కారులో రచ్చ చేసిన హీరోయిన్‌.. నెక్స్ట్‌ టార్గెట్‌ విజయ్‌? | Aditi Shankar Dance For Vijay's Leo Song - Sakshi
Sakshi News home page

Aditi Shankar: అదితి శంకర్‌ రచ్చ.. నెక్స్ట్‌ టార్గెట్‌ విజయ్‌? అంటూ కామెంట్స్‌..

Published Wed, Sep 6 2023 10:03 AM | Last Updated on Wed, Sep 6 2023 10:29 AM

Aditi Shankar Dance on Vijay Leo Song - Sakshi

అదితి శంకర్‌ పేరు ఈ మధ్య తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది. దర్శకుడు శంకర్‌ వారసురాలు అయిన ఈమె నటనపై ఆసక్తితో తల్లిదండ్రులను ఒప్పించి మరీ హీరోయిన్‌గా పరిచయం అయిన విషయం తెలిసిందే. కార్తీకి జంటగా విరుమాన్‌ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన అదితి శంకర్‌ ఆ తరువాత మావీరన్‌ చిత్రంలో శివకార్తికేయన్‌ సరసన నటించింది. ఈ రెండు చిత్రాలతో విజయాలను, వరుసగా అవకాశాలను అందుకుంటోంది.

ప్రస్తుతం విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో ఆకాశ్‌ మురళికి జంటగా నటిస్తోంది. తాజాగా హీరో విష్ణువిశాల్‌ సరసన నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. దీనికి రాక్షసన్‌ చిత్రం ఫేమ్‌ రామ్‌ కుమార్‌ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. తదుపరి సుధా కొంగర దర్ళకత్వంలో సూర్యతో జత కట్టనున్నట్లు టాక్‌. ఇలా అదితి శంకర్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి.

ఈ చలాకీ చిన్నదాని నెక్స్ట్‌ టార్గెట్‌ దళపతి అంటున్నారు. అదితి తాజాగా రోల్స్‌ రాయిస్‌ కారులో వెళ్తూ విజయ్‌ 'లియో' చిత్రంలోని నా వరువా పాటకు ఆడి రచ్చ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీంతో అదితి శంకర్‌ తదుపరి టార్గెట్‌ విజయా? అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరైతే ఇది మరీ ఓవర్‌ గా లేదూ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఏదేమైనా అదితి శంకర్‌ కి ఇది కూడా ఒక రకమైన పబ్లిసిటీ అవుతోంది.

చదవండి: హౌస్ అంతా గరంగరం.. ఆ ఎనిమిది మంది నామినేట్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement