16, 17 తేదీల్లో రెజ్లింగ్‌ టోర్నీ | wrestling event held in LB stadium on 16 and 17 | Sakshi
Sakshi News home page

16, 17 తేదీల్లో రెజ్లింగ్‌ టోర్నీ

Published Wed, Feb 15 2017 12:38 PM | Last Updated on Sun, Apr 7 2019 3:34 PM

16, 17 తేదీల్లో రెజ్లింగ్‌ టోర్నీ - Sakshi

16, 17 తేదీల్లో రెజ్లింగ్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో రెజ్లింగ్‌ పోటీలు జరగనున్నట్లు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఆరు విభాగాల్లో ఈ కుస్తీ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ పోటీల్లో దాదాపు 200 మంది రెజ్లర్లు తలపడనున్నట్లు పేర్కొన్నారు.

క్రీడాభిమానులు ఈ పోటీలకు హాజరై క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్యక్షులు కె. రంగారావు, ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌రాజ్, రెజ్లింగ్‌ సభ్యులు చంద్రశేఖర్, జాఫర్, విజయ్‌కుమార్‌ యాదవ్, హబీబ్, మోహిన్‌ అలీఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement