
ప్రతిభ ఎంత ఉన్నా, అదృష్టం మాత్రం చాలా అవసరం. అలా అదృష్టాన్ని ఒళ్లో పెట్టుకు తిరుగుతున్న నటి మాళవిక మోహన్. ఈ మాలీవుడ్ నట జీవితం ఏడేళ్లు. ఇప్పటికి నటించింది మాత్రం ఎనిమిది చిత్రాలే. అందులో మలయాళం, కన్నడం, తెలుగు, హిందీ భాషలకు చెందిన చిత్రాలున్నాయి. త్వరలో మిగిలిన దక్షిణాది భాష తెలుగులో కూడా నటించేస్తే పరిపూర్ణ భారతీయ నటిగా గుర్తింపు పొందేస్తుంది. ఇప్పటికే తరచూ గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తూ హాట్ నటిగా ముద్ర వేసుకుంటోంది. ఇకపోతే తమిళంలో మాళవిక మోహన్ ఎదుగుదల చాలా వేగంగా సాగుతోంది. గత ఏడాదే రజనీకాంత్ హీరోగా నటించిన పేట చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అందులో రజనీకాంత్ స్నేహితుడు శశికుమార్ అర్ధాంగిగా నటించింది. అది గ్లామర్ పాత్ర కాకున్నా ఆ తరువాత సూపర్ ఆఫర్‌ను కొట్టేసింది. అదే విజయ్‌తో రొమాన్స్ చేస్తున్న మాస్టర్ చిత్రం. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చదవండి: ఆత్మరక్షణ విద్యల్లో నాయికలు
కాగా మలి చిత్రం నిర్మాణంలో ఉండగానే మాళవిక మోహన్ మరో సూపర్ ఆఫర్‌ను దక్కించుకుందన్నది తాజా సమాచారం. నటుడు కార్తీతో డ్యూయెట్లు పాడడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. కార్తీకి జంటగా ఆమె నటించనుందన్నది తాజా సమాచారం. ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. అయితే మాస్టర్ చిత్రాన్ని పూర్తి చేసి మాళవిక మోహన్ కార్తీతో రొమాన్స్‌కు సిద్ధం అవుతోందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తం మీద మాళవిక కోలీవుడ్‌లో స్టార్స్‌తో జతకట్టే అవకాశాలను కొట్టేస్తోందన్నమాట. చదవండి: వారి మనసు దోచడానికి గ్లామర్ అవసరం
Comments
Please login to add a commentAdd a comment