35 ఏళ్ల తర్వాత మరోసారి జతకడుతోన్న కమల్‌-మణిరత్నం | Kamal Haasan, Mani Ratnam Reunite After 35 Years | Sakshi
Sakshi News home page

Kamal Haasan-Mani Ratnam: 35 ఏళ్ల తర్వాత మరోసారి జతకడుతోన్న కమల్‌-మణిరత్నం

Published Mon, Nov 7 2022 10:00 AM | Last Updated on Mon, Nov 7 2022 10:00 AM

Kamal Haasan, Mani Ratnam Reunite After 35 Years - Sakshi

ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ తన బర్త్‌ డే (నవంబరు 7) సందర్భంగా ఫ్యాన్స్‌కు సూపర్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు కమల్‌హాసన్‌. దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా ఇదే కావడం విశేషం. 1987లో వారిద్దరి కాంబోలో ‘నాయకన్‌’(తెలుగులో ‘నాయకుడు’) అనే హిట్‌ సినిమా వచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కలిసి పనిచేయబోతున్నారు కమల్‌-మణిరత్నం.

చదవండి: ఆదిపురుష్‌ వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన ఓం రౌత్‌

ఉదయనిధి స్టాలిన్‌ సమర్పణలో కమల్‌ హాసన్, మణిరత్నం, ఆర్‌. మహేంద్రన్, శివ అనంత్‌ ఈ కొత్త సినిమా నిర్మించనున్నారు. కమల్‌ కెరీర్‌లో 234వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని 2024లో రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. ‘‘ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మణిరత్నంగారితో పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహంతో ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. ఈ ఉత్సాహానికి ఏఆర్‌ రెహమాన్, ఉదయనిధి స్టాలిన్‌ తోడవ్వడం హ్యాపీ’’ అన్నారు కమల్‌హాసన్‌. ‘‘కమల్‌సర్‌తో మళ్లీ వర్క్‌ చేయడం సంతోషంగా, గర్వంగా, గౌరవంగా ఉంది’’అన్నారు మణిరత్నం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement