యాక్షన్‌... థ్రిల్‌ | Akash Murali Premistava movie Trailer launch | Sakshi
Sakshi News home page

యాక్షన్‌... థ్రిల్‌

Jan 29 2025 2:37 AM | Updated on Jan 29 2025 2:37 AM

Akash Murali Premistava movie Trailer launch

ఆకాశ్‌ మురళి(Akash Murali), అదితీ శంకర్‌ జంటగా ‘పంజా’ ఫేం విష్ణువర్ధన్‌ దర్శకత్వం వహించిన రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ప్రేమిస్తావా’. ‘నేసిప్పాయా’ పేరుతో తమిళంలో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగులో ‘ప్రేమిస్తావా’(Premistava) పేరుతో ఈ నెల 30న విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ శశి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా మేకింగ్, ఆర్‌ఆర్‌ చాలా బాగున్నాయి’’ అని చెప్పారు.

‘‘ప్రస్తుతం సమాజంలో బంధాలు ఎలా ఉన్నాయి? అనేది మా చిత్రం చూపిస్తుంది’’ అన్నారు విష్ణువర్ధన్‌. ‘‘ప్రేమిస్తావా’ని అందరూ సపోర్ట్‌ చేయాలి’’ అని సహ నిర్మాత స్నేహ బ్రిట్టో కోరారు. ‘‘నా తొలి సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ విడుదల చేయడం నా అదృష్టం’’ అని చెప్పారు ఆకాశ్‌ మురళి. ‘‘ఈ చిత్రంలో ప్రేమ, యాక్షన్, రొమాన్స్‌ ఉన్నాయి’’ అని తెలిపారు అదితీ శంకర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement