Ponniyin Selvan Singer Bamba Bakya Dies At 49 In Chennai - Sakshi
Sakshi News home page

Bamba Bakya : కోలీవుడ్‌ సింగర్‌ ఆకస్మిక మృతి వెనుక కారణాలేంటి?

Published Fri, Sep 2 2022 3:05 PM | Last Updated on Fri, Sep 2 2022 3:27 PM

Ponniyin Selvan Singer Bamba Bakya Dies At 49 In Chennai - Sakshi

సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కోలీవుడ్‌ సింగర్‌ బాంబా బాక్య(48)కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మృతికి గల కారణాలు ఇంకా తెలయరాలేదు. కానీ ఆయన గుండెపోటుతో మరణించినట్లు తమిళమీడియాలో వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ పాడిన బాంబా బాక్య 'రోబో 2.0' చిత్రంలో 'పుల్లినంగ‌ల్' సాంగ్‌తో ఇండస్ట్రీలోకి అడుపెట్టారు.

ఆ తర్వాత 'స‌ర్కార్' చిత్రంలో 'సింతాంగ‌రం', పొన్నియిన్ సెల్వ‌న్‌లో 'పొన్నిన‌ది' వంటి సూపర్‌ హిట్‌ పాటలతో తమిళనాడు పాపులారిటీ దక్కించుకున్నారు. కాగా బాంబా బాక్య మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికాగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాంబే ఆసక్మిక మరణం బాధ కలిగించింది. ఈ నష్టాన్ని, బాధను తట్టుకునే శక్తిని ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను అంటూ హీరో కార్తీ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement