శృంగారం, కరుణ, శాంతం, హాస్యం, అద్భుతం, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం... ఈ నవరసాల నేపథ్యంలో తొమ్మిది కథలతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన వెబ్ సిరీస్ ‘నవరస’. ఒక్కో భాగానికి ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సూర్య, సిద్ధార్థ్, ప్రకాశ్‌రాజ్, విజయ్ సేతుపతి, రేవతి, ఐశ్వర్యరాజేశ్, అరవింద్ స్వామి, రోబో శంకర్, యోగిబాబు, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్.. ఆగస్టు 6 నుంచి ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ని విడుదల చేసింది.
టైటిల్‌కి తగ్గట్టుగానే తొమ్మిది రకాల భావోద్వేగాలను ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. నేపథ్య సంగీతం ట్రైలర్‌కి మరింత బలం చేకూర్చింది. సూర్య, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, రేవతి, అశోక్, అరవింద్ స్వామి లాంటి ఆగ్రతారలంతా ఒకే తెరపై కనిపించడం కొత్త అనుభూతిని కలిగించింది. అంజలి ప్రెగ్నెన్సీ మహిళగా కనిపించి షాకిచ్చింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా వచ్చిన మొత్తాన్ని కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు అందజేయడానికి కోలీవుడ్ పరిశ్రమ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment