అరవింద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా సంగతి పక్కన పెడితే... తెలుగు ‘క్వీన్’ రీమేక్‌లో తమన్నా టైటిల్ రోల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ‘క్వీన్’కి నీలకంఠ దర్శకుడు.