
ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోయిన్‌గా కొనసాగారు సుహాసిని. చిరంజీవి, బాలకృష్ణ, వెంటకేశ్ లాంటి బడా హీరోలందరితోనూ నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో తల్లి పాత్రతో పాటు సహాయక నటిగా చేస్తోంది. అయితే హీరోయిన్‌గా చేసినప్పుడు తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితుల గురించి తాజాగా ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుహాసిని మాట్లాడారు.
‘గతంలో హీరోయిన్‌గా చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కొన్ని అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తే..సున్నితంగా తిరస్కరించేదాన్ని. ఓ సినిమాలో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం ఉంది. అది చేయాలని డైరెక్టర్ చెబితే.. నేను నో చెప్పాను. పరాయి వ్యక్తి ఒడిలో కూర్చోవడం తప్పు..కాబట్టి నేను ఆ సీన్ చేయనని గట్టిగా వాధించాను.
(చదవండి: స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్!)
అదే సినిమాలో హీరో కలిసి ఐస్‌క్రీమ్ తినే సీన్ ఉంది. హీరో తిన్న ఐస్‌క్రీమ్‌నే తినాలని నాకు చెప్పారు. అది నాకు నచ్చలేదు. ‘వేరే వాళ్లు ఎంగిలి చేసింది నేను తినడం ఏంటి? ఐస్‌క్రీమ్ మార్చండి’అని ఫైర్ అయ్యాను. దీంతో కొరియోగ్రాఫర్ షాకయ్యారు. నేను చెప్పిన విధంగా చేయలని నాపైకి సీరియస్ అయ్యాడు. అయినా కూడా నేను అంగీకరించలేదు. ఐస్‌క్రీమ్ తినడం కాదు కదా కనీసం ముట్టుకోబోనని తెగేసి చెప్పారు. ఆ తర్వాత ఐస్‌క్రీమ్ మార్చారు’అని సుహాసిన చెప్పికొచిఉ‍్చంది.
Comments
Please login to add a commentAdd a comment