నిర్మాతను టెన్షన్‌ పెడుతున్న హీరోయిన్‌ | Trisha Tamil Movie paramapadham Vilayattu Updates | Sakshi
Sakshi News home page

నిర్మాతను టెన్షన్‌ పెడుతున్న హీరోయిన్‌

Published Mon, Feb 3 2020 9:15 AM | Last Updated on Mon, Feb 3 2020 9:15 AM

Trisha Tamil Movie paramapadham Vilayattu Updates - Sakshi

చెన్నై :  ఇప్పుడు చాలా మంది కథానాయికలు దర్శక నిర్మాతలకు టెన్షన్‌ పెట్టిస్తున్నారు. ఒక్కో నటిది ఒక్కో రకం టెన్షన్‌. కొందరు షూటింగ్‌కు సరిగా రాక దర్శక, నిర్మాతలను ఒత్తిడికి గురి చేస్తుంటే, మరొకరు పూర్తి పారితోషం చెల్లిస్తేనే చిత్రాన్ని పూర్తిచేస్తానని బెదిరిస్తుంటారు. ఇక సంచలన నటి నయనతార అయితే చిత్రానికి సంబంధించిన ఎలాంటి ప్రమోషన్‌కు రాకుండా దర్శక నిర్మాతలకు టెన్షన్‌ తెప్పిస్తుంది. ఇప్పుడు నటి త్రిష కూడా తాను నటించిన చిత్ర నిర్మాతను టెన్షన్‌కు గురిచేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే నయనతార తీరు వేరు, త్రిష తీరు వేరుగా ఉంది.

ఇప్పుడు నటి త్రిష చాలా బిజీ అన్నది తెలిసిందే. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. కాగా ఈ అమ్మడు హీరోయిన్‌ సెంట్రిక్‌ పాత్రలో నటించిన చిత్రాల్లో ఒకటి పరమపదం విళైయాట్టు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం  విడుదలకు సిద్ధమైంది. దీంతో చిత్ర వర్గాలు ప్రమోషన్‌లో భాగంగా  మీడియా సమావేశానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు ఒక తేదీని ఫిక్స్‌ చేసుకున్నారు. అందులో పాల్గొనాల్సిందిగా నటి త్రిషకు ఆహ్వానం పంపారు. అందుకు తనూ ఓకే చెప్పిందట. అయితే ఈ అమ్మడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే

ఇందులో మహారాణిగా నటించనున్నట్లు తెలిసింది. కాగా పరమపదం విళైయాట్టు చిత్ర మీడియా సమావేశం  రోజునే దర్శకుడు మణిరత్నం తన చిత్రంలోని త్రిష గెటప్‌ కోసం ఫొటో సెషన్‌ను ఏర్పాటు చేశారట. దీంతో అందులో పాల్గొననున్న త్రిష తన చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొంటుందా అన్న టెన్షన్‌ పరమపదం విళైయాట్టు చిత్ర నిర్మాతకు పట్టుకుందట. అయితే త్రిష మాత్రం తాను కచ్చితంగా మీడియా సమావేశంలో పాల్గొంటానని, సమావేశాన్ని రద్దు చేయవద్దని ఆ నిర్మాతకు మాట ఇచ్చిందట. అయినా ఆమె డుమ్మా కొడుతుందేమోనన్న టెన్సన్‌లోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే అక్కడ ఫొటో షూట్‌ జరగనుంది మణిరత్నం చిత్రానికి, అదీ రాణి గెటప్‌కు. అక్కడ గనుక ఏ మాత్రం ఆలస్యం అయినా త్రిష పరమపదం విళైయాట్టు చిత్ర ప్రమోషన్‌కు డుమ్మా కొట్టే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement