
‘ఛాలెంజ్’, ‘చంటబ్బాయ్’, ‘రాక్షసుడు’, ‘మంచిదొంగ’, ‘ఆరాధన’ వంటి చిత్రాల్లో చిరంజీవి – సుహాసినిలది హిట్ కాంబినేషన్. కొంత గ్యాప్ తర్వాత వీరద్దరూ కలిసి నటించబోతున్నారట. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ రైట్స్‌ను నటుడు–నిర్మాత రామ్‌చరణ్ దక్కించుకున్నారు. చిరంజీవి హీరోగా ‘రన్‌రాజా రన్’, ‘సాహో’ చిత్రాల ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఈ తెలుగు రీమేక్ తెరకెక్కనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నారట సుజిత్. ఈ చిత్రంలోనే సుహాసిని ఓ కీలక పాత్ర చేయనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అదే నిజమైతే చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి–సుహాసిని స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న చిత్రం ఇదే అవుతుంది. రామ్‌చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించబోతున్నాయట. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment