త్రిష ప్రత్యేక పూజలు | actress Trisha Special Puja in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

త్రిష ప్రత్యేక పూజలు

Published Mon, Aug 23 2021 12:46 AM | Last Updated on Mon, Aug 23 2021 12:47 AM

actress Trisha Special Puja in Madhya Pradesh - Sakshi

మధ్యప్రదేశ్‌లోని ఓ గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు హీరోయిన్‌ త్రిష. కానీ ఆమె ఈ పూజలు చేస్తున్నది తన కోసం కాదు... ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమా కోసం. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌ షూటింగ్‌ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఓర్చా లొకేషన్స్‌లో జరుగుతోంది. అక్కడ కార్తీ, త్రిష, ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు పాల్గొనగా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఓర్చా లోకేషన్‌లోనే కాకుండా మధ్యప్రదేశ్‌లోని వివిధ లొకేషన్స్‌లో ఈ నెలాఖరు వరకు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ షూటింగ్‌ జరుగుతుందని కోలీవుడ్‌ టాక్‌. విక్రమ్, ‘జయం’రవి, ఐశ్వర్యా రాయ్, ఐశ్వర్యా లక్ష్మీ, శరత్‌కుమార్, పార్తీబన్‌ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement