ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ విద్యార్ధులకు బంపరాఫర్ ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాల్లో ఉచితంగా శిక్షణనివ్వడంపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది.
అంతర్జాతీయంగా 2.9 కోట్ల మందికి 500 పైచిలుకు డిజిటల్ ట్రెయినింగ్ కోర్సులను ఉచితంగా అందిస్తున్నట్లు వివరించింది. ఇందుకోసం ఉన్నత విద్యా సంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వాలు, కంపెనీలు మొదలైన వాటితో ఏడబ్ల్యూఎస్ కలిసి పని చేస్తోంది.
భారత్‌లో ఏడబ్ల్యూఎస్ రీ/స్టార్ట్ పేరిట ఉచితంగా 12 వారాల పూర్తి స్థాయి కోర్సును అందిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్‌లో కెరియర్‌కు ఇది ఉపయోగపడుతుంది. 2017 నుండి దేశీయంగా దాదాపు పది లక్షల మందికి శిక్షణనిచ్చినట్లు ఏడబ్ల్యూఎస్ వెల్లడించింది.
చదవండి: ఈ కోర్సులు చదివితే జాబ్ గ్యారెంటీ..! అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?
Comments
Please login to add a commentAdd a comment