పీరియాడికల్‌ ఫిల్మ్‌లో... | Karthi Next Film Announced With Director Tamizh Of Taanakkaran Fame | Sakshi
Sakshi News home page

పీరియాడికల్‌ ఫిల్మ్‌లో...

Published Mon, Sep 16 2024 12:16 AM | Last Updated on Mon, Sep 16 2024 12:16 AM

Karthi Next Film Announced With Director Tamizh Of Taanakkaran Fame

కార్తీ హీరోగా నటించనున్న కొత్త సినిమా ప్రకటన ఆదివారం వెలువడింది. ఈ భారీ పీరియాడికల్‌ ఫిల్మ్‌కు ‘టానాక్కారన్‌’ ఫేమ్‌ తమిళ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు, ఇషాన్‌ సక్సేనా, సునీల్‌ షా, రాజా సుబ్రమణియన్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు.

కార్తీ కెరీర్‌లో 29వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘‘భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ మొదలయ్యాయి. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాం. 2025లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రానికి చెందిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement