Kamal Haasan on KH 234: We Are Planning To Make A Strong Film Just Like Nayakan - Sakshi
Sakshi News home page

KH 234: నాయకుడులాంటి సినిమా ఇస్తాం 

Published Wed, May 31 2023 7:52 AM | Last Updated on Wed, May 31 2023 1:01 PM

KH 234: Kamal Haasan Say We Are Planning To Make A Strong Film Just Like Nayak - Sakshi

మూడు దశాబ్దాల క్రితం వచ్చిన శక్తిమంతమైన చిత్రాల్లో ‘నాయగన్‌’ (నాయకుడు–1987 ) ఒకటి. మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. 35 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇటీవల ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. మరో రెండు మూడు నెలల్లో ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభం కానుంది.

ఈ చిత్రం గురించి కమల్‌హాసన్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ – ‘‘మణిరత్నంతో ఈ సినిమా గురించి చర్చిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌కి భారీ అంచనాలు ఉంటాయి. ఆ విషయంలో కాస్త ఒత్తిడి ఉంది. అయితే కచ్చితంగా ‘నాయగన్‌’లా ఒక శక్తిమంతమైన చిత్రాన్ని ఇస్తాం’’ అని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement