Aditi Shankar Mesmerizes With Mint Green Lehenga, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Aditi Shankar: లెహంగాలో అదితి శంకర్‌ వయ్యారాలు, మతి పోగొడుతున్న పోజులు

Published Mon, May 8 2023 7:09 AM | Last Updated on Mon, May 8 2023 10:34 AM

Aditi Shankar Mesmerizes in Lehenga Pics - Sakshi

ప్రముఖ దర్శకుడు శంకర్‌ వారసురాలు అదితి శంకర్‌. వైద్య వృత్తి చేపట్టాల్సిన ఈమె.. నటిగా రంగప్రవేశం చేయడానికి సిద్ధమయ్యారు. ఆమె ఇష్టానికి తండ్రి దర్శకుడు శంకర్‌ కూడా ఓటేశారు. ఇంకేముంది వెంటనే అదితి శంకర్‌ కార్తీకి జంటగా విరుమాన్‌ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం మంచి సక్సెస్‌ ఇవ్వడంతో పాటు, ప్రశంసలను అందించింది. ప్రస్తుతం శివకార్తికేయన్‌కు జంటగా మా వీరన్‌ చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయం కాబోతోంది. మావీరన్‌ చిత్రం తెలుగులోనూ మహావీరుడు పేరుతో విడుదల కానుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జులై 24న తెరపైకి రానుంది. కాగా నటి ఆదితి శంకర్‌ మరో రెండు తమిళ చిత్రాలలో కమిట్‌ అయ్యింది. అందులో ఒకటి నటుడు విష్ణువిశాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం. మరొకటి నటుడు అధర్వ సోదరుడు ఆకాశ్‌ మురళి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం. ఈ రెండు త్వరలో సెట్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి.

ఇకపోతే నటి ఆదితి శంకర్‌ తరచూ సామాజిక మాధ్యమాల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. తద్వారా సినీ దర్శక నిర్మాతలను ఆకర్షించడంతో పాటు అభిమానులను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక గ్లామర్‌ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ప్రత్యేకంగా ఫొటో షూట్‌ నిర్వహించుకుని మరి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తోంది. అలా తాజాగా యాష్‌ కలర్‌ లెహంగా ధరించి అందాలను మెరుగుపరచుకుని తీయించుకున్న ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

చదవండి: ఆర్య సినిమా చేయనన్న శివబాలాజీ, ఎందుకో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement