దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. ఆయన డ్రిమ్ ప్రాజెక్ట్‌గా రూపొందించిన ఈసినిమా రెండు భాగాలుగా రానుంది. పొన్నియన్ సెల్వన్ తొలి పార్ట్ భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందే గురువారం దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడినంటూ చెప్పుకునే ఉమైర్ సంధూ తొలి రివ్యూని ఇచ్చాడు. అది చూసిన మణిరత్నం భార్య, నటి సుహాసిని అతడిపై ఫైర్ అయ్యింది. కాగా పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ రివ్యూ ఇదేనంటూ ఉమైర్ నిన్న ట్వీట్ చేశాడు. ‘అద్భుతమైన సినిమాట్రోగాఫి, అంతకుమించిన ప్రొడక్షన్ డిజైన్, విఎఫ్‌ఎక్స్! చియాన్ విక్రమ్, కార్తి తమ నటనతో వావ్ అనిపించారు.
ఇక ఐశ్వర్యరాయ్ మంచి కంబ్యాక్ ఇచ్చారు. మొత్తానికి ఈ హిస్టారికల్ మూవీ ఎన్నో ట్విస్టులతో ప్రేక్షకుల చేత క్లాప్ కొట్టించడం ఖాయం’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ కాస్తా వైరల్ కావడంతో సుహాసిని కంట పడింది. అతడి రివ్యూపై స్పందిస్తూ.. ఇంతకి నువ్వు ఎవరు? అంటూ అసహనం వ్యక్తం చేసింది ఆమె. ‘అసలు మీరు ఎవరు?.. ఇంకా విడుదల కాని సినిమాను మీరు ఎలా చూశారు’ అంటూ సుహాసిని అతడిని ప్రశ్నించింది. ఇక ఉమైర్ సంధు రివ్యూపై సుహాసిని స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆమె కామెంట్స్ నెటిజ్లను స్పందిస్తూ అతడో ఫేక్ రివ్యూవర్ అని, దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిని అని చెప్పుకుంటూ ఫేక్ రివ్యూలు ఇస్తాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఉమైర్ సంధు తాను ఒవర్సిస్ సెన్సార్ సభ్యుడినంటూ తరచూ కొత్త సినిమాల రివ్యూను విడుదలకు ముందే ప్రకటిస్తుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment