ఛాన్స్‌ అడిగి మరీ సినిమాలో పాట పాడిన హీరోయిన్‌ | Maaveeran Movie: Aditi shankar Songs Song with Sivakarthikeyan | Sakshi
Sakshi News home page

Aditi shankar: హీరోతో కలిసి పాట పాడిన హీరోయిన్‌..

Published Fri, Jun 16 2023 6:17 PM | Last Updated on Fri, Jun 16 2023 6:17 PM

Maaveeran Movie: Aditi shankar Songs Song with Sivakarthikeyan - Sakshi

ప్రతిభ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. బ్యాగ్రౌండ్‌ ఉన్నా కూడా అవకాశాలు వాటంతటవే వస్తాయి. ఇక్కడ రెండవ స్ట్రాటజీ ఉపయోగించింది హీరోయిన్‌ అదితి శంకర్‌. ఈమె స్టార్‌ దర్శకుడు శంకర్‌ వారసురాలు అన్న విషయం తెలిసిందే కదా! వైద్య విద్యను చదివి, చిత్ర రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఇప్పటికే విరుమాన్‌ సినిమాతో కథానాయకిగా పరిచయమై సక్సెస్‌ కూడా అందుకుంది. అంతేకాకుండా ఆ చిత్రంలో ఒక పాట కూడా పాడి తనలో మంచి గాయని ఉన్నారని నిరూపించుకుంది.

విశేషం ఏమిటంటే ఈమె పాడిన ఆ పాటను ముందు వేరే గాయనితో పాడించారు. అది దర్శక, నిర్మాతలకు సంతృప్తి కలిగించకపోవడంతో మళ్లీ ఆదితిశంకర్‌తో పాడించారు. అలా అది ఓకే అయింది. కాగా ప్రస్తుతం ఆదితిశంకర్‌ శివకార్తికేయన్‌కు జంటగా మావీరన్‌ చిత్రంలో నటిస్తోంది. అశ్విన్‌ మడోనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.  ఇందులోనూ ఆదితిశంకర్‌ ఒక పాట పాడడం విశేషం.

శివకార్తికేయన్‌తో కలిసి పాడిన 'వణ్ణార్‌ పైట్టెయిల్‌..' అనే పల్లవితో సాగే ఈ పాటను బుధవారం విడుదల చేయగా సంగీత ప్రియుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీని గురించి ఆదితిశంకర్‌ మాట్లాడుతూ.. ఇది తాను పాడిన రెండవ పాట అని పేర్కొంది. ఇంతకుముందు విరుమాన్‌ చిత్రంలో మదురై వీరన్‌ అనే పల్లవితో సాగే గ్రామీణ టచ్‌ వున్న పాటను పాడానని, అందులో తన గొంతు డిఫరెంట్‌గా ఉంటుందని తెలిపింది. తాజాగా మావీరన్‌ చిత్రంలో చక్కని రొమాంటిక్‌ పాటను పాడినట్లు చెప్పారు.

ఈ పాటను శివకార్తికేయన్‌తో కలిసి పాడడం మంచి అనుభవం అని చెప్పుకొచ్చింది. ఈ పాట పాడే అవకాశాన్ని తానే కోరానని చెప్పింది. తాను చిన్న వయసు నుంచే సంగీతాన్ని నేర్చుకుంటున్నానని, పాడడంపై ఆసక్తి ఉండడంతో తాను నటించే చిత్రాల్లో ఒక్క పాటైనా పాడే అవకాశం కలిగించాలని అడుగుతానని తెలిపింది. అందులో భాగంగానే ఈ చిత్రంలో పాట పాడానంది. అయితే ఇకపై నటించే చిత్రాలలో కంటిన్యూగా పాడతానా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేనంది ఆదితిశంకర్‌.

చదవండి: సినిమా బాలేదన్నందుకు చితక్కొట్టిన ఫ్యాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement