Is Trisha Plays Female Lead in Kamal Haasan, Mani Ratnam Upcoming Movie - Sakshi
Sakshi News home page

Trisha: మరో క్రేజీ ఆఫర్‌ కొట్టేసిన త్రిష? ఆ హీరోతో ముచ్చటగా మూడోసారి!

Published Tue, Jan 3 2023 4:51 PM | Last Updated on Tue, Jan 3 2023 5:51 PM

Is Trisha Plays Female Lead in Kamal Haasan, Mani Ratnam Upcoming Movie - Sakshi

నాలుగు పదుల వయసులోనూ త్రిష క్రేజ్‌ కొనసాగుతోంది. తన కెరీర్‌ ముగిసిపోయిందంటూ ప్రచారం జరిగినప్పుడల్లా ఆమె ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారనే చెప్పవచ్చు. ఆ మధ్య త్రిష సినిమాలకు లాంగ్‌ బ్రేక్‌ ఇచ్చింది. అదే సమయంలో ఇక ఆమెకు సినిమాలకు దూరమైందని అంతూ అనుకుంటున్న సమయంలో తమిళ చిత్రం  96 విజయంతో మంచి కమ్‌ బ్యాక్‌ ఇచ్చింది. ఇప్పుడు పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంతో రీఎంట్రీ అయ్యిందనే చెప్పాలి. ఈ మూవీ విజయంతో త్రిష కెరీర్‌ మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం ఆమె తమిళంలో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అందుకలో పలువురు స్టార్‌ హీరోల చిత్రాలు ఉండటం విశేషం.

చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన పునర్నవి

మంగాత్తా, ఎన్నై అరిందాల్‌ వంటి హిట్‌ చిత్రాల తరువాత అజిత్‌తో జతకట్టడానికి సిద్ధం అవుతుందామె. అలాగే విజయ్‌ 67వ చిత్రంలోనూ నటించనుంది. ఈ నేపథ్యంలో త్రిష కోసం మరో క్రేజీ ఆఫర్‌ ఎదురు చూస్తున్నట్లు సమాచారం. విక్రమ్‌ చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన విలక్షణ నటుడు కమలహాసన్‌ తన తదుపరి చిత్రం మణిరత్నంతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన 234వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈయన ఇటీవల తెరకెక్కించిన పొన్నియిన్‌ సెల్వన్‌ తొలి భాగం విజయం సాధించింది. కాగా దీని రెండో భాగం ఏప్రిల్‌ 28వ తేదీ విడుదలకు ముస్తాబవుతుంది.

చదవండి: వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి? త్వరలోనే అధికారిక ప్రకటన!

ఆ తర్వాత విక్రమ్‌ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు మణరత్నం. వీరి కాంబోలో నాయకన్‌ వంటి సంచలన హిట్‌ చిత్రం రూపొందింది. కాగా సుమారు 35 ఏళ్ల తర్వాత  మళ్లీ ఇప్పుడు ఈ కాంబో రిపీట్‌ కానుంది. ఈ క్రేజీ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ నిర్మించనుంది. ఇందులో కమలహాసన్‌కు జంటగా త్రిషను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా త్రిష ఇంతకుముందు కమలహాసన్‌కు జంటగా మన్మదన్‌ అన్బు, తూంగావనం చిత్రాల్లో నటించింది. అంత ఒకే అయితే ఇప్పుడు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆయనతో నటించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం కమల్‌ ఇండియన్‌ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement