Girija Shettar Life Story In Telugu: తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రేమకథా చిత్రాల్లో 'గీతాంజలి' సినిమా ముందు వరుసలో ఉంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. 1989లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా మణిరత్నం దర్శకత్వం వహించిన ఒకే ఒక్కతెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా హీరో, హీరోయిన్లుగా ఇద్దరికీ ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా అనంతరం గిరిజ తెలుగులో ఎక్కడా కనిపించలేదు.
కళ్లతోనే హావభావాలు పలికించి తెలుగు ప్రేక్షకుల మదిలో గీతాంజలిగా చోటు సంపాదించుకున్న గిరిజ పూర్తి పేరు గిరిజా ఎమ్మా జేన్ షెత్తార్. తన పద్దెనిమిదవ ఏటనే భరతనాట్యం నేర్చుకున్న గిరిజ.. క్రికెటర్ శ్రీకాంత్ చెల్లెలితో కలిసి మణిరత్నం, సుహాసినిల పెళ్లికి గిరిజ కూడా అటెండ్ అయ్యింది. పెళ్లిలో గిరిజను చూసిన మణిరత్నం తన సినిమాలో హీరోయిన్‌గా నటించమని కోరడంతో వెంటనే ఓకే చెప్పిందట.
తెలుగులో గిరిజ నటించిన ఒకే ఒక్క చిత్రం గీతాంజలి. కానీ ఒక్క సినిమాతోనే వంద సినిమాలంత స్టార్‌డంను సంపాదించుకుంది గిరిజ. ఆ సమయంలోనే మలయాళంలో కొన్ని చిత్రాలు కూడా పూర్తి చేసింది. అనంతరం సినిమాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పిన గిరిజ ప్రస్తుతం లండన్‌లో రచయితగా స్థిరపడింది. 2005 నుంచి ఆరోగ్యం సంబంధాలపై జర్నలిస్ట్‌గా పనిచేస్తుంది.
చదవండి : Trisha: ఆలయంలో చెప్పులు వేసుకున్న త్రిష..భగ్గుమన్న హిందూ సంఘాలు
ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా..సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment