
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరులో ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఇఫ్తార్ విందులో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని కలెక్టర్ కోన శశిధర్ శుక్రవారం తెలిపారు. నగరంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.