
చెన్నై: పొన్నియన్ సెల్వన్ చిత్ర యూనిట్ గ్వాలియర్‌లో మకాం పెట్టింది. దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చారీత్రాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్. లైకా ప్రొడక్షన్స్, మణిరత్నం మెడ్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, ప్రకాష్‌రాజ్, విక్రమ్‌ప్రభు తదితరులు నటిస్తున్నారు. ఇటీవల పుదుచ్చేరి, హైదరాబాద్‌లో పలు సన్నివేశాలను చిత్రీకరించారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కోసం దర్శకుడు మణిరత్నం, నటుడు కార్తీ, ప్రకాష్‌రాజ్ తదితరులు గ్వాలియర్ నగరానికి వెళ్లారు. అక్కడ మణిరత్నం, కార్తీలతో దిగిన ఫొటోలను నటుడు ప్రకాష్‌రాజ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
BACK to work .. landed in Gwalior with #Maniratnam sir @Karthi_Offl on our way to Orchha for #PonniyinSelvan .. pic.twitter.com/0RjfonSc4l
— Prakash Raj (@prakashraaj) August 18, 2021
చదవండి : సెట్‌లో పూజా తీరుపై మండిపడ్డ ప్రముఖ డైరెక్టర్
Crazy Uncles: వివాదంలో శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్’!