ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. చోళరాజులు ఇతివృత్తంతో రూపొందిన భారీ చారిత్రాత్మక కథతో దర్శకుడు మణిరత్నం దీన్ని రూపొందిస్తున్నారు. విక్రమ్, జయం రవి, కార్తీ, విక్రమ్ ప్రభు, పార్తీపన్, ప్రభు, శరత్‌కుమార్, రఘు, ఐశ్వర్యారాయ్, త్రిష వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహా్మన్ సంగీతాన్ని, రవివర్మ ఛాయాగ్రహణం అందించారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతోంది.
చదవండి: లారెన్స్ షాకింగ్ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’
దీంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే చిత్ర ఆడియో, ట్రైలర్లను విడుదల చేశారు. కాగా శనివారం సాయంత్రం చెన్నైలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ ఇంతకుముందు ఎంజీఆర్, శివాజీ గణేశన్ నటించిన చారిత్రక కథా చిత్రాలలో ఉపయోగించిన ఆభరణాలు గ్రీకు సాంప్రదాయానికి చెందినవన్నారు. అయితే తాను చాలా పరిశోధనలు చేసి ఈ చిత్రంలో ఆభరణాలను ఉపయోగించానని తెలిపారు. నిజానికి రాజులు యుద్ధానికి వెళ్లేటప్పుడు ఆభరణాలు కాకుండా తోలు దుస్తులు ధరించి వెళ్లేవారన్నారు.
ఈ చిత్రంలో తాను అలానే చేశానని తెలిపారు. ఇందులో మొదట స్వచ్ఛమైన తమిళ సంభాషణలనే రచయిత జయమోహన్ రాశారన్నారు. అయితే వాటిని నటులు ఉచ్ఛరించడం కష్టంగా మారడం, భావోద్రేకాలు సరిగా రాకపోవడంతో సరళమైన భాషను వాడామని చెప్పారు. ఇకపోతే ఇందులో రజనీకాంత్ నటిస్తానని చెప్పగానే అంగీకరిస్తే ఆయన, రచయిత కల్కి, అభిమానుల మధ్య చిక్కుకునేవారన్నారు. తగిన నటీనటులనే ఈ చిత్రానికి ఎంపిక చేశామన్నారు. రెండవ భాగం కూడా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, మరో తొమ్మిది నెలల తరువాత పార్ట్–2 విడుదల చేస్తామని తెలిపారు.
చదవండి: డైరెక్టర్‌తో మనస్పర్థలు? రజనీ ‘జైలర్’ నుంచి తప్పుకున్న హీరోయిన్!
నటుడు కార్తీ మాట్లాడుతూ గుర్రాలను, ఏనుగులను చూడడానికి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షిస్తారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. త్రిష, ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించేటప్పుడు భయం, బాధ్యతగా ఉండాలన్నారు. నటి త్రిష మాట్లాడుతూ కుందవై పాత్ర కోసం 6 నెలల ముందు నుంచే కొన్ని రిఫరెన్స్‌తో సిద్ధమయ్యానన్నారు. ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. నటుడు జయం రవి మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించిన అనుభవం భవిష్యత్‌లో చాలా ఉపగయోగపడుతుందన్నారు. ఇందులో తన తండ్రి, తాను కలిసి నటించడం సంతోషకరమైన విషయం అని నటుడు విక్రమ్ ప్రభు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment