లవ్‌ అంటే నేనేలే... | Anaganaga O Prema Katha Song Launch | Sakshi
Sakshi News home page

లవ్‌ అంటే నేనేలే...

Published Thu, Oct 11 2018 2:25 AM | Last Updated on Thu, Oct 11 2018 2:25 AM

Anaganaga O Prema Katha Song Launch - Sakshi

విరాజ్‌. జె అశ్విన్, ప్రతాప్, అంజన్, మణిరత్నం

విరాజ్‌.జె అశ్విన్‌ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. రిద్ధీ కుమార్, రాధా బంగారు కథానాయికలుగా నటించారు. టి.ప్రతాప్‌ దర్శకత్వం వహించారు. కె. సతీష్‌ కుమార్‌ సమర్పణలో కె.ఎల్‌.యన్‌.రాజు నిర్మించిన ఈ సినిమాలోని ‘లవ్‌ అంటే నేనేలే..’ పాటను  ప్రముఖ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘లవ్‌ అంటే నేనేలే’ పాటకు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని అభినందనలు తెలిపారు.

కె.ఎల్‌.యన్‌.రాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమాలోని పాటను మణిరత్నంగారు విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది. ‘లవ్‌ అంటే నేనేలే..’ పాటను శ్రీమణి రచించగా, దేవన్‌ ఆలపించారు. ఈ సాంగ్‌ని మలేసియాలోని పలు సుందరమైన లొకేషన్‌లలో చిత్రీకరించాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. కాశీ విశ్వనాథ్, అనీష్‌ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, కెమెరా: ఎదురొలు రాజు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement