Web Services
-
అమెజాన్ బంపరాఫర్, ఉచితంగా 500కోర్సులు..అస్సలు మిస్సవ్వద్దు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ విద్యార్ధులకు బంపరాఫర్ ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాల్లో ఉచితంగా శిక్షణనివ్వడంపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయంగా 2.9 కోట్ల మందికి 500 పైచిలుకు డిజిటల్ ట్రెయినింగ్ కోర్సులను ఉచితంగా అందిస్తున్నట్లు వివరించింది. ఇందుకోసం ఉన్నత విద్యా సంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వాలు, కంపెనీలు మొదలైన వాటితో ఏడబ్ల్యూఎస్ కలిసి పని చేస్తోంది. భారత్‌లో ఏడబ్ల్యూఎస్ రీ/స్టార్ట్ పేరిట ఉచితంగా 12 వారాల పూర్తి స్థాయి కోర్సును అందిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్‌లో కెరియర్‌కు ఇది ఉపయోగపడుతుంది. 2017 నుండి దేశీయంగా దాదాపు పది లక్షల మందికి శిక్షణనిచ్చినట్లు ఏడబ్ల్యూఎస్ వెల్లడించింది. చదవండి: ఈ కోర్సులు చదివితే జాబ్ గ్యారెంటీ..! అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే? -
అమెజాన్ సేవలకు అంతరాయం! కారణం ఏంటంటే..
Amazon Web Services Outage Details: అమెజాన్ వెబ్ సర్వీస్ పరిధిలోని వెబ్ సైట్లన్నింటికి కాసేపు విఘాతం ఏర్పడింది. అమెజాన్ షాపింగ్ సైట్‌తో పాటు ప్రైమ్ వీడియో, వెబ్ సర్వీసెస్‌కి అనుబంధంగా ఉన్న సైట్లు సైతం నిలిచిపోయాయి. క్రిస్మస్, ఇయర్ ఎండ్ సీజన్ కావడంతో షాపింగ్ ఊపులో ఉన్న యూజర్లు.. ఈ విఘాతంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి సమయం నుంచి అమెజాన్ వెబ్ సర్వీసులకు విఘాతం కలిగింది. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API) సంబంధిత సమస్యలతో ఈ విఘాతం ఏర్పడినట్లు అమెజాన్ వెల్లడించింది. అయితే ఈ విఘాతం అమెరికా కాలమానం ప్రకారం.. ఉదయం 10.40ని. కి ఏర్పడిందని, అమెరికా ఈస్ట్-1 రీజియన్ వరకే పరిమితమైందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అమెజాన్ వెబ్ సర్వీసుల అంతరాయంతో ఫేస్బుక్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీఫ్లస్, రాబిన్‌హుడ్ లాంటి యాప్స్ సేవలకు సైతం విఘాతం ఏర్పడింది. సుమారు 24 వేలమంది అంతరాయంపై ఫిర్యాదులు చేశారని అమెజాన్ కంపెనీ తన స్టేటస్ డాష్‌బోర్డులో పేర్కొంది. ఇదిలా ఉంటే అమెరికాలో ఇలా వెబ్ సంబంధిత సర్వీసులకు విఘాతం ఏర్పడడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూన్‌లో ఫాస్ట్లీ కంపెనీ (అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు పోటీ కంపెనీ) సేవలకు సైతం అంతరాయం ఏర్పడి.. రెడ్డిట్, అమెజాన్, సీఎన్ఎన్, పేపాల్, స్పోటీఫై, అల్ జజీరా మీడియా నెట్వర్క్, ది న్యూయార్క్ టైమ్స్‌లు కొద్దిగంటల పాటు నిలిచిపోయాయి. చదవండి: అమెజాన్ బాస్ పెద్ద మనసు.. భారీగా సొమ్ము దానం! -
తెలంగాణ చరిత్రలోనే అత్యంత భారీ పెట్టుబడి
-
అమెజాన్ పెట్టుబడి రూ. 20761కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో పేరొందిన అమెజాన్.. ‘అమెజాన్ వెబ్ సర్వీసెస్’ ద్వారా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ ఏర్పాటుకు రూ.20,761 కోట్లు పెట్టుబడిగా పెడుతోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆసియా పసిఫిక్ రీజియన్‌కు హైదరాబాద్ కేంద్ర స్థానంగా ఉంటుంది. ఈ రీజియన్ పరిధిలో 3 అవైలబిలిటీ జోన్లు, ఒక్కో జోన్ పరిధిలో అనేక డేటా సెంటర్లు ఉంటాయి. ఆసియా పసిఫిక్ రీజియన్ నుంచి అమెజాన్ వెబ్ సర్వీసెస్ 2022 ప్రథమార్ధంలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముంది. స్థానికంగా ఏర్పాటయ్యే డేటా సెంటర్లన్నీ ఒకే రీజియన్‌లో పరిధిలో ఉన్నా దేనికదే స్వతంత్రంగా పనిచేస్తాయి. తద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం, వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ ఉంటుందని అమెజాన్ వెల్లడించింది. డేటా సెంటర్లకు ఆకర్షణీయ కేంద్రం.. డేటా సెంటర్ల ఏర్పాటుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏకంగా రూ.20,761 కోట్లతో (2.77 బిలియన్ డాలర్లు) మూడు చోట్ల అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేస్తోంది. దీంతో రాబోయే డేటా సెంటర్ల పెట్టుబడులకు రాష్ట్రం ఆకర్షణీయ గమ్యస్థానంగా పనిచేస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీ సెస్ వంటి డేటా సెం టర్ల ద్వారా రాష్ట్ర డిజి టల్ ఎకానమీ, ఐటీ రంగం అనేక రెట్లు వృద్ధి సాధించే అవకాశముంది. అమెజాన్ ఆసియా పసిఫిక్ రీజియన్ వెబ్ సర్వీసెస్ మూలంగా వేలాది మంది ఐటీ డెవలపర్లు, స్టార్టప్‌లు, ఐటీ కంపెనీలతో పాటు విద్య, ఇతర రం గాల్లో పనిచేసే ప్రభుత్వేతర సంస్థలు, కంపెనీలు వెబ్ ఆధారిత సేవలు అందించడం సులభతరం కానుంది. మరోవైపు ఈ కామర్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, ఇతర రంగాల్లో కార్యకలాపాల విస్తృతి పెరిగే అవకాశముంది. ప్రభుత్వ విధానాల వల్లే.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడులకు సంబం ధించి గతంలో దావోస్ పర్యటన సందర్భంగా ఆ సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధులతో చర్చించాం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే. అమెజాన్ వెబ్ సర్వీసెస్ నిర్ణయం ఫలితంగా ఇతర కంపెనీలు కూడా రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు మొగ్గు చూపే అవకాశముంది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక, వేగవంతమైన విధానాల వల్లే భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఐటీ రంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా ఇప్పటికే ఇన్నొవేటివ్ స్టార్టప్‌లు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు తెలంగాణ కేంద్ర బిందువుగా మారింది. అమెజాన్ ఇదివరకే తన అతిపెద్ద కార్యాలయానికి హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకున్న విషయం తెలిసిందే. – కేటీ రామారావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి -
మణిరత్నం నవరస!
ప్లాట్‌ఫామ్ ఏదైనా కంటెంట్ బాగుంటే వీక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. అందుకే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా సిరీస్‌లు చేయడానికి సినిమా స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని కోలీవుడ్ సమాచారం. ‘నవరస’ (నవరసాలు) అనే థీమ్‌తో సాగే ఈ వెబ్ సిరీస్‌లో తొమ్మిది ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో డైరెక్టర్ డైరెక్ట్ చేస్తారు. మణిరత్నం, గౌతమ్ వాసుదేవ మీనన్, కార్తీక్ నరేన్, నంబియార్, అరవింద స్వామి ఒక్కో ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తారట. మిగతా ఎపిసోడ్స్‌కి చెందిన దర్శకుల ఎంపిక జరగలేదని సమాచారం. -
జీరో రేటెడ్ ప్లాన్స్ సరికాదు-ఐఏఎంఏఐ
న్యూఢిల్లీ: జీరో రేటెడ్ ప్లాన్స్‌పై ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) విముఖత వ్యక్తంచేసింది. జీరో రేటెడ్ ప్లాన్స్ ఏ రూపంలో ఉన్న కూడా తాము వాటికి వ్యతిరేకమని పేర్కొంది. అలాంటి ప్లాన్స్ వల్ల ఆన్లైన్ కంటెంట్‌కు ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. అలాగే కొన్ని వెబ్ సర్వీసులు టెల్కోల వివక్షతకు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొంది.