
మణిరత్నం
ప్లాట్‌ఫామ్ ఏదైనా కంటెంట్ బాగుంటే వీక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. అందుకే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా సిరీస్‌లు చేయడానికి సినిమా స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని కోలీవుడ్ సమాచారం. ‘నవరస’ (నవరసాలు) అనే థీమ్‌తో సాగే ఈ వెబ్ సిరీస్‌లో తొమ్మిది ఎపిసోడ్‌లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో డైరెక్టర్ డైరెక్ట్ చేస్తారు. మణిరత్నం, గౌతమ్ వాసుదేవ మీనన్, కార్తీక్ నరేన్, నంబియార్, అరవింద స్వామి ఒక్కో ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తారట. మిగతా ఎపిసోడ్స్‌కి చెందిన దర్శకుల ఎంపిక జరగలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment