Geethanjali film
-
'గీతాంజలి మళ్లీ వచ్చింది'.. టాలీవుడ్ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా!
అంజలి టైటిల్ రోల్లో, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అంజలి, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఎన్నడు లేని విధంగా ఆడియన్స్‌కు షాకింగ్ న్యూస్ ఇచ్చారు. ఈనెల 24న రాత్రి 7 గంటలకు బేగంపేట్ శ్మశాన వాటికలో టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు లేని విధంగా ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. దీంతో శ్మశాన వాటికలో టీజర్ లాంఛ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట్ స్మశాన వాటికలో ⚰️ గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ 🥶👻 Brace Yourselves for a Never Before Event In Telugu Cinema ❄️🔥#GeethanjaliMalliVachindhi #Anjali50 @yoursanjali @konavenkat99 @MP_MvvOfficial #GV #ShivaTurlapati @Plakkaraju… pic.twitter.com/dAqb09Vddh — Telugu FilmNagar (@telugufilmnagar) February 22, 2024 -
'గీతాంజలి' హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
Girija Shettar Life Story In Telugu: తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రేమకథా చిత్రాల్లో 'గీతాంజలి' సినిమా ముందు వరుసలో ఉంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. 1989లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా మణిరత్నం దర్శకత్వం వహించిన ఒకే ఒక్కతెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా హీరో, హీరోయిన్లుగా ఇద్దరికీ ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా అనంతరం గిరిజ తెలుగులో ఎక్కడా కనిపించలేదు. కళ్లతోనే హావభావాలు పలికించి తెలుగు ప్రేక్షకుల మదిలో గీతాంజలిగా చోటు సంపాదించుకున్న గిరిజ పూర్తి పేరు గిరిజా ఎమ్మా జేన్ షెత్తార్. తన పద్దెనిమిదవ ఏటనే భరతనాట్యం నేర్చుకున్న గిరిజ.. క్రికెటర్ శ్రీకాంత్ చెల్లెలితో కలిసి మణిరత్నం, సుహాసినిల పెళ్లికి గిరిజ కూడా అటెండ్ అయ్యింది. పెళ్లిలో గిరిజను చూసిన మణిరత్నం తన సినిమాలో హీరోయిన్గా నటించమని కోరడంతో వెంటనే ఓకే చెప్పిందట. తెలుగులో గిరిజ నటించిన ఒకే ఒక్క చిత్రం గీతాంజలి. కానీ ఒక్క సినిమాతోనే వంద సినిమాలంత స్టార్డంను సంపాదించుకుంది గిరిజ. ఆ సమయంలోనే మలయాళంలో కొన్ని చిత్రాలు కూడా పూర్తి చేసింది. అనంతరం సినిమాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పిన గిరిజ ప్రస్తుతం లండన్‌లో రచయితగా స్థిరపడింది. 2005 నుంచి ఆరోగ్యం సంబంధాలపై జర్నలిస్ట్‌గా పనిచేస్తుంది. చదవండి : Trisha: ఆలయంలో చెప్పులు వేసుకున్న త్రిష..భగ్గుమన్న హిందూ సంఘాలు ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా..సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్ -
నాకిది చాలా స్పెషల్
‘‘ఈ ‘గీతాంజలి’ సినిమా నాకు చాలా స్పెషల్. ఇందులో పాత్ర నచ్చి వెంటనే డేట్లు ఇచ్చేశాను. నా కెరీర్లోనే ఈ సినిమా ఓ మైలురాయిలా నిలిచిపోతుంది’’ అని అంజలి చెప్పారు. అంజలి, శ్రీనివాసరెడ్డి, హర్షవర్థన్ రాణే, బ్రహ్మానందం, రావు రమేష్ ముఖ్య తారలుగా కోన వెంకట్ సమర్పణలో రాజకిరణ్ దర్శకత్వంలో ఎమ్.వి.వి. సత్యనారాయణ నిర్మించిన ‘గీతాంజలి’ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కోన వెంకట్ మాట్లాడుతూ -‘‘అంజలి ఒప్పుకోకపోయుంటే మేం ఈ సినిమానే చేసి ఉండేవాళ్లం కాదు. హారర్ కామెడీ కథ ఇది. నా ప్రతి సినిమాలోనూ బ్రహ్మానందంగారికి ఓ స్పెషల్ రోల్ ఉంటుంది. ఇందులో ఆయన ఓ మంచి రోల్‌తో పాటు, ఓ స్పెషల్ సాంగ్ చేశారు. రాజకిరణ్ అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని తెలిపారు. నటుడు హర్షవర్థన్, పంపిణీదారుడు హరి తదితరులు కూడా పాల్గొన్నారు.