
ప్రఖ్యాత సినీదర్శకుడు మణిరత్నంను భారత్ అస్మిత రాష్ట్రీయ పురస్కారం వరించింది. పుణేకు చెందిన ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీ గత 18 ఏళ్లుగా వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులను భారత్ అస్మిత రాష్ట్రీయ అవార్డులతో సత్కరిస్తోంది. కాగా ఈసారి సినీరంగం తరపున దర్శకుడు మణిరత్నంకు ఈ అవార్డును ప్రకటించారు.
కాగా ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని భారత్ అస్మిత్ ఫౌండేషన్, ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్న్‌మెంట్ నిర్వాహకులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. గురువారం పుణెలో సోషల్ మీడియా ద్వారా నిర్వహించనున్న ఈ అవార్డుల వేడుకలో దర్శకుడు మణిరత్నంకు ఈ అవార్డు అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment