నెగెటివ్‌ రోల్‌లో ఐశ్వర్య రాయ్‌ | Aishwarya Rai Bachchan in Mani Ratnam Next | Sakshi
Sakshi News home page

నెగెటివ్‌ రోల్‌లో ఐశ్వర్య రాయ్‌

Published Thu, May 16 2019 1:32 PM | Last Updated on Thu, May 16 2019 1:33 PM

Aishwarya Rai Bachchan in Mani Ratnam Next - Sakshi

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ మరో చాలెంజింగ్ రోల్‌కు రెడీ అవుతున్నారు. పెళ్లి తరువాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఐశ్‌, ఓ లెజెండరీ దర్శకుడి సినిమాలో నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్నారు. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా పొన్నియన్‌ సెల్వన్‌. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్నారు.

10వ శతాబ్ధానికి చెందిన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్యాధికారం కోసం కుట్రలు చేసే నందిని అనే పాత్రలో ఐశ్‌ కనిపించనున్నారట. విక్రమ్‌, శింబు, జయం రవిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అమలాపాల్‌ కీలక పాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement