Suhasini Mani Ratnam
-
తెలుగు సినిమాలు చేయడం అలవాటుగా మారింది: సుహాసిని
నా తొలి సినిమా విడుదలై నేటికి సరిగ్గా 43 ఏళ్ళు. ఇప్పటి వరకు కెరీర్లో ఎన్నో చిత్రాలు చేశాను. ఎన్నో జయపజయాలు చూశాను. అవన్నీ గతంలోనే వదిలేసి ఇప్పుడే తొలి చేస్తున్నా అనే అనుభూతితో ‘మహతి’ చేశాను. మహతి కథ, నా పాత్ర చాలా నచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉంటాయి. టైటిల్ కి తగట్టు మహిళా ప్రాధాన్యత గల చక్కని అంశాలు ఉన్నాయి’ అని సీనియర్ నటి సుహాసిని మణిరత్నం అన్నారు. సందీప్ మాధవ్ కథానాయకుడిగా శివ ప్రసాద్ స్వీయ దర్శక నిర్మాణంలో శ్రీ పద్మిని సినిమాస్ ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న చిత్రం 'మాహతి'. సుహాసిని మణిరత్నం, దీప్సిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ..తెలుగులో వరుసగా సినిమాలు చేయడం ఒక అలవాటుగా మారింది. ‘మహతి’లాంటి మంచి చిత్రంతో కెరీర్ పరంగా 44వ ఏడాదిని ప్రారంభిస్తున్నాను. ఒక క్రైమ్ చేయడం కంటే ఆ క్రైమ్ ని చూస్తూ ఏం చేయకుండా ఊరుకోవడం ఇంకా పెద్ద క్రైమ్. అదే ఈ సినిమా ప్రధానాంశం. ఇందులో ఉండే పాత్రలని అద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకుడు. చాలా మంచి టీం కలసి పని చేస్తున్నాం’ అని అన్నారు. డైరెక్టర్ శివ ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ కథని తీర్చిదిద్దారు.సుహాసిని గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అనందంగా ఉంది’అని హీరో సందీప్ మాధవ్ అన్నారు. ‘మహతి కథ అద్భుతంగా ఉంటుంది. ఇందులో నా పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’అని నటి దీప్సిక అన్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. -
హీరోతో కలిసి ఎంగిలి ఐస్‌క్రీమ్ తినమన్నారు.. ఇబ్బంది పడ్డా: సుహాసిని
ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోయిన్గా కొనసాగారు సుహాసిని. చిరంజీవి, బాలకృష్ణ, వెంటకేశ్ లాంటి బడా హీరోలందరితోనూ నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో తల్లి పాత్రతో పాటు సహాయక నటిగా చేస్తోంది. అయితే హీరోయిన్గా చేసినప్పుడు తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితుల గురించి తాజాగా ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుహాసిని మాట్లాడారు. ‘గతంలో హీరోయిన్గా చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కొన్ని అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తే..సున్నితంగా తిరస్కరించేదాన్ని. ఓ సినిమాలో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం ఉంది. అది చేయాలని డైరెక్టర్ చెబితే.. నేను నో చెప్పాను. పరాయి వ్యక్తి ఒడిలో కూర్చోవడం తప్పు..కాబట్టి నేను ఆ సీన్ చేయనని గట్టిగా వాధించాను. (చదవండి: స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్!) అదే సినిమాలో హీరో కలిసి ఐస్‌క్రీమ్ తినే సీన్ ఉంది. హీరో తిన్న ఐస్‌క్రీమ్‌నే తినాలని నాకు చెప్పారు. అది నాకు నచ్చలేదు. ‘వేరే వాళ్లు ఎంగిలి చేసింది నేను తినడం ఏంటి? ఐస్‌క్రీమ్ మార్చండి’అని ఫైర్ అయ్యాను. దీంతో కొరియోగ్రాఫర్ షాకయ్యారు. నేను చెప్పిన విధంగా చేయలని నాపైకి సీరియస్ అయ్యాడు. అయినా కూడా నేను అంగీకరించలేదు. ఐస్‌క్రీమ్ తినడం కాదు కదా కనీసం ముట్టుకోబోనని తెగేసి చెప్పారు. ఆ తర్వాత ఐస్‌క్రీమ్ మార్చారు’అని సుహాసిన చెప్పికొచిఉ్చంది. -
‘పొన్నియన్ సెల్వన్’పై ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ, మండిపడ్డ సుహాసిని
దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. ఆయన డ్రిమ్ ప్రాజెక్ట్‌గా రూపొందించిన ఈసినిమా రెండు భాగాలుగా రానుంది. పొన్నియన్ సెల్వన్ తొలి పార్ట్ భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందే గురువారం దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడినంటూ చెప్పుకునే ఉమైర్ సంధూ తొలి రివ్యూని ఇచ్చాడు. అది చూసిన మణిరత్నం భార్య, నటి సుహాసిని అతడిపై ఫైర్ అయ్యింది. కాగా పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ రివ్యూ ఇదేనంటూ ఉమైర్ నిన్న ట్వీట్ చేశాడు. ‘అద్భుతమైన సినిమాట్రోగాఫి, అంతకుమించిన ప్రొడక్షన్ డిజైన్, విఎఫ్ఎక్స్! చియాన్ విక్రమ్, కార్తి తమ నటనతో వావ్ అనిపించారు. ఇక ఐశ్వర్యరాయ్ మంచి కంబ్యాక్ ఇచ్చారు. మొత్తానికి ఈ హిస్టారికల్ మూవీ ఎన్నో ట్విస్టులతో ప్రేక్షకుల చేత క్లాప్ కొట్టించడం ఖాయం’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ కాస్తా వైరల్ కావడంతో సుహాసిని కంట పడింది. అతడి రివ్యూపై స్పందిస్తూ.. ఇంతకి నువ్వు ఎవరు? అంటూ అసహనం వ్యక్తం చేసింది ఆమె. ‘అసలు మీరు ఎవరు?.. ఇంకా విడుదల కాని సినిమాను మీరు ఎలా చూశారు’ అంటూ సుహాసిని అతడిని ప్రశ్నించింది. ఇక ఉమైర్ సంధు రివ్యూపై సుహాసిని స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆమె కామెంట్స్ నెటిజ్లను స్పందిస్తూ అతడో ఫేక్ రివ్యూవర్ అని, దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిని అని చెప్పుకుంటూ ఫేక్ రివ్యూలు ఇస్తాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఉమైర్ సంధు తాను ఒవర్సిస్ సెన్సార్ సభ్యుడినంటూ తరచూ కొత్త సినిమాల రివ్యూను విడుదలకు ముందే ప్రకటిస్తుంటాడు. -
అప్పుడు పెళ్లి ఆగిపోతుందేమోనని భయపడ్డా!
‘‘నలభై రెండేళ్లుగా మీరు (ప్రేక్షకులు) నాపై చూపించిన ప్రేమని ‘పొన్నియిన్ సెల్వన్’పై చూపించండి. ఈ సినిమా ఓ పది శాతం షూటింగ్ చెన్నైలో జరిగితే మిగిలినదంతా రాజమండ్రి, హైదరాబాద్‌లో చేశాం.. కాబట్టి ఇది మీ (తెలుగు) సినిమా.. మీరు ఆదరించాలి’’ అని నటి సుహాసినీ మణిరత్నం అన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ (‘పీయస్–1’). మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మించాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం ‘పీయస్–1’ ఈ నెల 30న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘దిల్’ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ– ‘‘పెళ్లికి ముందు మణిరత్నంగారు ఓ పెద్ద బ్యాగ్ నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. అందులో ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఐదు భాగాలుగా ఉంది. చదివి ఒక్క లైన్లో కథ చెప్పమన్నారు. నేను ఐదు భాగాలను చదివి ఐదు లైన్లుగా రాసి ఇచ్చాను. ఇలాగేనా రాసేది? అన్నారాయన. అప్పుడు మా పెళ్లి ఆగిపోతుందేమో? అని భయపడ్డాను.. కానీ పెళ్లయింది. మా పెళ్లయిన 34 ఏళ్లకి ‘పొన్నియిన్ సెల్వన్’ తీశారాయన. దానికి ముఖ్య కారణమైన సుభాస్కరన్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. ఐశ్వర్యా రాయ్ మాట్లాడుతూ– ‘‘పొన్నియిన్ సెల్వన్’ టీమ్‌తో ఇక్కడ ఉండటం గర్వంగా ఉంది. ప్రతిభావంతులైన మంచి యూనిట్‌తో పని చేయడం గౌరవంగా ఉంది. నా తొలి సినిమా (‘ఇద్దరు’) మణిరత్నం సార్‌తో చేశాను. ఆయన కలల ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’లోనూ భాగం కావడం హ్యాపీ’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో ఒక హీరోని పెట్టుకుని సినిమా తీయా లంటే చుక్కలు కనిపిస్తున్నాయి.. అలాంటిది ఇంతమంది హీరోలు, హీరోయిన్లని పెట్టి మణిరత్నంగారు ‘పొన్నియిన్ సెల్వన్’ని రెండు భాగాలుగా తీయడం గ్రేట్. ఇప్పుడు సినిమాకు ప్రాంతం, భాషతో సంబంధం లేదు.. బాగుంటే ఇండియా మొత్తం ఆదరిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కార్తికేయ 2’ చిత్రాల్లా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ కూడా ఇండియా మొత్తం అద్భుతం సృష్టిస్తుందని నమ్ముతున్నాను. ఇండియాలో రెహమాన్‌గారు ఉన్నారని చెప్పుకునేందుకు భారతీయుడిగా గర్వపడతాం’’ అన్నారు. ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ– ‘‘38 ఏళ్ల క్రితం నా ప్రయాణం తెలుగులో ప్రారంభమైంది. రమేశ్ నాయుడు, చక్రవర్తి, రాజ్–కోటి, సత్యంగార్లు సంగీతానికి ఒక పునాది వేశారు. ఇన్నేళ్లుగా నా సంగీతాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాని అందరూ చూసి, ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘‘పొన్నియిన్ సెల్వన్ ’ లాంటి మంచి టీమ్‌తో పని చేయడం హ్యాపీ. చాన్స్ ఇచ్చిన మణిరత్నం సార్‌కి థ్యాంక్స్’’ అన్నారు త్రిష. ‘‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో అందరూ హీరోలే, అందరూ హీరోయిన్లే. నా డ్రీమ్ డైరెక్టర్ మణిరత్నంగారు అంత అద్భుతంగా మా పాత్రలను తీర్చిదిద్దారు’’ అన్నారు విక్రమ్. ‘‘మణిరత్నంగారి నలభై ఏళ్ల కల ఈ సినిమా. ఇది ‘బాహుబలి’ సినిమాలా ఉంటుందా? అని అడుగుతున్నారు. ఒక ‘బాహుబలి’ని మనం చూశాం.. ఇంకో ‘బాహుబలి’ అవసరం లేదు. ఇండియాలో ఎన్నో కథలు ఉన్నాయి.. వాటిని మనం ప్రజలకు చెప్పాలి. ఇలాంటి ఒక గొప్ప సినిమాని మీరు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు కార్తీ. ‘‘మా నాన్న ఎడిటర్ మోహన్‌గారు ‘హిట్లర్, హనుమాన్ జంక్షన్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ వంటి చిత్రాలు నిర్మించారు. ‘పొన్నియిన్ సెల్వన్’ ఒక అద్భుతం’’ అన్నారు ‘జయం’ రవి. ఐశ్వర్యా లక్ష్మి, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
100 రోజుల్లో చేసి చూపిస్తా: కమల్
సాక్షి, చెన్నై: పదేళ్లలో చేయలేని పనుల్ని వందరోజుల్లో చేసి చూపిస్తానని మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ ధీమా వ్యక్తం చేశారు. భారత దేశానికే కోయంబత్తూరును ఆదర్శనగరంగా మార్చేస్తానని హామీ ఇచ్చారు. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో పోటీచేస్తున్న కమల్ ఆదివారం నియోజకవర్గంలో ఆగమేఘాలపై ప్రచారం చేశారు. రోడ్‌షో ద్వారా ప్రధాన మార్గాలు, చిన్న చిన్న వీధుల్లో సైతం దూసుకెళ్లారు. సినీ తరహా డైలాగులతో, రాజకీయఅంశాలతో, ప్రజాకర్షణ లక్ష్యంగా, ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ తాము ప్రకటించిన మేనిఫెస్టోను వివరిస్తూ ముందుకుసాగారు. పదేళ్లల్లో ఈ పాలకులు చేయలేని పనుల్ని వంద రోజుల్లో చేసి చూపిస్తానని ప్రకటించారు. ప్రజలు తనకు అండగా ఉంటే చాలు అని, మార్పు నినాదంతో రాష్ట్రం రూపురేఖల్ని మార్చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన సవాల్ విషయంగా కమల్ స్పందిస్తూ, తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన వానతీ శ్రీనివాసన్ ఓ డమ్మీ అంటూ, ఈ విషయంగా ప్రధాని మోదీతో చర్చించేందుకు సైతం సిద్ధం అని పేర్కొన్నారు. కమల్‌కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో సినీ నటి, ఆయన అన్న చారుహాసన్ కుమార్తె సుహాసిని సుడిగాలి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ, కమల్‌ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: యాక్సిడెంటల్ హోం మినిస్టర్ -
కొంతగ్యాప్ తర్వాత?
‘ఛాలెంజ్’, ‘చంటబ్బాయ్’, ‘రాక్షసుడు’, ‘మంచిదొంగ’, ‘ఆరాధన’ వంటి చిత్రాల్లో చిరంజీవి – సుహాసినిలది హిట్ కాంబినేషన్. కొంత గ్యాప్ తర్వాత వీరద్దరూ కలిసి నటించబోతున్నారట. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ రైట్స్‌ను నటుడు–నిర్మాత రామ్‌చరణ్ దక్కించుకున్నారు. చిరంజీవి హీరోగా ‘రన్‌రాజా రన్’, ‘సాహో’ చిత్రాల ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఈ తెలుగు రీమేక్ తెరకెక్కనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నారట సుజిత్. ఈ చిత్రంలోనే సుహాసిని ఓ కీలక పాత్ర చేయనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అదే నిజమైతే చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి–సుహాసిని స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న చిత్రం ఇదే అవుతుంది. రామ్‌చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించబోతున్నాయట. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
‘రజనీ, కమల్ కలవాలని కోరుకుంటున్నాం’
సాక్షి, పెరంబూరు : నటుడు కమలహాసన్ ఇప్పటికే పార్టీని ప్రారంభించి రాజకీయాల్లో ఉన్నారు. ఇక రజనీకాంత్ త్వరలో రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ సినీ రంగంలో మంచి మిత్రులన్న విషయం తెలిసిందే. అయితే రాజకీయాల్లోనూ కలసి పనిచేస్తే మంచి ఫలితం ఉంటుందన్న అభిప్రాయం చాలా మందిలో కలుగుతోంది. ఇటీవల సీనియర్ దర్శకుడు, నటుడు విజయ్ తండ్రి ఎస్ఏ.చంద్రశేఖర్ అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. కాగా ఇదే అంశంపై కమలహాసన్ అన్నయ్య కూతురు, నటీ సుహాసినిని ఇటీవల ఒక టీవీ ఛానల్ ప్రశ్నించింది. ఆ భేటీలో రజనీ, కమల్ కలవాలన్న దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ కోరిక గురించి నటి సుహాసిని వద్ద ప్రస్తావించారు. అందుకు ఆమె బదులిస్తూ రజనీకాంత్, కమలహాసన్ కలవాలన్నదే తమందరి కోరిక, ఆశ అని పేర్కొన్నారు. అయితే ఇది జరుగుతుందా అన్నదే తెలియడం లేదని అన్నారు. ఎందుకంటే తనకు వ్యతిరేక ఆలోచనలు కలిగిన వ్యక్తులతో ఒకే రూమ్‌లో ఐదు నిమిషాలు కూడా ఉండలేనన్నారు. కాబట్టి ఆశ పడడం సులభం అని అది నిజం అవడమే కష్టమని అన్నారు. అది మీరి వారిద్దరూ కలిస్తే తమిళనాడుకే మంచిదని అన్నారు. కమల్, రజనీ కుంటుంబాలు ఒకే నేపథ్యానికికు చెందిన వారన్నది తెలిసిందేనన్నారు. కమలహాసన్‌కు చెందిన కార్యక్రమాల కంటే రజనీకాంత్ కుటుంబానికి చెందిన కార్యక్రమాల్లోనే తాను తన తండ్రి చారుహాసన్ అధికంగా పాల్గొన్నామని, ఇదే చాలా మందికి ఆసక్తిని కలిగించే విషయమని అన్నారు. ఏదేమైనా కమల్, రజనీ రాజకీయపరంగా కలిస్తే అంతకంటే మంచి విషయం ఏముంటుందీ అన్నారు. అయితే ఇక్కడ ఎవరి సిద్ధాంతాలు వారికుంటాయన్నారు. అలా వారు వారి సిద్ధాంతాలకనుగుణంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామని సుహాసిని పేర్కొన్నారు. సినీరంగంలో రెండు ధ్రువాలుగా ఉన్న కమల్, రజనీ రాజకీయాల్లో ఒకటవడం సాధ్యమా అన్న ప్రశ్నకు బాలీవుడ్లో షారూఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్ కలిసి నటించలేదని, అలాగని వారిద్దరు రెండు ధ్రువాలు అని చెప్పగలమా అని ప్రశ్నించారు. సింపుల్ లాజిక్ ఏమిటంటే రెండు బలాలు ఒకే చోట ఉంచే కంటే పక్క పక్కన ఉంటే మరింత బలం చేకూరుతుంది అని అన్నారు. కమల్, రజనీ రాజకీయంగా కలవాలన్నది తమ ఆశనే కాకుండా, తమిళ ప్రజల కోరిక అని సుహాసిని పేర్కొన్నారు. -
రాజకీయాలు మాట్లాడిన సుహాసిని
సాక్షి, చెన్నై : రాజకీయాలకు, సినిమాకు విడదీయరాని అనుబంధం ఉంది. తమిళనాడులో అయితే అది కాస్త ఎక్కువే. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వరకూ కొన్ని దశాబ్దాలుగా సినిమా వాళ్లే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కాగా జయ మరణం అనంతరం మళ్లీ ఆ పీఠం కోసం సినిమా వాళ్లే ప్రయత్రాలు ముమ్మరం చేస్తున్నారు. విశ్వనటుడు కమల్‌హాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ తమ రాజకీయ తెరంగేట్రానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరిలో ఎవరు ముందుగా పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇస్తారు?, ఎవరు రాణిస్తారోనన్న ఆసక్తి తమిళ ప్రజలతో పాటు దేశమంతటా నెలకొంది. ఇదిలా ఉంటే సినీ మహిళాలోకం మరో పక్క కదులుతోంది. రాజకీయాలకు తామేమీ తక్కువ కాదంటున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఒక కార్యక్రమంలో నటి సుహాసిని మణిరత్నం బాహాటంగానే వెల్లడించారు. రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయ రంగప్రవేశం గురించి స్పందిస్తూ.. హీరోలే రాజకీయాల్లోకి రావాలా, తాము రాజకీయాల్లోకి రాకూడదా? అంటూ ప్రశ్నించారు. నటీమణులు రాధిక, రేవతి, పూర్ణిమా భాగ్యరాజ్, నదియ కూడా రాజకీయాల్లోకి రావడానికి సై అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ప్రజలు జయలలితకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చారు. మాకూ ఆ బాధ్యతలను అందించండి.. రాజకీయాల్లోకి రావడానికి మేమూ సిద్ధమే’ అని నటి సుహాసిని మణిరత్నం వ్యాఖ్యానించారు. దీంతో నటులకే కాదు నటీమణులకు పొలిటికల్ ఫీవర్ పట్టుకుందంటూ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. -
ఓ.కె.... మణిరత్నం
‘మేం బాగానే ఉన్నాం’ అన్నారు నటి సుహాసినీ మణిరత్నం. దర్శకుడు మణిరత్నం గుండెపోటుకు గురయ్యారనీ, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనీ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన మణిరత్నంకు గుండెపోటు వచ్చిందనే వార్త ప్రచారమైంది. ఈ వార్తల్లో నిజం లేదని సుహాసిని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. రొటీన్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లామనీ, అంతకు మించి ఏమీ లేదనీ ఆమె స్పష్టం చేశారు. తదుపరి చిత్రానికి కథ సిద్ధమవుతోందని ఆమె పేర్కొన్నారు. మణితో కలిసి, తాను దిగిన తాజా ఫోటో ట్విట్టర్లో పొందుపరిచి, ‘ఉయ్ ఆర్ ఓకే’ అని సుహాసిని పెట్టారు. -
మానవత్వం పరిమళించిన వేళ...
మానవత్వం అందరిలోనూ ఉంటుంది. కష్టంలో ఉండే తోటివారికి సాయం చేసినప్పుడు ఆ మానవత్వం పరిమళిస్తుంది అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘సచిన్’. ‘టెండూల్కర్ కాదు’ అనేది ఉపశీర్షిక. సుభాష్ ప్రొడక్షన్స్ పతాకంపై తాయికొండ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. మోహన్ దర్శకుడు. మాజీ భారత క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఇందులో క్రికెట్ కోచ్ పాత్ర పోషించారు. సుహాసిని మణిరత్నం కీలక పాత్ర చేశారు. ఈ నెల 13న విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘సుహాసిని గారికి ఈ పాత్ర నచ్చి ఎంతో అద్భుతంగా నటించారు. ‘అమ్మ’ చిత్రం తరువాత మళ్లీ ఆమెకు అవార్డు తెచ్చే చిత్రం ఇది’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేష్ రామ్‌నాథ్ కెమెరా: డి. ప్రసాద్‌బాబు, ఎడిటింగ్: శివ.