‘అనగనగా ఓ ప్రేమకథ’ పాటను రిలీజ్‌ చేసిన మణిరత్నం | Anaganaga O Prema Katha Song Launched By Maniratnam | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 10 2018 12:52 PM | Last Updated on Wed, Oct 10 2018 12:52 PM

Anaganaga O Prema Katha  Song Launched By Maniratnam - Sakshi

విరాజ్ జె అశ్విన్ హీరోగా పరిచయం అవుతూ ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కె సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్  దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రిద్ధి కుమార్ ,రాధా బంగారులు హీరోయిన్లుగా నటిస్తున్నారు.  సినిమా రంగంలో ప్రముఖ  ఫైనాన్షియర్‌గాగా పేరుపొందిన  నిర్మాత  కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే సినిమా ప్రమోషన్‌ జోరు పెంచిన చిత్రయూనిట్‌ తాజాగా ఓ పాటను లెజెండరీ దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ‘లవ్ అంటే నేనేలే’ సాంగ్‌ను విడుదల చేసిన మణిరత్నం చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. తమ చిత్రంలోని  పాటను మణిరత్నం విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. మలేషియాలో తెరకెక్కించిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యమందించగా దేవన్ ఆలపించారు.  షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి ప్లాన్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement